Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇండియా -జపాన్ వ్యాపార దిగ్గ‌జాల వేదిక‌నుద్దేశించి ప్ర‌ధాని ప్ర‌సంగం

దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో జ‌రిగిన ఇండియా-జ‌పాన్ వ్యాపార దిగ్గ‌జాల వేదిక స‌మావేశంలో ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ, జ‌పాన్ ప్ర‌ధాని శ్రీ షింజో అబే ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ మాట్లాడుతూ ఇండియా, జ‌పాన్ రెండు దేశాలు క‌లిసిక‌ట్టుగా ప్ర‌గ‌తి సాధించాల‌ని తాను కోరుకుంటున్నాని వ్యాఖ్యానించారు. అత్య‌ధిక వేగంతో ప్ర‌యాణించే రైళ్లను ఏర్పాటు చేసుకునే విష‌యంలో మాత్ర‌మే అంతే వేగంగా ప‌రుగులు తీసే వృద్ధిలోనూ ఇరుదేశాలు క‌లిసిక‌ట్టుగా ప్ర‌గ‌తి సాధించాల‌ని ప్ర‌ధాని ఆకాంక్షించారు. గ‌త సంవ‌త్స‌రం తాను జ‌పాన్ లో చేసిన ప‌ర్య‌ట‌న‌ను ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని గుర్తు చేశారు. త‌న జ‌పాన్ ప‌ర్య‌ట‌న‌లో 35 బిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డుల్ని ఇండియాలో పెడ‌తామంటూ జ‌పాన్ ప్ర‌భుత్వం హామీ ఇచ్చిన విష‌యాన్ని ప్ర‌ధాని గుర్తు చేశారు. ఆ స‌మ‌యంలో ఇంత మొత్తం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌చ‌కితుల‌ను చేసింద‌ని అయితే ఇంత త‌క్కువ స‌మ‌యంలోనే ఈ పెట్టుబ‌డుల విష‌యంలో ఊహించ‌డానికి వీలులేనంత ప్ర‌గ‌తి క‌నిపిస్తోంద‌ని ప్ర‌ధాని అన్నారు. జ‌పాన్ పెట్టుబ‌డుల రూపురేఖ‌లు ఇప్పుడు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయ‌ని ప్ర‌ధాని వివ‌రించారు.

ఇండియాలోనే త‌యారీ (మేక్ ఇన్ ఇండియా) అంటూ ఇండియా త‌ల‌పెట్టిన బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మం భారీస్థాయిలో కొన‌సాగుతోంద‌ని…ఇలాంటి కార్య‌క్ర‌మాన్ని జపాన్ సైతం మొద‌లుపెట్టింద‌ని ప్ర‌ధాని అన్నారు. విధాన‌ప‌ర‌మైన ప్‌్యోగంగా గ‌త సంవ‌త్స‌రం జ‌పాన్ ప్రారంభించిన జపాన్ ప్ల‌స్ కార్య‌క్ర‌మం చ‌క్క‌గా ప్ర‌గ‌తి సాధిస్తోంద‌ని ప్ర‌ధాని వివ‌రించారు.

ప్ర‌పంచ ఆర్థిక కార్య‌క‌లాపాల్లో మంద‌గ‌మ‌నం వ‌చ్చిన నేప‌థ్యంలోనూ ఇండియా, జ‌పాన్ లు సాధిస్తున్న ఆర్థికాభివృద్ధి మెచ్చుకోద‌గ్గ‌దిగా ఉంద‌ని ఈ రెండు దేశాల ఆర్థిక సూచిక‌లు ఎంతో మేలుగా ఉన్నాయ‌ని ప్ర‌ధాని అన్నారు. అనేక సాధ్యాల‌కు భార‌త్ నెల‌వుగా మారింద‌నే విష‌యం ఇప్పుడు స్ప‌ష్ట‌మైంద‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు. ఆర్థిక రంగంలో ఇండియా సాధించిన ప‌లు కీల‌క మార్పుల్లో జ‌పాన్ భాగ‌స్వామిగా ఉన్న విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని గుర్తు చేశారు. మారుతి కారు, డిఎఫ్ సి (డెడికేటెడ్ ఫ్రెయిట్ కారిడార్‌) మొద‌లైన ఉదాహ‌ర‌ణ‌లే దీనికి నిద‌ర్శ‌న‌మ‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు.