పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (ఎక్స్ టెన్షన్ టు జమ్ము & కశ్మీర్ ) ఆర్డినెన్స్, 2017 జారీకి మరియు ఆర్డినెన్స్ స్థానంలో ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (అమెండ్ మెంట్) బిల్లు, 2017 ప్రవేశపెట్టడానికి
ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.
ఆర్డినెన్సు ఐజిఎస్ టి యాక్టు గా నిర్దేశిస్తున్న ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ యాక్టు, 2017 లోని అంశాలను జమ్ము & కశ్మీర్ రాష్ట్రానికి విస్తరించింది.
ఆర్డినెన్సు ను 2017 జులై 8వ తేదీన జారీ చేయడమైంది. కాగా, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (అమెండ్ మెంట్) బిల్లు, 2017 ను పార్లమెంట్ ప్రస్తుత సమావేశాలలో ప్రవేశపెడతారు.