పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం, ఇండియా, జాంబియాల మధ్య న్యాయ సహకారానికి సంబంధించి అవగాహనా ఒప్పందానికి ఆమోదం తెలిపింది.
ఇటీవలి కాలంలో, ఇండియా, జాంబియాల మధ్య సామాజిక, సాంస్కృతిక, వాణిజ్య సంబంధాలు సానుకూల దిశగా సాగుతున్నాయి. న్యాయం రంగానికి సంబంధించిన సహకారానికి అవగాహనా ఒప్పందంపై సంతకంతో ,ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న మంచి సంబంధాలను ఇది మరింత ముందుకు తీసుకువెళ్లడమే కాకుండా , న్యాయ సంస్కరణల విషయంలో కొత్త కోణాన్నిఆవిష్కరించనుంది.