Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇండియా పెరూ ల మ‌ధ్య ఒప్పందానికి కేబినెట్ ఆమోదం


 

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేబినెట్ స‌మావేశం, 2018 మే లో పెరూలోని లిమాలో ఇండియా , పెరూల మ‌ధ్య సంత‌కాలు జ‌రిగిన ఒప్పందానికి ఆమోదం తెలిపింది.ప‌ర‌స్ప‌రం ప్ర‌యోజ‌నం క‌లిగించే రీతిలో స‌మాన‌త్వం, ప‌ర‌స్ప‌రం ఇచ్చిపుచ్చుకునే  ప్రాతిప‌దిక‌గా నూత‌న‌,రెన్యువ‌బుల్ అంశాల‌పై సాంకేతిక ద్వైపాక్షిక స‌హ‌కారాన్ని ప్రోత్సహించేందుకు, స‌హ‌కార వ్య‌వ‌స్థాగ‌త సంబంధాల ఏర్పాటుకు ప్రాతిప‌దికను ఏర్ప‌రిచేందుకు ఈ ఒప్పందం ఉద్దేశించిన‌ది. ఈ ఒప్పందాన్ని అమ‌లు చేసేందుకు ప‌ని ప్ర‌ణాళిక‌ల‌ను అభివృద్ధిచేసేంద‌కు ఒక సంయుక్త క‌మిటీ ఏర్పాటుకు ఈ ఒప్పందం వీలు క‌ల్పిస్తుంది. ఈ ఒప్పందం ఉభ‌య‌దేశాల‌మ‌ధ్య ద్వైపాక్షిక స‌హ‌కారాన్ని బ‌లోపేతం చేసేందుకు తోడ్ప‌డుతుంది.