పిఎంఇండియా
రోడ్డు రవాణా మరియు రహదారి పరిశ్రమ రంగాలలో భారత్, రష్యా మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అవగాహన ఒప్పందాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. త్వరలో రష్యా అధ్యక్షుని భారత పర్యటన సందర్భంగా ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయడం జరుగుతుంది.
రవాణా, రహదారుల రంగంలో సహకారానికి అవసరమైన వేదిక స్థాపనకు, అభివృద్ధికి రోడ్ రవాణా మరియు రహదారి పరిశ్రమ రంగాలలో అవగాహన ఒప్పందం కుదుర్చుకునే విషయంలో రెండు దేశాల మధ్య గతంలో సంప్రదింపులు జరిగాయి. దరిమిలా ఈ ఒప్పందానికి తుది రూపం ఇవ్వడం జరిగింది. రోడ్డు రవాణా మరియు రహదారి పరిశ్రమ రంగాలలో ఉమ్మడి సహకారం వల్ల రెండు దేశాలకు ప్రయోజనం కలుగుతుంది. ఇది రష్యాతో సహకారం పెరుగుదలకు, అనుభవాల మార్పిడికి మరియు సమన్వయం పెంపొందడానికి , దీర్ఘకాలిక, సమర్థవంతమైన కమ్యూనికేశన్ మరియు రోడ్డు రవాణా మరియు రహదారి పరిశ్రమ, చతుర రవాణా వ్యవస్థ ఏర్పరచుకోవడానికి అవకాశం కలుగుతుంది. దీనివల్ల దేశంలో రోడ్ల మౌలిక సదుపాయాలు నిర్వహణకు మరియు యాజమాన్యానికి సంబంధించిన రవాణా విధానం రూపకల్పనకు, రహదారుల నిర్మాణం మరియు నిర్వహణకు సంబంధించిన ప్రమాణాలు, సాంకేతిక అంశాలు రూపకల్పన, పాలనకు సౌలభ్యం ఏర్పడుతుంది. ఈ ఒప్పందం భారత్-రష్యా మధ్య సంబంధాలు మరింత పటిష్టం కావడానికి దోహదం చేస్తుంది.
పూర్వ రంగం:
భారత్-రష్యా మధ్య దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయి. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక, పటిష్టమైన ఆర్థిక సంబంధాలు కూడా ఉన్నాయి. భారత్ కోసం సుంకాల వసూలుకు సంబంధించి ఉపగ్రహ ఆధార సాంకేతిక సాధనాలు కూడా రష్యా అభివృద్ధి చేసింది. అంతేకాకుండా వారు అత్యాధునిక చతుర ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ , ప్రమాదాలను తెలియజేయడం/ నియంత్రణ వ్యవస్థలను కూడా రూపొందించారు. రోడ్డు రవాణా రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో రష్యాకు గల అనుభవాన్ని అధ్యయనం చేసి వాటిని మన దేశంలో అమలు చేయడం వల్ల మనకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ప్రస్తుతం భారత్ రోడ్ల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమై ఉంది. మన రోడ్లను పూర్తిస్థాయిలో వినియోగించుకుని
ఉత్పాదకత , భద్రత పెంచడానికి సాంకేతిక పరిజ్ఞానం అవలంబన ఎంతో అవసరం. దానివల్ల నిర్వహణ వ్యయం బాగా తగ్గుతుంది. ఇండియాలో రహదారుల రంగంలో భారీ స్థాయిలో మార్పులు తేవాలని మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం అనుకుంటున్న నేపథ్యంలో రష్యాకు చెందినా మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థలు తమ కార్యకలాపాలను ఇండియాకు విస్తరించడానికి ఇది ఆకర్షణీయమైన అవకాశం. రెండు దేశాల మధ్య ఈ భాగస్వామ్యం కార్య స్థాయిలో పని చేసేవారు సంబంధాలు పెంపొంది వారు తమ అనుభవాలను పంచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాక రెండు దేశాలకు సభ్యత్వం ఉన్న అంతర్జాతీయ బృందాలు మరియు వేదికలలో చేపట్టే కార్యాచరణకు ప్రేరణగా కూడా ఉంటుంది.