Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇంటర్ నేషనల్ కాంటినెంటల్ సైంటిఫిక్ డ్రిల్లింగ్ ప్రోగ్రామ్ లో భారతదేశ సభ్యత్యానికి మంత్రిమండలి ఆమోదం


ఇంటర్ నేషనల్ కాంటినెంటల్ సైంటిఫిక్ డ్రిల్లింగ్ ప్రోగ్రామ్ (ఐ సి డి పి) లో భారతదేశం సభ్యత్వానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. జర్మనీకి చెందిన భూగోళ శాస్త్రాల పరిశోధనా సంస్థ హెల్మ్హోల్ట్జ్ సెంటర్ పొట్స్ డామ్ జి ఎఫ్ జెడ్ తో ఎమ్ ఒ యు కుదుర్చుకోవడం ద్వారా ఈ సభ్యత్వం లభిస్తుంది. ఈ సంస్థ జర్మనీ దేశంలోని బ్రాండెన్ బర్గ్ కు చెందిన పబ్లిక్ లా ఫౌండేషన్. దీనికి జర్మనీ ప్రభుత్వం నిధులు సమకూరుస్తున్నది.

ఐ సి డి పి లో ఈ సభ్యత్వం కాల పరిమితి ఐదు సంవత్సరాలు. ఈ సభ్యత్వం కారణంగా ఈ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో పేరుగల నిపుణుల సాయంతో భారతదేశంలోని కోయ్నా క్షేత్రంలో డీప్ డ్రిల్లింగ్ కార్యక్రమాలను చేపట్టవచ్చు. ఐ సి డి పి ప్యానెల్స్లో భారతదేశ నిపుణులకు చోటు దక్కుతుంది. ఎగ్జిక్యూటివ్ కమిటీ, అసెంబ్లీ ఆఫ్ గవర్నర్స్ అనేవి ఈ రెండు ప్యానెళ్లు. భారతదేశ భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ చేపట్టే కోయ్ నా సైంటిఫిక్ డీప్ డ్రిల్లింగ్ ప్రాజెక్ట్ నిర్వహణకు సాంకేతిక, నిర్వహణపరమైన సహకారాన్ని ఐ సి డి పి అందిస్తుంది. కీలకమైన శాస్త్ర విభాగాల్లో మానవ వనరుల శిక్షణకు సహకరిస్తుంది.

ఐ సి డి పిలో సభ్యత్వం కారణంగా భారతదేశానికి చెందిన శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు వారి ప్రతిపాదనలను ఐ సి డి పి కి సమర్పించవచ్చు. ఐ సి డి పి నిధులందించే వర్క్ షాపులలో, డ్రిల్లింగ్ ప్రాజెక్టులలో పాల్గొనవచ్చు. ఐ సి డి పి ప్రాజెక్టుల ద్వారా వచ్చే సమాచారాన్ని తెలుసుకోవచ్చు. భూకంపాలను అవగాహన చేసుకోవడానికి మార్గం సుగమం అవుతుంది.