పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆదాయపు పన్ను శాఖ ప్రతిపాదించిన మేరకు ఇంటిగ్రేటెడ్ ఇ ఫైలింగ్, సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ 2.0 ప్రాజెక్టుపై రూ.4241.97 కోట్ల వ్యయం మంజూరుకు ఆమోదం తెలిపింది.
2018-19 ఆర్థిక సంవత్సరం వరకు అమలులో ఉన్న సిపిసి-ఐటిఆర్ 1.0 ప్రాజెక్టు కన్సాలిడేటెడ్ వ్యయం రూ.1482.44 కోట్ల మంజూరుకు కూడా ఆమోదముద్ర వేసింది.
ఈ ప్రాజెక్టు స్థూల లక్ష్యాలు…
ఎ. పన్ను చెల్లింపుదారులకు సత్వరం, సరైన ఫలితం
బి. తొలిసారి సరైన దిశగా ప్రయత్నం
సి. అన్ని దశల్లోనూ యూజర్ కు కొత్త అనుభవం
డి.. నిరంతర విద్యా కార్యక్రమాల ద్వారా పన్ను చెల్లింపుదారుల్లో మెరుగైన చైతన్యం
ఇ. స్వచ్ఛంద పన్ను చెల్లింపులకు ప్రోత్సాహం
ఎఫ్. డిమాండుకు దీటుగా నిర్వహణ
దీని ద్వారా పన్ను చెల్లింపుదారులు, ఐటి శాఖలకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఐటిఆర్ ల ప్రీఫైలింగ్, అనుమతి విధానాలు మెరుగుపడి తప్పొప్పులు లేని నిర్ణయాలు తీసుకునే వీలు కలుగుతుంది. రిఫండ్/ ప్రాసెసింగ్ సమయం కూడా గణనీయంగా తగ్గుతుంది. పన్ను చెల్లింపుదారుల డిమాండ్లు సత్వరం పరిష్కరించగలుగుతారు. పన్ను చెల్లింపుదారుల సహాయానికి, డిజిటల్ మీడియా ద్వారా వారికి మరింత చేరువ అయ్యేందుకు ఇంటిగ్రేటెడ్ కాంటాక్ట్ సెంటర్లు నిర్వహించే కార్యక్రమాలు, యజమానులు/ భాగస్వాముల అక్రెడిటేషన్ కార్యక్రమం వంటివి ఐటి శాఖ కార్యకలాపాల్లో గణనీయమైన మార్పును తీసుకువస్తాయి.
ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా అన్ని పన్ను శ్రేణుల్లోని చెల్లింపుదారులు దాఖలు చేసే రిటర్న్ లు సమాంతరంగా ఒకే విధంగా, తప్పొప్పులకు తావు లేకుండా, నిబంధనలకు అనుగుణంగా ప్రాసెసింగ్ చేసేందుకు దోహదపడుతుంది. హోదాతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్క పన్ను చెల్లింపుదారుని విషయంలోను నిష్పాక్షికతకు భరోసా లభిస్తుంది.
తరచుగా ఆదాయపు పన్ను శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని తప్పుతుంది. అంతర్జాతీయ అత్యుత్తమ విధానాలు, ప్రమాణాలకు (ఐఎస్ఓ సర్టిఫికేషన్) దీటుగా రిటర్నుల సత్వర ప్రాసెసింగ్, పన్ను చెల్లింపుదారుల బ్యాంకు ఖాతాల్లోనే రిఫండ్ లు జమ చేయడం వంటివి చేయగలుగుతారు. ఎప్పటికప్పుడు రిటర్నుల పరిస్థితి ఏమిటి అన్న సమాచారం మొబైల్ యాప్, ఇ మెయిల్, ఎస్ఎంఎస్ల రూపంలోను, ఆదాయపు పన్ను శాఖ వెబ్ సైట్ ద్వారాను పన్ను చెల్లింపుదారులకు అందించే వీలు కలిగి పారదర్శకత, బాధ్యతాయుత ధోరణి పెరుగుతాయి.
టెక్నాలజీ ద్వారా కార్యకలాపాల్లో పరివర్తన తీసుకురావాలన్న ఆదాయపు పన్ను శాఖ లక్ష్యం కొనసాగించే దిశగా భరోసా కల్పించగలుగుతారు. ఆధునిక విధానాల ద్వారా పన్ను చెల్లింపుదారుల సేవలు మెరుగుపరిచి, స్వచ్ఛంద పన్ను చెల్లింపు ధోరణులను ప్రోత్సహించేందుకు, అంతర్గతంగా ఆదాయపు పన్ను శాఖలో ప్రతీ స్థాయిలోనూ ఆటోమేషన్ అమలుపరిచేందుకు ఇ-ఫైలింగ్, సిపిసి ప్రాజెక్టులు దోహదకారి అవుతాయి.