Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘ఇండియా టుడే కాన్‌క్లేవ్-2019’ లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

‘ఇండియా టుడే కాన్‌క్లేవ్-2019’ లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

‘ఇండియా టుడే కాన్‌క్లేవ్-2019’ లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

‘ఇండియా టుడే కాన్‌క్లేవ్-2019’ లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం


ఇండియా టుడే గ్రూప్ చైర్ మన్, ఎడిట‌ర్-ఇన్-చీఫ్ అరుణ్ పురీ గారు, మీ గ్రూపు న‌కు చెందిన పాత్రికేయ మిత్రులు, ప్ర‌స్తుతం న్యూస్ రూమ్ లో ప‌ని చేస్తున్న‌ పాత్రికేయులు, మీకు అనుబంధం గా విధులు నిర్వ‌హిస్తున్న స్ట్రింగ‌ర్ లు, ఇక్క‌డ‌ కు విచ్చేసిన ఇత‌ర ప్ర‌ముఖులు మ‌రియు ప్రియమైన నా యొక్క మిత్రులారా,

‘ఇండియా టుడే కాన్‌క్లేవ్’తో అనుబంధాన్ని క‌లిగివున్న‌టువంటి వారు అంద‌రి కి ఇవే నా శుభాకాంక్ష‌లు. స్వ‌చ్ఛ్ భార‌త్ అభియాన్ లో పాలుపంచుకొన్న మీ అంద‌రి కి మరియు ప్ర‌జ‌ల లో చైత‌న్యాన్ని ర‌గిలిస్తున్న మీ మీ కృషి కి నా అభినంద‌న‌లు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

దేశ ప్ర‌జ‌ల కు నాయ‌క‌త్వం వ‌హిస్తున్న కాలం లో నేను నేర్చుకొన్న దాని ని గురించి మీతో పంచుకోవ‌ల‌సింది గా మీరు నన్ను కోరారు.

2014వ సంవ‌త్స‌రపు ఎన్నిక‌లు ముగిసిన తరువాత, ఎప్పుడైతే నేను ఢిల్లీ కి వ‌చ్చానో, అప్పుడు కేంద్ర ప్ర‌భుత్వం ఎలా ప‌ని చేసిందీ, ఈ వ్య‌వ‌స్థ ఎలా పని చేస్తుంది వగైరా అంశాల లో కావలసినంత అనుభవం నిజం గానే నాకు లేదు.

మ‌రి, అది నాకు ఒక వ‌రం గా ప‌రిణ‌మించిందని నేను న‌మ్ముతున్నాను. పాత వ్య‌వ‌స్థ లో నేను ఒక భాగం అయివుంటే, నేను ఆ వ్య‌వ‌స్థ లో ఇమిడిపోయివుండే వాడిని. కానీ, అలా జ‌రుగ‌లేదు.

మిత్రులారా,

2014వ సంవ‌త్స‌రానిక‌న్నా ముందు కాలం లో మీ యొక్క స్టూడియో లో చ‌ర్చ‌లు సాగేవని, వాటిలో విదేశీ వ్య‌వ‌హారాల తాలూకు జ్ఞానం ఏదీ మోదీ కి లేదు; మరి మ‌న విదేశాంగ విధానాని కి ఏమవుతుందంటూ మాట్లాడుకొనే వారన్న సంగ‌తి ని నేను జ్ఞ‌ప్తి కి తెచ్చుకొంటున్నాను.

అయితే, గ‌త కాల‌పు ఘ‌ట‌న‌ ల అనంత‌రం, భార‌త‌దేశం యొక్క విదేశాంగ విధానం తాలూకు ప్ర‌భావం ఈ రోజు న ఎక్క‌డ‌ కు చేరుకొన్న‌దీ మీరు గ‌మ‌నించే వుంటారు.

ఈ విష‌యాన్ని మీరు గ‌మ‌నించారా, లేక గ‌మ‌నించలేదా ?

సరే, క‌నీసం మీరు ఈ విష‌యాన్ని అంగీక‌రించారు.

మిత్రులారా,

ఇవాళ్టి భార‌త‌దేశం ఒక ‘న్యూ ఇండియా’, ఒక ప‌రివ‌ర్త‌న‌ కు లోనైన‌టువంటి భార‌త‌దేశం. మ‌న‌కు ప్ర‌తి ఒక్క సైనికుడి ర‌క్తం అమూల్య‌మైందే. ఇది వ‌ర‌కు చాలా మంది చ‌నిపోయినా, లేక ప్రాణ స‌మ‌ర్ప‌ణం చేసినా ఏ ప్ర‌తి చ‌ర్య ఉండేది కాదు. కానీ ఇప్పుడు, భార‌త‌దేశం లో ఏదయినా చేయ‌డానికి ఎవ్వరూ సాహ‌సించ‌రు. మా ప్ర‌భుత్వం దేశ ప్ర‌జ‌ల సంక్షేమాని కి ఉద్దేశించిన నిర్ణ‌యాల‌ ను తీసుకోవడాని కి కంక‌ణం క‌ట్టుకొంది. ఈ రోజు న భార‌త‌దేశం ఒక కొత్త విధానం పైన మ‌రియు ఒక కొత్త వ్యూహం పైన ప‌నిచేస్తోంది; మ‌రి యావ‌త్తు ప్ర‌పంచం దీని ని అర్థం చేసుకోగ‌లుగుతోంది.

మిత్రులారా,

ఇవాళ్టి ‘న్యూ ఇండియా’ నిర్భ‌యం గాను, నిర్ణ‌యాత్మ‌కం గాను ఉంది అంటే అందుకు కార‌ణం ప్ర‌భుత్వం 125 కోట్ల మంది భార‌తీయులు విశ్వాసం మ‌రియు క‌ఠోర శ్ర‌మ లతో ముందుకు సాగుతోంది కాబ‌ట్టి.

భార‌త‌దేశం యొక్క ఏక‌త్వం దేశం లోప‌ల‌, దేశం వెలుప‌ల కొద్ది మంది దేశ వ్య‌తిరేకుల లో భ‌యాన్ని ప్రేరేపించింది.

