పిఎంఇండియా
శ్రేష్ఠులైన ఇటలీ ప్రధాని, ప్రొఫెసర్ జ్యూసెపె కాంటే, మంత్రిమండలి లో నా సహచరుడు డాక్టర్ హర్ష్ వర్థన్, భారతదేశం నుండి, ఇంకా ఇటలీ నుండి ఈ టెక్ సమిట్ కు తరలివచ్చినటువంటి ప్రముఖ టెక్నక్రాట్ లు, మహిళలు మరియు సజ్జనులారా,
అభినందనలు! నమస్కారం,
Ciao!Comestai!*
ప్రత్యేకించి ఇటలీ నుండి ఈ శిఖర సమ్మేళనానికి తరలి వచ్చిన మా అతిథులందరికీ నేను నా యొక్క హృదయపూర్వక అభినందనలను తెలియజేస్తున్నాను.
Benvenuto* in India!
మిత్రులారా,
ఇది 24వ టెక్ సమిట్. ఈ శిఖర సమ్మేళనం లో ప్రధాని ప్రొఫెసర్ కాంటే తో పాటు ఇటలీ ఒక భాగస్వామ్య దేశం గా పాలుపంచుకోవడం మాకు గర్వకారణం.
ఈ కార్యక్రమాని కన్నా ముందు ప్రధాని ప్రొఫెసర్ కాంటే తో నేను జరిపిన సమావేశం లో మేం ఉభయులం ఒక సుదీర్ఘ సంభాషణ ను సాగించాం. భారతదేశం తో సంబంధాల పట్ల ఆయన లో ఉన్న ఉత్సాహాన్ని, నిబద్ధత ను నేను గమనించాను.
ఈ సంవత్సరం భారతదేశం, ఇటలీ ల దౌత్య సంబంధాల లో 70వ సంవత్సరం కావడం వల్ల కూడా ఈ ఏడాది ఒక ఘనమైన సంవత్సరం గా నిలచిపోనుంది. ఈ సంవత్సరం లో మనం విజ్ఞాన శాస్త్రం, ఇంకా సాంకేతిక విజ్ఞాన రంగం లో సహకరించుకొనే అంశం పై 40 సంవత్సరాలు పూర్తి అయిన మైలు రాయి ని కూడా నెలకొల్పగలిగాం. ఈ కారణంగా ఈ తరుణం లో ప్రధాని ప్రొఫెసర్ కాంటే భారతదేశాన్ని సందర్శించడం ఒక అమిత ప్రాముఖ్యం కలిగిన సందర్భం.
మిత్రులారా,
మనం ఇప్పుడు ఉన్న యుగం లో సాంకేతిక విజ్ఞానం అంతటా వ్యాపించి మరి దాని తోడు లేకుండా జీవించడం ఊహ కు కూడా అందనిది అవుతోంది. ప్రస్తుతం దాదాపు గా ప్రతి ఒక్కరి జీవనం ఏదో ఒక రూపం లో సాంకేతిక విజ్ఞానం తో ముడిపడింది. గత కొన్ని సంవత్సరాల లో సాంకేతిక విజ్ఞాన రంగం లో ఒక శర వేగవంతమైన మార్పు చోటు చేసుకుంది. దీని వేగం ఎంతో ఎక్కువ గా ఉంది. అది ఎలా ఉందంటే సాంకేతిక విజ్ఞానం యొక్క లాభాలు సమాజం లోని చిట్టచివరి వర్గానికి అందే లోపున, ఒక కొత్త అధునాతమైన సాంకేతిక విజ్ఞానం మొగ్గ తొడుగుతోంది. ఈ పరిస్థితి లో మారుతున్న సాంకేతిక విజ్ఞానం తో పోటీ పడడానికి అన్ని దేశాల ఎదుటా సవాళ్ళు వచ్చి నిలుస్తున్నాయనేది నిస్సందేహం. అయితే, ఇది నూతన అవకాశాల కు అనేకమైన తలుపుల ను కూడా తెరచింది.
