Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇంటర్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ సూపర్ వైజర్స్ (ఐఎఐఎస్)కు చెందిన మల్టిలేటరల్ మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ (ఎమ్ఎమ్ఒయు)పై సంతకందారుగా ఐఆర్ డిఎఐ ని చేర్చుకున్నందుకు ఆమోదాన్ని తెలియజేసిన మంత్రివర్గం


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం, ఇంటర్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ సూపర్ వైజర్స్ (ఐఎఐఎస్)కు చెందిన మల్టిలేటరల్ మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ (ఎమ్ఎమ్ఒయు)పై ఒక సంతకందారుగా ఐఆర్ డిఎఐ ని చేర్చుకొనేందుకు ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.

బీమా పర్యవేక్షక సంస్థల మధ్య సమాచారం ఆదాన ప్రదానానికి మరియు పరస్పర సహకారం కోసం ఏర్పాటైన ఒక గ్లోబల్ ఫ్రేమ్ వర్క్ యే ది ఇంటర్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ సూపర్ వైజర్స్ (ఐఎఐఎస్). ఇక ఇంటర్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ సూపర్ వైజర్స్ కు చెందిన మల్టిలేటరల్ మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ (ఎమ్ఎమ్ఒయు) అనేది, సమాచార ఆదాన ప్రదాన రంగంలో సహకరించే ఉద్దేశం ఉన్న మరియు సమాచారం కోరిన అభ్యర్థనలను పరిష్కరించే ప్రక్రియతో కూడిన సంతకందారుల ప్రకటన పత్రం. ఫైనాన్షియల్ మార్కెట్ యొక్క ఏకీకరణ ప్రక్రియ అధికం అవుతూ ఉండడం తోను, అంతర్జాతీయంగా క్రియాశీలంగా ఉంటున్న బీమా కంపెనీల సంఖ్య అంతకంతకు పెరుగుతూ ఉండడం తోను బీమా పరిశ్రమ పర్యవేక్షక సంస్థలకు తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఇతర బీమా పర్యవేక్షక సంస్థలకు ఇచ్చి వాటి నుండి అదే కోవకు చెందిన సమాచారాన్ని తాము పుచ్చుకోవలసిన అవసరంతో పాటు పరస్పరం సహకరించుకోవలసిన అవసరం కూడా పెరిగిపోయింది. ఈ పూర్వరంగంలో, ఇంటర్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ సూపర్ వైజర్స్ (ఐఎఐఎస్)కు చెందిన మల్టిలేటరల్ మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ (ఎమ్ఎమ్ఒయు) పై ఐఆర్ డిఎఐ సంతకం చేసింది (అందులో తాను కూడా ఒకటిగా చేరింది.) ద్వైపాక్షిక ఒప్పందాలు ఏవీ లేని పక్షంలో, సీమాంతర అంశాలు తలెత్తినప్పుడు- బీమా కంపెనీల పర్యవేక్షణకు సంబంధించి సంతకందారు ప్రాధికార సంస్థల మధ్య సమాచార మార్పిడికి మరియు సహకారానికి ఐఎఐఎస్ కు చెందిన మల్టిలేటరల్ మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ ఒక లాంఛనప్రాయమైనటువంటి ఆధారభూతమవుతుంది. ఇప్పుడున్న ఒప్పందాల కన్నా ఐఎఐఎస్ కు చెందిన మల్టిలేటరల్ మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ యొక్క పరిధి విస్తృత‌మైంది. ఎలాగంటే, ఈ ఒప్పందం యాంటి- మనీ లాండరింగ్ (ఎఎమ్ఎల్) మరియు కంబాటింగ్ ది ఫైనాన్షియల్ టెర్రరిజమ్ (సిఎఫ్ టి) ల పరిధిలోని బీమా మధ్యవర్తిత్వ సంస్థల వంటి నియంత్రణదారు సంస్థల పర్యవేక్షణకు సైతం వీలు కల్పిస్తుంది.