ఈ భీతావహ మ‌న‌స్త‌త్వం మంచిద‌ని నేను అంటాను. భార‌త‌దేశం సాధించిన ఘ‌న‌త ను గురించి శ‌త్రువు భ‌యం తో ఉంటే, అటువంట‌ప్పుడు ఆ భ‌యం మంచిది. జ‌వానుల ప‌రాక్ర‌మాన్ని చూసి ఉగ్ర‌వాదులు భ‌య‌ప‌డుతూ ఉన్న‌ప్పుడు, అటువ‌ంటప్పుడు ఆ భీతి మంచిది. ప‌రారైన వారు సైతం చ‌ట్ట‌ం అంటే భ‌య‌ప‌డుతూ వారి యొక్క ఆస్తుల‌ ను స్వాధీనం చేసుకొంటార‌న్న విష‌యాన్ని గ్ర‌హిస్తూ ఉంటే, అటువంటి భ‌యం మంచిది.

మామ ఏ విష‌యాలు బ‌య‌ట‌పెడ‌తాడో అని పెద్ద కుటుంబాలు భీతిల్లుతూ ఉంటే, అటువంటప్పుడు ఆ భ‌యం మంచిది.

జైలు కు వెళ్ళ‌వ‌ల‌సి వ‌స్తుంద‌ని అవినీతిప‌రులైన రాజ‌కీయ‌వేత్త‌ల‌ లో ఒక భ‌యం అనేది ఉన్న‌ప్పుడు, ఆ భ‌యం మంచిది.

అవినీతిప‌రులు చ‌ట్టం అంటే బెద‌రుతున్న‌ప్పుడు ఆ భ‌యం మంచిది.

మిత్రులారా,

స్వాతంత్య్రం అనంత‌రం ద‌శాబ్దాల త‌ర‌బ‌డి దేశం ఎంతగానో కోల్పోయింది.

ప్ర‌స్తుతం ఈ ‘న్యూ ఇండియా’ త‌న బ‌లాల ను, త‌న సామ‌ర్ధ్యాల ను మ‌రియు త‌న వ‌న‌రుల ను అండ‌గా చేసుకొని ముందుకు క‌దులుతోంది. దేశం త‌న మౌలిక బ‌ల‌హీన‌త‌ల‌ ను అధిగ‌మించ‌డానికి, మ‌రి అలాగే త‌న స‌వాళ్ళ ను త‌గ్గించుకోవ‌డాని కి కూడాను ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

అయితే, మిత్రులారా, ఈ ప్ర‌గ‌తి శీల భార‌త‌దేశం ఎదుట మ‌రొక స‌వాలు ఉంది.

ఆ స‌వాలు ఏమిటంటే కొంత మంది మ‌న దేశాని కి వ్య‌తిరేకం గా మాట్లాడుతూ త‌ద్వారా సంతృప్తి చెంద‌డం, మ‌రి దేశాన్ని గేలి చేయ‌డం అనేదే.

ఎప్పుడైతే యావ‌త్తు దేశం భార‌తీయ సైన్యాని కి వెన్నంటి నిల‌చిందో, అటువంట‌ప్పుడు కొద్ది మంది సైన్యాన్నే అనుమానిస్తూ ఉండ‌టం నాకు విస్మ‌య కార‌కం అవుతోంది.

ఒక ప‌క్క ఉగ్ర‌వాదాని కి వ్య‌తిరేకం గా జ‌రుగుతున్న యుద్ధం లో భార‌త‌దేశాన్ని యావ‌త్తు ప్ర‌పంచం స‌మ‌ర్ధిస్తూవుంటే, కొన్ని పార్టీ లు ఉగ్ర‌వాదం పై మ‌నం చేస్తున్న స‌మ‌రాన్ని శంకిస్తున్నాయి.

కొందరి ప్ర‌క‌ట‌న‌ లను, వ్యాసాల ను పాకిస్తానీ పార్ల‌మెంటు, రేడియో, ఇంకా టెలివిజ‌న్ ఛాన‌ళ్ళు భార‌త‌దేశాని కి వ్య‌తిరేకం గా ఉప‌యోగించుకొంటున్నాయి.

ఈ వ్య‌క్తులు మోదీ వ్య‌తిరేకుల స్థాయి నుండి దేశ వ్య‌తిరేకులు గా మారిపోయారు. వారు దేశాని కి హాని చేస్తున్నారు.

అటువంటి వారంద‌రి ని ఈ రోజు న ఈ వేదిక మీద నుండి నేను ఒక ప్ర‌శ్న ను అడ‌గ‌ద‌ల‌చుకున్నాను. ఆ ప్ర‌శ్న ఏమిటి అంటే మీరు మ‌న సైన్యం యొక్క శ‌క్తి ని న‌మ్ముతున్నారా ? లేక, ఆవిష‌యం లో మీరు ఏదైనా సంశ‌యం తో ఉన్నారా ? అని.

వారు మ‌న సైన్యాన్ని న‌మ్ముతున్నారా లేక వారు మ‌న గ‌డ్డ మీద ఉంటూ ఉగ్ర‌వాదాని కి కొమ్ము కాస్తున్న‌టువంటి వ్య‌క్తుల‌ ను న‌మ్ముతున్నారా ? ఈ విషయాన్ని నేను వారి వద్ద నుండి తెలుసుకోవాల‌నుకొంటున్నాను.

సోద‌రీమ‌ణులు మ‌రియు సోద‌రులారా,

అటువంటి వ్య‌క్తుల‌ కు మ‌రియు పార్టీల‌ కు నేను చెప్పదల‌చుకున్న‌ సంగతి ఒకటి ఉంది. అది ఏమిటంటే మోదీ వ‌స్తాడు, వెళ‌తాడు. కానీ, భార‌త‌దేశం ఎప్ప‌టి కీ ఉంటుంది. ఈ కార‌ణం గా వారు వారి యొక్క రాజ‌కీయ ప్ర‌యోజ‌నం కోసం మ‌రియు వారి అహాన్ని తృప్తి ప‌ర‌చుకోవ‌డం కోసం దేశం యొక్క భ‌ద్ర‌త‌ తో ఆట‌లు ఆడ‌టాన్ని క‌ట్టిపెట్టాల‌ ని వారి ని నేను అభ్య‌ర్ధిస్తున్నాను. ద‌య‌ ఉంచి, దేశాన్ని బ‌ల‌హీన ప‌ర‌చ‌డం ఆపండి.