భారతదేశం సామాజిక న్యాయం, సాధికారిత అన్ని వర్గాల కు చేరువగా వెళ్ళడం, సమర్ధమైన పాలన, ఇంకా పారదర్శకత్వానికి ఒక సాధనం గా సాంకేతిక విజ్ఞానాన్ని మార్చుకొంది. ప్రభుత్వ సేవలు సమాజం లోని అట్టడుగు వర్గానికి సైతం అందజేసే ప్రక్రియ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఏకీకృతం అవుతోంది. ప్రత్యేకించి డిజిటల్ టెక్నాలజీ యొక్క సమగ్రమైన మౌలిక సదుపాయాల ను ఏ రీతి న అభివృద్ధి పరచడం జరుగుతోందంటే తద్వారా ఈ సదుపాయాల తాలూకు ప్రయోజనాల ను సాధారణ ప్రజానీకం ఇట్టే పొందవచ్చునన్న మాట. మేం సాంకేతిక విజ్ఞానాన్ని జీవన సరళత్వ సాధన లో ఒక ముఖ్యమైన మాధ్యమంగా ఎంచుకొన్నాం.
మిత్రులారా,
ప్రస్తుతం ప్రపంచం లో కెల్లా అతి పెద్ద ప్రత్యక్ష ప్రయోజన పథకం భారతదేశం లో అమలవుతోంది. పౌరులు ప్రభుత్వ ప్రయోజనాల ను నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో అందుకొంటున్నారు. అది జనన ధ్రువ పత్రం కావచ్చు, లేదా వృద్ధాప్య పించన్ కావచ్చు.. అనేక సదుపాయాలు ప్రస్తుతం ఆన్లైన్ లో లభ్యం అవుతున్నాయి. ఉమంగ్ యాప్ (Umang App) ద్వారా 300కు పైగా కేంద్రాల ను మరియు రాష్ట్ర ప్రభుత్వ సేవల ను ఒకే వేదిక మీదకు తీసుకురావడమైంది.
డిజిటల్ పేమెంట్స్ ప్రస్తుతం ఒక్కొక్క నెల కు రెండున్నర మిలియన్ లావాదేవీల వేగం తో వృద్ధి ని నమోదు చేసుకొంటున్నాయి. మూడు లక్షల కు పైగా కామన్ సర్వీస్ సెంటర్ లు దేశ వ్యాప్తంగా అనేక పల్లెల్లో ఆన్లైన్ సేవ లను అందిస్తున్నాయి.
గత నాలుగు సంవత్సరాల లో భారతదేశం లో ఒక జిబి డాటా ఖర్చు 90 శాతానికి పైగా తగ్గిపోయింది. భారతదేశం లో డాటా ఈ విధంగా చౌకగా అందుబాటు లోకి రావడం అనేది దేశం లో ప్రతి ఒక్క వ్యక్తి కి డిజిటల్ టెక్నాలజీ ని సమకూర్చడానికి ఒక దీటైన మాధ్యమం గా నిరూపణ అయింది.
మిత్రులారా,
భారతదేశం ప్రస్తుతం ఐటి సాఫ్ట్వేర్ శక్తి యొక్క గుర్తింపు ను తదుపరి మెట్టు కు చేర్చడం కోసం ముందంజ వేస్తోంది. మేము భారతదేశాన్ని ‘సైంటిఫిక్ టెంపర్’ నుండి ‘టెక్నలాజికల్ టెంపరమెంట్’ కు చేర్చేందుకు ప్రోత్సహిస్తున్నాం.
‘అటల్ ఇనవేశన్ మిశన్’ ద్వారా దేశం లో యువతీయువకుల నెట్వర్క్ ను సిద్ధం చేయడం జరుగుతోంది. ఇది నాలుగో పారిశ్రామిక విప్లవం యొక్క అత్యంత దృఢమైన స్తంభం గా మారుతుందని ఆశిస్తున్నాం. దేశవ్యాప్తంగా ‘అటల్ టింకరింగ్ ల్యాబ్స్’ ను ఏర్పాటు చేయడం ద్వారా పాఠశాలల్లో భవిష్యత్తు తరానికి చెందిన నవ నూతన ఆవిష్కరణలు మరియు సాంకేతిక విజ్ఞానం కోసం ‘టెక్నలాజికల్ టెంపరమెంట్’ కు ఊతాన్ని ఇవ్వడం జరుగుతోంది.