మిత్రులారా,

ఇవాళ ర‌ఫేల్ యొక్క అవ‌స‌రాన్ని దేశం గుర్తించింది. ఇవాళ మ‌న వ‌ద్ద ర‌ఫేల్ ఉంటే ఏం జ‌రిగేది అని దేశ ప్ర‌జ‌లు ముక్త కంఠం తో అడుగుతున్నారు.

ఇది వ‌ర‌కు ర‌ఫేల్ విష‌యం లో స్వార్ధ ప్ర‌యోజ‌నాల వ‌ల్ల దేశం ఎంతో నష్టపోయింది. మ‌రి ఇప్పుడు ర‌ఫేల్ పై రాజ‌కీయాల కారణంగా దేశం ఎంతో కోల్పోతోంది.

నేను ఇటువంటి వ్య‌క్తుల‌ కు చెప్ప‌ద‌లచుకొన్నది ఏమిటంటే మోదీ ని వారు య‌థేచ్ఛ‌ గా వ్య‌తిరేకించ‌వ‌చ్చును. అలాగే మా ప‌థ‌కాల‌ లోని లోటుపాటుల‌ ను కనుగొన‌వ‌చ్చును, వాటి ప్రభావం తదితర అంశాలపై చర్చించవచ్చును.

ఈ అంశాల పై ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించండి; మీకు ఎల్ల‌ప్ప‌టి కీ ఇదే స్వాగ‌తం. అయితే, దేశ‌ భ‌ద్ర‌త ప్ర‌యోజ‌నాల‌ ను మాత్రం వ్య‌తిరేకించ‌వద్దు అని.

మోదీ ని వ్య‌తిరేకిస్తున్నటువంటి ఈ మూర్ఖ‌త్వం మ‌సూద్ అజ‌ర్, ఇంకా హ‌ఫీజ్ స‌యీద్ ల వంటి ఉగ్ర‌వాదుల‌ ను మ‌రింత శ‌క్తిమంత‌మైన సంస్థ‌లు గా మార్చివేస్తున్నాయ‌న్న సంగతి ని గ్ర‌హించండి.

మిత్రులారా,

అనేక సంవ‌త్స‌రాల‌ పాటు దేశాన్ని పాలించిన వారు రెండు అంశాల లో ఆస‌క్తి ని క‌లిగివుండే వారు. అవి – దానాలు మ‌రియు ఒప్పందాలు.

దానాలు మ‌రియు ఒప్పందాల సంస్కృతి మ‌న దేశం యొక్క ప్ర‌గ‌తి ప్ర‌స్థానాన్ని ఎంత‌గానో న‌ష్ట‌ప‌రిచింది.

ఈ వైఖ‌రి వ‌ల్ల క‌లిగిన పెద్ద న‌ష్టం ఎవ‌రికో మీకు తెలుసా ? వారే మ‌న జ‌వానులు, కిసానులూను.

మొద‌ట ర‌క్ష‌ణ రంగాన్ని గురించి న‌న్ను మాట్లాడ‌నీయండి.

దేశాన్ని అనేక సంవ‌త్స‌రాల‌ పాటు పాలించిన‌ వారు వారి యొక్క హయాం లో అన్ని ర‌క్ష‌ణ కుంభ‌కోణాల కు ఎందుకు తావు ఇచ్చిన‌ట్లు ?

వారు మొద‌ట జీపుల తో మొద‌లు పెట్టి, ఆ త‌రువాత ఆయుధాలు, జ‌లాంత‌ర్గాములు, హెలీకాప్టర్ ల వరకు ఎదిగారు.

ఈ క్రమం లో ర‌క్ష‌ణ రంగం న‌ష్ట‌పోయింది.

ఏదైనా ఒక ఒప్పందం కుద‌ర‌లేకపోతే ర‌క్ష‌ణ సంబంధ ఆధునికీక‌ర‌ణ చోటు చేసుకోలేద‌న్న మాటే.

ప్ర‌తి ఒప్పంద కార‌కుడు ఎవ‌రి కి స‌న్నిహితం గా ఉండే వారు ? ప్ర‌తి ఒక్క మ‌ధ్య‌వ‌ర్తి ఎవ‌రి కి ద‌గ్గ‌ర‌ గా ఉండే వారు? యావ‌త్తు దేశ ప్ర‌జ‌ల‌ కు ఇది తెలుసును.

మ‌రి లుటియన్ రూపుదిద్దిన ఢిల్లీ కి ఈ విష‌యం తప్పకుండా తెలుసును.

మిత్రులారా,

మ‌న సాయుధ ద‌ళాలు క్ర‌మం త‌ప్ప‌కుండా కావాల‌నుకొనే వాటి లో బులిట్ ప్రూఫ్ జాకెట్ లు ఒక‌ట‌ద‌నేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే.

2009వ సంవ‌త్స‌రం లో మ‌న బ‌ల‌గాలు ల‌క్షా 86 వేల బులిట్ ప్రూఫ్ జాకెట్ లు కావాలి అని మనవి చేశాయి.

ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా- నేను మ‌రో మారు చెప్తున్నాను- ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా బులిట్ ప్రూఫ్ జాకెట్ లను 2009వ సంవ‌త్స‌రం నుండి 2014వ సంవంత్స‌రం మ‌ధ్య కొనుగోలు చేయ‌లేద‌ని తెలిస్తే మీరు ల‌జ్జాన్వితులు అవుతారు

మా ప‌ద‌వీకాలంలో రెండు లక్షల ముప్ఫై వేల బులిట్ ప్రూఫ్ జాకెట్ లను కొనుగోలు చేశాము.

మా ప‌ద‌వీకాలం లో అధికార కారిడోర్ లు మ‌ధ్య‌వ‌ర్తుల కు తావు లేనివి గా కూడా ఉన్నాయి. దీనికి కార‌ణం వారికి తెలుసు.. ఈ ప్ర‌భుత్వం ఎటువంటి అవినీతి ని స‌హించ‌బోదు అని.

ఇక దానాల ను గురించి నన్ను చెప్పనివ్వండి. అధికారం లో ఉన్న‌ వారు దానాలు ఇవ్వ‌డాన్ని ఇష్ట‌ప‌డ్డారు.

ఈ దానాలు పేద‌ల‌ ను సాధికారుల‌ ను చేయ‌డాని కి ఉద్దేశించిన‌టువంటివి కావు.

ఈ దానాలు ఎందుకు ఇచ్చారంటే రాజ‌కీయ వ‌ర్గం యొక్క ద‌యా దాక్షిణ్యాల పై పేద‌లు ఆధార‌ప‌డి ఉండ‌టాని కి, ఇంకా పేద‌లు పేద‌ల వలెనే మిగిలి పోవ‌డానికీనూ.

దీని కి ఒక ఉత్త‌మ‌మైన‌టువంటి ఉదాహ‌ర‌ణ‌, వ్య‌వ‌సాయ రుణాల మాఫీ.

వ్య‌వ‌సాయ రుణాల మాఫీలు మ‌న వ్యావ‌సాయిక స‌మ‌స్య‌ల ను ప‌రిష్క‌రించ‌గలుగుతాయ‌ని ఏ విధాన నిపుణుడు గానీ, ఆర్థిక‌వేత్త‌ గానీ ఎన్న‌టికీ చెప్ప‌బోరు.

ఇది మహా అయితే ఒక తాత్కాలిక ఉప‌శ‌మ‌నం వంటిది.

ప్ర‌తి ప‌ది సంవ‌త్స‌రాల‌ కు, ఒక వ్య‌వ‌సాయ రుణ మాఫీ ఆలోచ‌న‌ తో యుపిఎ ముందుకు వచ్చింది.

వారు వారి యొక్క పూర్తి ప‌ద‌వీకాలం లో చేసింది ఏమీ లేదు. కానీ ఆఖ‌రు నిమిషం లో, ఒక వ్య‌వ‌సాయ రుణ మాఫీ ని ఇవ్వజూపారు.

వారి యొక్క మాఫీ ల‌లో ప్ర‌త్య‌క్షం గా క‌నిపించింది అంటూ ఏదీ లేదు.

అది రైతుల లో 20 శాతాని క‌న్నా తక్కువ మంది కి ల‌బ్ది ని చేకూర్చుతుంది.

అయిన‌ప్ప‌టికీ కూడాను, వారు వ్య‌వ‌సాయ రుణాల అంశం పై ఎన్నిక‌ల లో పోరాడ‌టాన్ని ఇష్ట‌ప‌డ‌తారు.

మేము ఒక విభ‌న్న‌మైన పంథా ను అనుస‌రించాము.

పిఎం కిసాన్ స‌మ్మాన్ నిధి రైతుల సంక్షేమాని కి ఉద్దేశించిన‌టువంటి ఒక స‌మ‌గ్ర‌మైన ప‌థ‌కం.

ఇందులో ఎటువంటి దానం గాని లేదా ఒప్పందం గాని లేదు. ఒక మంచి ప‌ని మాత్రమే.

భార‌త‌దేశం లోని 12 కోట్ల మంది రైతుల‌ కు మూడు విడ‌త‌లు గా ఆరు వేల రూపాయ‌లు ఇవ్వడం.

ఈ ప‌థ‌కాన్ని ఫిబ్ర‌వ‌రి 1వ తేదీన ప్ర‌క‌టించ‌డం మ‌రియు ఫిబ్ర‌వ‌రి 24వ తేదీన ప్రారంభించ‌డం జ‌రిగాయి. మేము నిర్విరామం గా 24 గంట‌లు కృషి చేసి మ‌రి 24 రోజుల లోనే దీనిని ప్రారంభించాం.

ఇదివ‌ర‌కు ఒక అతి ముఖ్య‌మైన ప్ర‌శ్న ను ప‌రిష్క‌రించ‌డాని కి ఇంత స‌మ‌యం ప‌ట్టేది. అది ఏమిటంటే ఒక ప‌థ‌కాన్ని కుటుంబం లోని ఏ స‌భ్యుడి పేరిట తీసుకు రావాలి? అనేదే.

మ‌రి మాఫీ ల మాదిరి గా కాకుండా ప్ర‌ధాన మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి ఒక దీర్ఘ‌కాలిక‌మైన‌టువంటి మ‌రియు ఎప్ప‌టికీ అందుతూనే ఉండేట‌టువంటి స‌హాయం.

మా ఇత‌ర ప‌థ‌కాల మాదిరిగానే.. అది భూమి స్వ‌స్థ‌త కార్డులు, లేదా పిఎం కృషి సించాయీ యోజ‌న, లేదా ఇ-నామ్ (E-Nam).. ఇవి కూడా దానాలు కావు. ఇవి 2022వ సంవ‌త్స‌రానిక‌ల్లా రైతుల ఆదాయాల‌ ను పెంచ‌డం కోసం సంక‌ల్పించిన నిర్ధిష్ట దీర్ఘ‌కాలిక చ‌ర్య‌లు గా ఉన్నాయి.

రైతుల‌ కు ఎంఎస్‌పి లో ఒక చ‌రిత్రాత్మ‌కమైనటువంటి పెంపుద‌ల ను తీసుకు వ‌చ్చిన గౌర‌వం ఎన్‌డిఎ ప్ర‌భుత్వాని కి ద‌క్కింది.

ఇదివ‌ర‌క‌టి ప్ర‌భుత్వం అధికారం లో ఉన్న‌ప్పుడు ఎంఎస్‌పి కి సంబంధించిన ఒక ఫైలు ను దాదాపు గా 7 సంవ‌త్స‌రాల పాటు అట‌క మీదే పెట్టేయ‌డమైంది.

ఈ విధం గా వారు 10 శాతం కమిశ‌న్ కోసం ప‌ని చేస్తే, మేము 100 శాతం మిశ‌న్ తో కృషి చేశాము. మ‌రి ఒక ప్ర‌భుత్వం దృఢ సంక‌ల్పం తో పని చేస్తూవున్నప్పుడు స‌ర్వ‌తోముఖ అభివృద్ధి సాధ్య‌ం అవుతుంది.

మిత్రులారా,

మా యొక్క 55 నెల‌లు మ‌రియు ఇత‌రుల యొక్క 55 సంవ‌త్స‌రాలు పాల‌న‌ కు రెండు ప‌ర‌స్ప‌ర విరుద్ధ వైఖ‌రులను మప్పాయి.