ప్రభుత్వ కృషి ఫలితం గా వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేశన్ (డబ్ల్యుఐపిఒ) వెలువరించే ప్రపంచ నూతన ఆవిష్కరణ సూచీ స్థానాల లో మేం 21 స్థానాలు ఎగబాకాం. దీనికి తోడు ప్రస్తుతం భారతదేశం ప్రపంచం లో కెల్లా రెండో అతి పెద్ద స్టార్ట్-అప్ ఇకో సిస్టమ్ గా నిలచిన ఖ్యాతి ని దక్కించుకొంది.
భారతదేశం లో చోటు చేసుకొనే నూతన ఆవిష్కరణల లో గుణాత్మకత విషయం లో సైతం శ్రద్ధ వహించడం జరుగుతోంది. భారతదేశం యొక్క అంతరిక్ష కార్యక్రమం దీనికి ఒక ఘనమైన ఉదాహరణగా ఉంది; ఈ సాఫల్యాన్ని ఇటలీ సైతం గమనించింది.
నేడు ప్రపంచం లోని ఇటలీ, ఇంకా పలు ఇతర దేశాల మాదిరిగానే ఉపగ్రహాల ను అతి తక్కువ వ్యయం తో రోదసి లోకి పంపించడం లో భారతదేశం విజయవంతమైంది. అవి ఉపగ్రహ సంబంధిత సాంకేతిక విజ్ఞానం తాలూకు లాభాల ను ప్రతి ఇంటి ముంగిట కు చేర్చడం లో దోహదపడుతున్నాయి.
మిత్రులారా,
ఈ రోజు న ప్రపంచం చేపట్టిన ‘ఇండస్ట్రీ 4.0’ ను గురించిన చర్చ భారతదేశం, ఇటలీ ల ప్రాచీన నాగరకతల మధ్య సహకారాన్ని పటిష్ట పరచుకోవడం, నూతన అవకాశాలను సృష్టించడమే కాకుండా సవాళ్ళ ను తగిన విధంగా పరిష్కరించడం లో కూడా సహాయకారి కాగలదు.
మిత్రులారా,
ఇవాళ భారతదేశం ప్రపంచం లో అత్యంత వేగంగా వర్ధిల్లుతున్న ఆర్థిక వ్యవస్థ లలో ఒకటిగా ఉంది. భారతదేశం లోని విస్తారమైన దేశీయ విపణి యువ జనాభా మరియు సాంకేతిక విజ్ఞానం, ఇంకా నూతన ఆవిష్కరణల వ్యవస్థ లు ప్రపంచం లో వృద్ధి కి ఒక బలమైన చోదక శక్తి గా నిలవడమనేది తథ్యం.
విజ్ఞాన శాస్త్రం, ఇంకా సాంకేతిక విజ్ఞానం లో ఇటలీ ఒక సంపన్నమైన వారసత్వాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా అత్యుత్తమ నాణ్యత తో కూడిన తయారీ రంగానికిగాను ఇటలీ పేరు తెచ్చుకొంది. అందువల్ల భారతదేశం, ఇటలీ లు కలసికట్టుగా ఉన్నతమైన నాణ్యత కలిగిన పరిశోధన లో వాటి సహకారాన్ని పటిష్ట పరచుకొని ప్రపంచ సవాళ్ళ ను ఎదుర్కొని, వాటిని పరిష్కరించగలిగే సాంకేతిక విజ్ఞానం సంబంధిత సాధనాలను తయారు చేయగలుగుతాయి.