అవి ఏమిటంటే, ‘లాంఛన వైఖ‌రి’ని వారు ప్ర‌ద‌ర్శించ‌డం; మేము ‘ప‌రిపూర్ణ వైఖ‌రి’ని క‌న‌ప‌ర‌చ‌డం.

ప్ర‌తి ఒక్క విష‌యాని కి వారు ఒక లాంచనాన్ని అందించే వారు. న‌న్ను దీనిపై వివ‌ర‌ణాత్మ‌కం గా చెప్ప‌నివ్వండి.

భార‌త‌దేశం పేద‌రికం తో పోరాడుతూ వ‌స్తోంది. కానీ, వారు ఒక లాంఛన నినాదాన్ని ఇచ్చారు – అదే గ‌రీబీ హ‌టావో.

దానిని ఎలా సాధించాలో విడ‌మ‌ర‌చి చెప్ప‌డం జ‌ర‌గ‌లేదు. అంతేకాదు, పేద‌రికాన్ని నిర్మూలించేందుకు వారు ఎటువంటి ప్ర‌య‌త్నాన్ని చేయ‌లేదు.

కానీ, వారు ఊరూరా తిరుగుతూ గ‌రిబీ హ‌టావో, గ‌రీబీ హ‌టావో అంటూ పలికే వారు.

అన్ని వ‌ర్గాల‌ కు ఆర్థిక సేవ‌ల అంశం పైన భార‌త‌దేశం కృషి చేయ‌వ‌ల‌సి వుండింద‌న్న అవ‌స‌రం అంద‌రి కీ తెలిసిన‌ విష‌య‌మే. దీని కోసం వారు బ్యాంకు జాతీయీకర‌ణ అనే లాంఛనాన్ని ఇచ్చారు.

వారు ఈ ప‌ని ని పేద‌ల పేరిట చేశారు. కానీ బ్యాంకుల త‌లుపులు పేద‌ల కోసం తెర‌చుకొన్న‌ాయా, లేక తెర‌చుకోలేదా అని ప‌ట్టించుకొన్న పాపాన ఎవ్వ‌రూ పోలేదు.

‘వ‌న్ ర్యాంక్‌, వ‌న్ పెన్షన్’ విష‌యాన్నే తీసుకోండి.

న‌ల‌భై సంవత్సరాలు గా ఈ డిమాండ్ నెర‌వేర‌కుండా మిగిలిపోయింది. అయితే 2014వ సంవ‌త్స‌రం లో వారు వారి యొక్క కడపటి బ‌డ్జెటు లో దీని కోసం అయిదు వంద‌ల‌ కోట్ల రూపాయ‌ల ను లాంఛనం గా జోడించారు. అవ‌స‌ర‌మైన మొత్తాని కి ఇది ద‌గ్గ‌రగానైనా లేద‌న్న సంగ‌తి ని వారు బాగా ఎరుగుదురు. అయిన‌ప్ప‌టికీ కూడా ఏదో లాంఛనాని కే ఆ ప‌ని ని త‌ల‌పెట్టారు.

మ‌రి ఎన్నిక‌లు ద‌గ్గ‌రపడుతున్నాయి క‌దా!

2014వ సంవ‌త్స‌రం క‌న్నా ముందు వారి యొక్క ఎన్నిక‌ల అస్త్రం ఏమిటి ? – గ్యాస్ సిలిండ‌ర్ల‌ను 9 నుండి 12 కు పెంచ‌డం.

ఒక‌సారి ఊహించండి – అంత‌పెద్ద జాతీయ ప‌క్షం, ప్ర‌భుత్వం లో సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి ఉన్న‌ది కాస్తా ఎన్నిక‌ల‌ ను 9 నుండి 12 సిలిండ‌ర్ల అంశం పై ఎదుర్కోవ‌డానికి ప‌రిమితమైందన్న విష‌యాన్ని.

ఈ విధ‌మైన టోకెన్ లను ఇచ్చే ప‌ద్ధ‌తి మాకు ఆమోద యోగ్యం కాదు.

ప‌ని చేయవలసివస్తే, అది పూర్తిగా అర‌కొర‌ గా ఉండటం కాక పూర్తి గా చేయాలి.

అందుక‌నే మా కార్య‌క్ర‌మాలు అన్నీ కూడాను వంద శాతం ల‌క్ష్యం తో ఉంటాయి.

జ‌న్ ధ‌న్ – ఇది అన్ని వ‌ర్గాల‌ కు బ్యాంకింగు మ‌రియు అన్ని వ‌ర్గాల‌ కు ఆర్థిక సేవ‌ల అంద‌జేత‌కై ఉద్దేశించింది.

హౌసింగ్ ఫ‌ర్ ఆల్ (అందరికీ గృహ‌ నిర్మాణ‌ం)- ఇది 2022 వ సంవ‌త్స‌రం క‌ల్లా భార‌త‌దేశం లోని ప్ర‌తి ఒక్క‌రికీ ఒక ఇంటి ని అందించడం కోసం ఉద్దేశించింది.

మ‌రి, ఈ దిశ లో మేము అసాధార‌ణ‌మైన పురోగ‌తి ని సాధిస్తున్నాము.

యుపిఎ నిర్మించిన 25 ల‌క్ష‌ల గృహాల‌ తో పోలిస్తే, ఇప్ప‌టికే 1.5 కోట్ల గృహాల‌ ను ఏర్పాటు చేయ‌డ‌మైంది.

హెల్త్ కేర్ ఫ‌ర్ ఆల్ (అందరికీ ఆరోగ్య సంరక్షణ) – ఆయుష్మాన్ భార‌త్ – భార‌త‌దేశం లో ఏ ఒక్క‌రూ చ‌క్క‌నైన, ఇంకా త‌క్కువ ఖ‌ర్చు తో కూడిన ఆరోగ్య సంర‌క్ష‌ణ కు నోచుకోకుండా ఉండ‌కూడ‌దు. ఈ ప‌థ‌కం ద్వారా 50 కోట్ల మంది భార‌తీయులు ల‌బ్ది ని పొందుతారు.

‘వ‌న్ ర్యాంక్‌, వ‌న్ పెన్షన్’ – ఒఆర్ఒపి -లో భాగం గా వారి యొక్క 500 కోట్ల తో పోలిస్తే ఎన్‌డిఎ ప్ర‌భుత్వం ద్వారా ఆ త‌రువాత 35,000 కోట్ల‌ ను ఇవ్వ‌డం జ‌రిగింది.

ఉజ్జ్వల యోజ‌న – వారు 9 నుండి 12 సిలిండ‌ర్ లపై శ్ర‌ద్ధ వ‌హించ‌ గా మేము కోట్లాది కుటుంబాల కు పొగ కు చోటు ఉండనటువంటి వంట గ‌దుల కోసం కృషి చేశాము.

ప‌వ‌ర్ ఫ‌ర్ ఆల్ (అందరికీ విద్యుత్తు) – ప్ర‌తి ఒక్క గ్రామం మ‌రియు ప్ర‌తి ఒక్క ఇల్లు విద్యుత్తు స‌దుపాయాన్ని క‌లిగివుండాలి.

70 సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి చీక‌ట్లో మ‌గ్గిన 18,000 ప‌ల్లెల కు ప్ర‌స్తుతం విద్యుత్తు చేరుకొంది. మ‌రి ఇప్పుడు ఇళ్ళ లో విద్యుత్తు సౌక‌ర్యాన్ని క‌ల్పించ‌డం పైన దృష్టి పెట్ట‌డం జ‌రుగుతోంది.

కాబ‌ట్టి, మీరంద‌రూ గ‌మనించ‌వ‌చ్చును – మేము వేగం ప‌రం గాను, రాశి ప‌రం గాను ప‌ని చేస్తున్నాము అనే సంగతి ని.

ప్ర‌తిదీ అంద‌రి కోసం ఉద్దేశించ‌బ‌డాలి గాని కొంద‌రి కోసం కాదు.

టోకెన్ ప‌ద్ధ‌తి చాలు ఇక‌. అభివృద్ధి ఫ‌లాలు ప్ర‌తి ఒక్క పౌరుని కి/పౌరురాలి కి అందేటట్టు ఒక సంపూర్ణమైన‌టువంటి ప‌రివ‌ర్త‌న చోటు చేసుకొనే తరుణం వచ్చేసింది.

మిత్రులారా,

ఆజ్ త‌క్ మంచి ప్ర‌శ్న‌ల‌ ను వేస్తుంద‌న్న‌ది తెలిసిన విష‌య‌మే. అయితే, ఈ రోజు న నేను సైతం ఆజ్ త‌క్ వేదిక మీద నుండి కొన్ని ప్ర‌శ్న‌ల‌ ను వేయాల‌ని అనుకొంటున్నాను.

ఎందుక‌ని కోట్లాది ప్ర‌జ‌లు ఇప్ప‌టికీ ఆరుబ‌య‌లు ప్ర‌దేశాల‌ లో మ‌ల‌విస‌ర్జ‌న చేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది ?

ఎందుక‌ని ‘దివ్యాంగ‌జ‌నుల’ ప‌ట్ల ప్ర‌భుత్వం లో స్పంద‌న శీల‌త‌ లోపించింది ?

ఎందుక‌ని గంగా న‌ది లోని జ‌లాలు ఇంత‌వ‌ర‌కూ అంతగా క‌లుషితం అవుతూ వ‌స్తున్నాయి ?

ఎందుక‌ని ఈశాన్య ప్రాంతాలు ఇంత కాలం నిర్ల‌క్ష్యాని కి గురి అయ్యాయి?

ఎందుక‌ని మ‌న దేశం లోని సాహ‌స యోధుల‌ కు జాతీయ యుద్ధ స్మార‌కాన్ని ఇంత‌వ‌ర‌కు నిర్మించ‌ లేదు ?

ఎందుక‌ని వీరులు మ‌రియు సాహ‌స‌వంతులైన పోలీసు వారి కోసం ఏ జాతీయ పోలీసు స్మారకాన్ని ఇంత‌వ‌ర‌కు నిర్మించ‌లేదు ?

ఎందుక‌ని అజాద్ హింద్ ఫౌజ్ ప్ర‌భుత్వాన్ని స్మ‌రించుకొంటూ ఇంత‌వ‌ర‌కు ఎర్ర‌కోట లో ప‌తాకాన్ని ఆవిష్క‌రించ‌లేదు ?

ఆజ్ త‌క్ వేదిక మీద నుండి నేను ప్ర‌శ్న‌ల ప‌రంప‌ర‌ ను కొన‌సాగించానంటే గ‌నుక, అది గంటల కొద్దీ సాగేటటువంటి ఒక ‘ప్ర‌త్యేక‌’ బులెటిన్ గా రూపొంద గలుగుతుంది.

ఈ ప్ర‌శ్నల ఆధారం గా మీరు ఒక దాడి ని ఆరంభిస్తారా, లేదా ? ఈ ప్ర‌శ్న‌ల ను గురించి మీరు ఒక ప్ర‌త్యేక క‌థ‌నాన్ని రూపొందిస్తారా, లేదా ? అయితే వాస్త‌వం ఏమిటి అంటే ఇదివ‌ర‌కు పేద‌ల‌ ను, అణ‌చివేయ‌బ‌డిన వ‌ర్గాల వారిని, స‌మాజం లో వంచ‌న‌ కు గురి అయిన వ‌ర్గాల‌ ను వ్య‌వ‌స్థ‌ కు సంధానించే దిశ‌ గా ఎటువంటి అర్థ‌వంత‌మైన కృషి జ‌ర‌గ‌లేద‌నేదే. అయితే, నేను ఇక్క‌డ‌ కు కేవ‌లం ప్ర‌శ్నించ‌డం కోసం రాలేదు; నేను కొన్ని స‌మాధానాల‌ ను కూడా ఇవ్వాల‌ని అనుకొంటున్నాను. అదీ ‘మీరు ఏమి సాధించారు ?, మేము సాధిస్తున్నది ఏమిటి ?’ అంటూ మీరు న‌న్ను అడ‌గ‌కుండానే.

మీరు మిమ్మ‌ల్ని ‘స‌బ్‌సే తేజ్’ (అత్యంత వేగ‌వంత‌మైన‌) అని చెప్పుకొంటారు. ‘స‌బ్‌సే తేజ్’ అనేది మీకు ఉప శీర్షిక గా ఉంది.