మరి ఈ కారణం తోనే ఈ రెండు దేశాలు విజ్ఞాన శాస్త్రం, ఇంకా సాంకేతిక విజ్ఞానం సంబంధిత సహకారాన్ని బలోపేతం చేసుకొనే మానవ శ్రేయం, స్వచ్ఛ పర్యావరణం లతో పాటు ప్రజల జీవన సరళి ని మెరుగుపరచడానికి అగ్రతాంబూలాన్ని కట్టబెట్టవలసి ఉంది. అత్యధునాతమైన పరిశోధనలు, ఇంకా నూతన ఆవిష్కరణల రంగాల లో ఉభయ దేశాల శాస్త్రవేత్తల సముదాయం, వ్యాపార ప్రముఖులు సహకరించుకుంటూ ఉండడం నాకు సంతోషంగా వుంది. మనం మన సుసంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించుకోవడం కోసం నవీకరణయోగ్య శక్తి, పర్యావరణ సంబంధిత విజ్ఞాన శాస్త్రం, న్యూరో సైన్స్, ఇంకా ఐటి ల వంటి రంగాల లో విస్తృత సహకారాన్ని నెలకొల్పుకొన్నాం.
మిత్రులారా,
ఈ సహకారాన్ని పటిష్ట పరచుకోవడం తో పాటు, పరిశోధన, ఇంకా అభివృద్ధి ఫలితాలు ఒక్క ప్రయోగశాల లకు మాత్రమే పరిమితం కాకుండా సమాజానికి, సాధారణ ప్రజానికానికి తత్ఫలితాలు అందేలా చూడాలనేది కూడా మన లక్ష్యం గా వుంది. అందుకే నేను ఎల్లప్పుడూ ‘‘విజ్ఞాన శాస్త్రం సార్వజనికం, సాంకేతిక విజ్ఞానం స్థానికంగా పెంపొందాలి’’ అని చెప్తూ ఉంటాను.
భారతదేశం లో మేము చారిత్రక వారసత్వాన్ని పరిరక్షించుకోవడం కోసం ‘‘సైన్స్ అండ్ హెరిటేజ్ రిసర్చ్ ఇనిశియేటివ్-ఎస్హెచ్ఆర్ఐ’’ ని ఆరంభించుకొన్నాం. దీని ధ్యేయమల్లా చారిత్రక కట్టడాల పరిరక్షణ కు మరియు పునరుద్ధరణ కు అనువైన సాంకేతిక విజ్ఞాన సంబంధ పరిష్కార మార్గాలను అన్వేషించడమే. సాంకేతిక విజ్ఞానం, పర్యటనలు మరియు చరిత్ర.. ఈ మూడింటి సమ్మేళనమే ఎస్హెచ్ఆర్ఐ.
విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం, ఇంకా నూతన ఆవిష్కరణ.. వీటిని ప్రోత్సహించడం ద్వారా అభివృద్ధి కి నూతన వేగాన్ని జోడించవచ్చని మేం నమ్ముతాం. మన ద్వైపాక్షిక సంబంధాల వికాసం లో కూడా వీటికి ఒక ముఖ్యమైన భూమిక ఉంది. ఈ టెక్ సమిట్ యొక్క కీలక కార్యాచరణ లో ఇది ఒకటి.
గత రెండు రోజులుగా సాగిన ఈ శిఖర సమ్మేళనం రెండు దేశాల మధ్య సాంకేతిక విజ్ఞానం బదలాయింపు, సంయుక్త సంస్థలు, ఇంకా విపణి లభ్యత లను పెంపొందించడం లో తోడ్పడ గలదు. ఇది మన దేశాల మధ్య భావి పరస్పర సహకారం సంబంధిత చర్చ లలో ఒక ముఖ్య పాత్ర ను కూడా తప్పక పోషించగలదు.
మిత్రులారా,
నేడు భారతదేశం, ఇటలీ ల ద్వైపాక్షిక పారిశ్రామిక పరిశోధన మరియు అభివృద్ధి సంబంధ సహకార కార్యక్రమం యొక్క తదుపరి దశ ను ప్రారంభించుకొంటున్నామని ప్రకటించడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. ఇది మన పరిశ్రమ రంగానికి, ఇంకా పరిశోధన సంస్థల కు కొత్త కొత్త ఉత్పత్తుల ను ఎటువంటి అంతరాయం లేకుండా అభివృద్ధి పరచడానికి మార్గాన్ని సుగమం చేయగలుగుతుంది. ‘‘నో హౌ’’ నుండి ‘‘షో హౌ’’కు మారవలసిన ఆవశ్యకత ప్రస్తుతం ఎంతైనా ఉంది.
రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను పటిష్టపరచడం కోసం జాయింట్ కమిశన్ ఆన్ ఎకనామిక్ కోఆపరేశన్ యొక్క మార్గదర్శకత్వం లో ఒక సిఇఒ ఫోరమ్ ను ఏర్పాటు చేసుకోవడానికి కూడా మనం సమ్మతించాం. దీనితో పాటే రెండు దేశాల మధ్య పెట్టుబడుల రాక పోక లను పెంచుకోవడం ద్వారా వ్యాపార నిర్వహణ లో సౌలభ్యానికి ఎదురయ్యే అవరోధాలను అధిగమించడం కోసం త్వరిత గతిన పని చేసే ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలనే అంశం మీద కూడా ఏకాభిప్రాయం కుదిరింది.
లైఫ్ స్టైల్ ఏక్సెసరిస్ డిజైన్ (ఎల్ఎడి) రంగంలో సహకారాన్ని పెంచుకోవాలని భారతదేశం, ఇటలీ లు అంగీకారానికి వచ్చినందుకు కూడా నాకు సంతోషం గా వుంది. తోలు రంగం మరియు ట్రాన్స్పోర్టేశన్ అండ్ ఆటోమొబైల్ డిజైన్ (టిఎడి).. ఈ రెంటి పైన కూడా ప్రత్యేక శ్రద్ధ ను వహించడం జరుగుతుంది.
ఈ పురోగతి కి తోడు సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, నవీకరణ యోగ్య శక్తి, లైఫ్ సైన్సెస్, ఇంకా జియో-హజార్డ్స్ ల వంటి ఎంపిక చేసిన రంగాల లో ప్రావీణ్యాల పై ఆధారపడినటువంటి ఇండో- ఇటాలియన్ సెంటర్స్ ఆఫ్ ఎక్స్లెన్స్ ను ఉభయ దేశాలు అదనం గా ఏర్పాటు చేస్తాయని వెల్లడించినందుకు సైతం నాకు ఆనందంగా ఉంది. ఈ ఉన్నత శ్రేణి విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, ఇంకా పరిశ్రమ.. ఇవి సమన్వయం తో పని చేయడమే కాకుండా ఆయా రంగాల లో మనం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళ కు సంబంధించిన సాంకేతిక విజ్ఞానపరమైన పరిష్కార మార్గాలను కూడా అందిస్తాయి.
మిత్రులారా,
ఈ టెక్ సమిట్ యొక్క సాఫల్యానికి గాను అందరు నిర్వాహకులకు నేను నా యొక్క హృదయపూర్వక అభినందనలను తెలియజేస్తున్నాను. నిజానికి ఒక భాగస్వామ్య దేశం గా మాతో కలసి రావడానికి అంగీకారం తెలియజేసిన ఇటలీ ప్రభుత్వానికి నేను కృతజ్ఞుడి ని. టెక్ సమిట్ లో పాలుపంచుకున్న వారందరికీ నేను అమిత కృతజ్ఞత ను తెలియజేస్తున్నాను. మీ అందరి యొక్క హాజరు మరియు తోడ్పాటు లు ఈ శిఖర సమ్మేళనం యొక్క విజయం లో ముఖ్య పాత్ర ను పోషించాయి.
ప్రధాని ప్రొఫెసర్ కాంటే యొక్క ప్రభావశాలి హాజరు పట్ల నేను మరొక్క మారు కృతజ్ఞత ను వెలిబుచ్చుతున్నాను. అది మాత్రమే కాదు. ఆయన కొత్త గా ఏర్పాటైన ఇండో-ఇటాలియన్ పార్ట్ నర్ శిప్ కు స్వయం గా మార్గదర్శకత్వాన్ని మరియు నిబద్ధత ను ప్రసాదించడం ద్వారా మాకు ఒక విలువైన కానుక ను కూడా ఇచ్చారు.