ఈ కార‌ణం గా నా గురించి, నా ప్ర‌భుత్వాన్ని గురించి మేము ఎంత వేగం గా ఉన్నామో మీరు తెలుసుకోవాల‌ని నేను అనుకున్నాను.

మేము నేటి భార‌త‌దేశం లో అత్యంత వేగ‌వంతం గా పేద‌రికాన్ని నిర్మూలిస్తున్నాము.

ఈ రోజు న మ‌న‌ము ప్ర‌పంచం లో కెల్లా అత్యంత వేగ‌వంత‌మైన‌టువంటి ఆర్థిక వ్య‌వ‌స్థ గా ఉన్నాము.

1991వ సంవ‌త్స‌రం జిడిపి వృద్ధి రేటు ను మ‌నం గ‌మ‌నించిన‌ట్ల‌యితే, అది మా ద్వారా గ‌డ‌చిన 5 ఏళ్ళ కాలం లో అత్యంత వేగం గా పెరిగింది.

1991వ సంవ‌త్స‌రం నుండి ద్ర‌వ్యోల్బ‌ణం రేటు ను మ‌నం ప‌రిశీలించిన‌ట్ల‌యితే, అది మా ద్వారా గ‌డ‌చిన 5 ఏళ్ళ కాలం లో అత్యంత వేగవంత‌మైన రేటు చొప్పున త‌గ్గిపోయింది. ఇవాళ ర‌హ‌దారుల‌ ను అత్యంత వేగ‌వంత‌మైన‌టువంటి రీతిలో నిర్మించ‌డం జ‌రుగుతోంది. రైల్వేల అభివృద్ధి ప‌నులు శ‌ర‌వేగం గా పురోగ‌మిస్తున్నాయి. మేము పేద‌ల కోసం అత్యంత వేగ‌వంత‌మైన స్థాయి లో గృహాల‌ ను నిర్మిస్తున్నాము. ఈ రోజు న దేశం లో అత్యంత వేగ‌వంత‌మైన ప‌ద్ధ‌తి లో మొబైల్ త‌యారీ యూనిట్ లను ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతోంది. ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ నెట్‌వ‌ర్క్ ను అమ‌ర్చే ప‌ని దేశం లో అత్యంత వేగం గా జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ఎఫ్‌డిఐ అత్యంత వేగ‌వంత‌మైన ప‌ద్ధ‌తి లో దేశం లోకి ప్ర‌వ‌హిస్తోంది. ప్ర‌స్తుతం దేశం లో పారిశుధ్య నిర్వ‌హ‌ణ అత్యంత వేగ‌వంత‌మైన రీతి లో మెరుగు ప‌డుతోంది.

కాబ‌ట్టి, మీ యొక్క ఉప శీర్షిక‌ ‘స‌బ్‌సే తేజ్’ మాదిరి గానే, ‘స‌బ్‌సే తేజ్’ మా యొక్క ప్ర‌భుత్వపు జీవ రేఖ గా ఉంది.

సోదరీమణులు మరియు సోదరులారా,

2013వ సంవ‌త్స‌రం లో నేను మీ కార్యాల‌యాన్ని సంద‌ర్శించిన‌ప్పుడు ఇద్ద‌రు మిత్రుల‌ ను గురించిన ఒక క‌థ ను మీకు వివరించాను. ఒక‌ప్పుడు ఇద్ద‌రు స్నేహితులు ఒక అడ‌వి కి వెళ్ళారు. అది ఎంతో భయాన్ని గొలిపే అడ‌వి. కాబ‌ట్టి, వారు వారి వెంట మంచి నాణ్య‌త క‌లిగిన ఒక తుపాకీ ని తీసుకొని అపాయ‌క‌ర‌మైన వన్య మృగాల బారి నుండి త‌మ‌ ను తాము కాపాడుకోవాల‌ని భావించారు. వారు అడ‌వి లో నుండి న‌డ‌చి వెళ్ళద‌ల‌చారు. వారు ద‌ట్ట‌మైన అర‌ణ్యం లోకి ప్ర‌వేశించ‌గానే, హ‌ఠాత్తు గా వారి ఎదుట ఒక సింహం ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇప్పుడు వారు ఏం చేసి ఉండవలసింది ? వారు వారి యొక్క తుపాకీ ని కారు లోనే వ‌ద‌లి వెళ్ళారు. అది ఒక అపాయ‌క‌ర‌ ప‌రిస్థితి. ఆ ప‌రిస్థితి ని ఎలాగ గ‌ట్టెక్క‌డం ? వారు త‌ప్పించుకొనేందుకు ఆస్కార‌మే లేదు.

అయితే, వారిలో ఒక‌రు త‌న ద‌గ్గ‌ర తుపాకీ యొక్క లైసెన్సు ఉందంటూ దాని ని బ‌య‌ట‌కు తీసి సింహాని కి చూపించాడు.

మిత్రులారా,

అప్ప‌ట్లో ఈ క‌థ‌ ను మీకు నేను వినిపించిన‌ప్పుడు ప్ర‌భుత్వ ప‌రిస్థితి కూడా ఇదే విధం గా ఉండింది. మునుప‌టి ప్ర‌భుత్వం ఎన్నో చ‌ట్టాల‌ ను రూపొందించింది గాని వాటి విషయం లో ఎటువంటి కార్యాచ‌ర‌ణ చోటు చేసుకోలేదు.

మేము ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన త‌రువాత, చ‌ట్టాల‌ ను అమ‌లు చేయ‌డం లో చొర‌వ తీసుకొన్నాము. ఆ కాలాని కి, ప్ర‌స్తుత కాలాని కి మ‌ధ్య ఉన్న తేడా ను మీకు చెప్ప‌డం కోసం నేను మ‌రికొన్ని ఉదాహ‌ర‌ణ‌ల‌ ను ఇవ్వ‌ద‌ల‌చాను.

మిత్రులారా,

బేనామీ ఆస్తి చ‌ట్టం 1988వ సంవ‌త్స‌రం లో ఆమోదానికి నోచుకొన్నప్పటికీ, అది ఎన్న‌టికీ అమ‌లు లోకి రాలేదు. ఆ చ‌ట్టాన్ని కార్యాచ‌ర‌ణ లోకి తీసుకొని వ‌చ్చిందే లేదు.

మా ప్ర‌భుత్వం ఈ చ‌ట్టాన్ని అమ‌లు లోకి తీసుకు వ‌చ్చి, వేలాది కోట్ల రూపాయ‌ల బేనామీ ఆస్తి ని స్వాధీన ప‌ర‌చుకొంది.

మునుప‌టి ప్ర‌భుత్వం హ‌యాం లో ఆహార భద్ర‌త చ‌ట్టం ప‌రిస్థితి ని మీరు చూసే ఉంటారు. దాని ని గొప్ప దర్పం తో తీసుకు రావ‌డమైంది. అయితే, మా ప్ర‌భుత్వం అధికారం లోకి వ‌చ్చిన త‌రువాత మేము ఈ చ‌ట్టాన్ని కేవ‌లం 11 రాష్ట్రాల‌ లో, అది కూడా అసంపూర్ణ ప‌ద్ధ‌తి లో అమ‌లు చేయ‌డాన్ని చూసి దిగ్భ్రమ కు లోనయ్యాము.

మొట్ట‌మొద‌టి సారి గా మా ప్ర‌భుత్వం, ఈ చ‌ట్టాన్ని దేశం లోని అన్ని రాష్ట్రాల‌ లోను, కేంద్ర పాలిత ప్రాంతాల‌ లోను అమ‌లు ప‌ర‌చింది. మ‌రి దీని యొక్క లాభాలు ప్ర‌జ‌ల‌ కు అందేట‌ట్లు గానూ శ్ర‌ద్ధ తీసుకొంది.

ఇదివ‌ర‌కు ఉన్న‌ది కూడా అదే ప్ర‌భుత్వ అధికారులు, అవే ఫైళ్ళు, మ‌రి అవే కార్యాల‌యాలు. కానీ, ఫ‌లితాలు ప్ర‌తి ఒక్క‌రు ఎరిగిన‌వే.

మేము కార్యాచ‌ర‌ణ ను గురించి నొక్కి వ‌క్కాణించాము. చూడండి. అభివృద్ధి ప‌నులు ఎంత వేగం తో జ‌రుగుతున్నాయో.

మిత్రులారా,

2014వ సంవ‌త్స‌రం నుండి 2019వ సంవ‌త్స‌రం మ‌ధ్య 5 సంవ‌త్స‌రాల లో మీరు అభివృద్ధి ప్ర‌స్థానాన్ని చేప‌ట్టిన‌ట్ల‌యితే మీరు కొన్ని ద‌శాబ్దుల అభివృద్ధి గుండా ప్ర‌యాణించిన‌ట్లు మీకు అనిపిస్తుంది.

ఈ విష‌యాన్ని నేను న‌మ్మ‌కం గా చెప్ప‌గ‌ల‌ను. దీని కి కార‌ణం ఏమిటంటే, మా ప్ర‌భుత్వం యొక్క 5 ఏళ్ళ క‌ఠోర శ్ర‌మ కు తోడు 125 కోట్ల మంది భార‌తీయుల ఆశీస్సులు ఉన్నాయి కాబ‌ట్టి.

2014వ సంవత్సరం నుండి 2019వ సంవ‌త్స‌రం వ‌ర‌కు న‌డ‌చిన‌టువంటి కాలం అవ‌స‌రాల‌ ను తీర్చేట‌టువంటి కాలం. కాగా, 2019 వ సంవ‌త్స‌రం త‌రువాతి కాలం ఆకాంక్ష‌ల ను నెర‌వేర్చేటటువంటి కాలం.

2014వ సంవ‌త్స‌రం నుండి 2019వ సంవ‌త్స‌రం మ‌ధ్య ప్ర‌తి ఇంటి మౌలిక అవ‌స‌రాల‌ ను పూర్తి చేసే కాలం కాగా, 2019వ సంవ‌త్స‌రం త‌రువాతి కాలం వేగ‌వంత‌మైన అభివృద్ధి దిశ గా ప‌య‌నించ‌డాని కి ఉద్దేశించిన‌టువంటి కాలం.

2014వ సంవ‌త్స‌రం మ‌రియు 2019వ సంవ‌త్స‌రం మ‌ధ్య కాలం, అలాగే, 2019వ సంవ‌త్స‌రం త‌రువాతి కాలం మారుతున్న‌టువంటి క‌ల‌ల యొక్క గాథ‌; నిరాశావహ ప‌రిస్థితి నుండి ఆశ యొక్క శిఖ‌రాన్ని చేరేటటువంటి మ‌రియు సంక‌ల్పం నుండి కార్య సాధ‌న దిశ గా త‌ర‌లి వెళ్ళేట‌టువంటి కాలం.

మిత్రులారా,

21వ శ‌తాబ్దం భార‌త‌దేశాని కి చెందిన‌ది అని మ‌నం ఎన్నో పుస్త‌కాల‌ లో చ‌దివాము.

గ‌డ‌చిన 5 ఏళ్ళ లో క‌ఠోరం గా శ్ర‌మించి మేము పునాది రాయి ని బ‌లోపేతం చేశాము. ఈ పునాది రాయి ఆధారం గా ‘న్యూ ఇండియా’ యొక్క భ‌వ్య‌మైన క‌ట్ట‌డాన్ని నిర్మించ‌డం జ‌రుగుతుంది.

ఈ రోజు న నేను రూఢి గా చెప్ప‌గ‌ల‌ను. అది ఏమిటంటే ‘‘అవును, 21వ శ‌తాబ్దం భార‌త‌దేశాని కి చెందిందే’’ అనేదే. ఈ న‌మ్మ‌కం తో నేను నా ఉప‌న్యాసాన్ని ముగిస్తున్నాను.

‘ఇండియా టుడే కాన్‌క్లేవ్’ కు న‌న్ను ఆహ్వానించినుందుకు మ‌రియు నా యొక్క ఆలోచ‌న‌ల‌ ను మీ అంద‌రి స‌మ‌క్షం లో వెల్ల‌డించే అవ‌కాశాన్ని ఇచ్చినందుకు మీకు నా యొక్క హృద‌యాంత‌రాళం లో నుండి ధ‌న్య‌వాదాలు ప‌లుకుతున్నాను.