Grazie mille!*
అనేకానేక ధన్యవాదాలు.
More technology for greater progress. Addressing the India-Italy Technology Summit. https://t.co/Tqn285Hevs
— Narendra Modi (@narendramodi) October 30, 2018
भारत ने तो टेक्नॉलॉजी को सामाजिक न्याय, सशक्तिकरण, समावेश, सक्षम सरकारी तंत्र और पारदर्शिता का माध्यम बनाया है।
— PMO India (@PMOIndia) October 30, 2018
सरकारी सेवाओं की प्रभावी Last Mile Delivery को टेक्नॉलॉजी के माध्यम से सुनिश्चित किया जा रहा है: PM
बर्थ सर्टिफिकेट से लेकर बुढ़ापे की पेंशन तक की अनेक सुविधाएं आज ऑनलाइन हैं।
— PMO India (@PMOIndia) October 30, 2018
300 से अधिक केंद्र और राज्य सरकार की सेवाओं को उमंग App के माध्यम से एक प्लेटफॉर्म पर लाया गया है।
देशभर में 3 लाख से अधिक कॉमन सर्विस सेंटर्स से गांव-गांव में ऑनलाइन सेवाएं दी जा रही हैं: PM
भारत अब IT Software Power की अपनी पहचान को Next Level पर ले जाने के लिए आगे बढ़ रहा है।
— PMO India (@PMOIndia) October 30, 2018
हम भारत में Scientific Temper से Technological Temperament विकसित करने पर जोर दे रहे हैं।
अटल Innovation Mission के माध्यम से देश भर में ऐसे युवाओं का नेटवर्क तैयार किया जा रहा है: PM
भारत में जो Innovation हो रहे हैं उसमें Quality पर भी जोर दिया जा रहा है।
— PMO India (@PMOIndia) October 30, 2018
भारत का स्पेस प्रोग्राम इसका बेहतरीन उदाहरण है और इसकी सफलता तो इटली ने भी महसूस की है।
आज भारत इटली समेत दुनिया के अनेक देशों के सैटलाइट बहुत कम खर्च पर अंतरिक्ष में भेज रहा है: PM
भारत-इटली द्विपक्षीय Industrial Research and Development Cooperation कार्यक्रम के अगले चरण की शुरूआत की घोषणा करते हुए मुझे खुशी हो रही है।
— PMO India (@PMOIndia) October 30, 2018
इससे हमारे उद्योग और रिसर्च संस्थान बिना किसी बाधा के नए उत्पाद विकसित कर सकेंगे।
'Know how', Show how' में परिवर्तित हो सकेंगे: PM
मुझे इस बात की भी प्रसन्नता है कि भारत और इटली LAD यानि
— PMO India (@PMOIndia) October 30, 2018
Life Style Accessories Design के क्षेत्र में सहयोग बढ़ाने पर सहमत हुए हैं।
इसमें भी लेदर सेक्टर, Transportation & Automobile Design यानि TAD पर विशेष फोकस किया जाएगा: PM
India is delighted to host PM @GiuseppeConteIT.
— Narendra Modi (@narendramodi) October 30, 2018
I am glad he took part in the Technology Summit as well.
During our talks earlier today, we reviewed the full range of the India-Italy partnership, particularly in advancing cooperation in trade, technology and culture. pic.twitter.com/zGOoZBCJZ9
In order to give an impetus to enhanced economic cooperation between India and Italy, it was decided to set up a CEO forum guided by a Joint Commission on Economic Cooperation.
— Narendra Modi (@narendramodi) October 30, 2018
To increase two-way investments, we have decided to create a fast-track mechanism. @GiuseppeConteIT pic.twitter.com/Bg1wxknKP4
India and Italy have decided to boost ties in key sectors such as lifestyle accessories design, transportation and automobile design, energy, life sciences etc. Such extensive engagement will benefit the citizens of our nations. @GiuseppeConteIT
— Narendra Modi (@narendramodi) October 30, 2018