పిఎంఇండియా
వాణిజ్యపరిశ్రమల శాఖ మంత్రి శ్రీ ఈశ్వరన్, గౌరవనీయులైన మంత్రులు, మిత్రులారా
ఈ రోజు మీ అందరి మధ్య నిలవడం ఆనందదాయకం. ఇండియా-సింగపూర్ ఆర్థిక సదస్సులో మీ అందరినీ ఉద్దేశించి ప్రసంగిస్తున్నందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. నా ఈ పర్యటన అత్యంత సానుకూలమైనదిగాను, ఉత్పాదకమైనదిగాను ఉంది. ఈ రోజు ఉదయం సింగపూర్ నాయకులతో నా సమావేశాలు అద్భుతంగా జరిగాయి. ఉభయ దేశాల సంబంధాలను మరో కొత్త స్థాయికి తీసుకువెళ్ళగల వ్యూహాత్మక భాగస్వామ్యం మే పూర్తి చేసుకున్నాం. ఈ సంబంధాలకు మరింత ఆశావహమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం.
చారిత్రకమైన బాంధవ్యం, సాంస్కృతిక సాన్నిహిత్యం మన సంపద. భారీ సంఖ్యలో భారతీయులు సింగపూర్‌లో ఉద్యోగాలు చేస్తూ ఇక్కడి వాతావరణాన్ని ఎంతగానో ఆస్వాదిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక బాంధవ్యం మన బంధానికి చోదకశక్తిగా నిలుస్తోంది. అంతర్జాతీయంగా భారత్‌కు సింగపూర్ పదవ పెద్ద వాణిజ్య భాగస్వామి. ఆసియాన్‌లో రెండో పెద్ద భాగస్వామి. 2005లో సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం కుదిరిన తర్వాత మన ద్వైపాక్షిక వాణిజ్యం ఎన్నో రెట్లు పెరిగింది. భారత్‌లో ఎఫ్‌డిఐలకు సింగపూర్ రెండో పెద్ద వనరుగా మారింది. ఇటీవల కాలంలో భారత్ నుంచి సింగపూర్‌కి కూడా ఎఫ్‌డిఐలు గణనీయంగా పెరిగాయి. భారత ఇన్వెస్టర్ల పెట్టుబడుల ప్రధాన కేంద్రాల్లో సింగపూర్ ఒకటిగా నిలుస్తోంది.
సింగపూర్‌లో భారీ సంఖ్యలో భారతీయ కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి. గత కొద్ది సంవత్సరాల కాలంలో పెరిగిన సాన్నిహిత్యం కారణంగా సింగపూర్ కంపెనీలు కూడా భారత మార్కెట్లో వాటా పెంచుకోగలిగాయి. మరింత ఆశావహమైన లక్ష్యాల సాధనకు మన కంపెనీలు సమాయత్తం అవుతున్నాయి. రెండు వైపులా కంపెనీల భాగస్వామ్యం పెరగడం, రెండు మార్కెట్లలోనూ విదేశీ కంపెనీలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉండడం వల్ల రానున్న కాలంలో మరింత విస్తృత భాగస్వామ్యాలను నేను ఆశిస్తున్నాను.
– మీ దగ్గర నాణ్యతకు, విశ్వసనీయతకు భరోసా ఉంది, భారత్‌కు విస్తరణ అవకాశం ఉంది.
– ఎక్కడకు కావాలంటే అక్కడకు తరలివెళ్ళడం మీకు ఇష్టం, అభివృద్ధిని అన్ని దిశలకు విస్తరిండం మాకు ఇష్టం.
– మీరు ఎంతో విలువైన ఇంక్యుబేటర్ వంటి వారు, భారత్ విస్తృత ప్రయోగశాల.
భారత, సింగపూర్ ఎన్నో రంగాల్లో కలిసి కృషి చేయగల శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నాయి.
సింగపూర్ భాగస్వామ్యంతో చేపడుతున్న రెండు భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసే అవకాశం గత నెల నాకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి నిర్మాణం వాటిలో ఒకటి. ఆ కొత్త నగరానికి కావలసిన మాస్టర్ ప్లాన్ సింగపూర్ తయారుచేసి ఇచ్చింది. ముంబైలోని జెఎన్పిటిలో నాల్గవ కంటైనర్ టెర్మినల్ నిర్మాణానికి కూడా నేను శంకుస్థాపన చేశాను. సింగపూర్‌కి చెందిన పిఎస్ఏ ఇందులో భాగస్వామిగా ఉంది. రెండు భారత విమానాశ్రయాల నిర్వహణలో చాంగి ఎయిర్పోర్ట్ భాగస్వామ్యానికి గల అవకాశాలు మేం అన్వేషిస్తున్నాం. భారత్-సింగపూర్ ఆర్థిక భాగస్వామ్యం మరింతగా విస్తరిస్తున్నదనేందుకు ఇవి తాజా ఉదాహరణలు.
మా అంతర్జాతీయ దృక్కోణంలో సింగపూర్ మాకు ఎంతో విలువైన, కీలక భాగస్వామి. మేం అనుసరిస్తున్న లుక్ అండ్ యాక్ట్ ఈస్ట్ పాలసీలో సింగపూర్ అత్యంత కీలక భాగస్వామి. ఈ పాలసీ అమలులో సింగపూర్ అత్యంత కీలకమైన పాత్ర పోషించిందన్న విషయం నాకు బాగా తెలుసు. సింగపూర్‌తో మరింతగా కలిసి పని చేసేందుకు నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.
ఈ ద్వైపాక్షిక సహకారంతో పాటుగా ఉభయులు ఇతర దేశాలతో కూడా కలిసి పని చేసేందుకు అవకాశాలు అపారంగా ఉన్నాయి. కొద్ది రోజుల క్రితమే సాకారం అయిన ఆసియాన్ ఆర్థిక సమాజం వాటిలో ఒకటి. 600 మిలియన్ ప్రజలకు రెండు ట్రిలియన్ డాలర్ల భారీ మార్కెట్‌ను అది అందిస్తుంది. విస్తారమైన ఆగ్నేయాసియా ప్రాంతంలో ఉమ్మడిగా వ్యాపారావకాశాల అన్వేషణకు ఇది మార్గం కల్పిస్తుంది.
ఆసియాన్, దానితో చేతులు కలిపేందుకు ముందుకు వచ్చిన ఆరు భాగస్వాములతో కూడిన ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్‌సిఇపి) వ్యవస్థ కూడా మన కంపెనీలకు కొత్త అవకాశాలను అందిస్తుంది. ఇటీవలే న్యూఢిల్లీలో ఇండియా ఆఫ్రికా ఫోరమ్ సదస్సు జరిగింది. అందులో సింగపూర్ ప్రత్యేక ఆహ్వాన దేశంగా పాల్గొంది. భారత-సింగపూర్ మైత్రికి ఇది ఒక కొత్త గుర్తింపు. ఆఫ్రికా దేశాల్లో కూడా మనం కలిసి పని చేసేందుకు చక్కని అవకాశం.
సోదరసోదరీమణులారా
భారత్ భారీ ఆర్థిక, సామాజిక పరివర్తన దశలో ఉంది. చరిత్రలో కనివిని ఎరుగని వేగంతో దూసుకుపోతోంది. గత ఏడాది మేం 7.3 శాతం వృద్ధి రేటును సాధించాం. ఈ ఏడాది మరింత మెరుగైన వృద్ధిని సాధించగలుగుతామని ప్రపంచబ్యాంకు అంచనా. ప్రపంచంలోని పెద్ద దేశాల్లో త్వరితగతిన వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తోంది. ఈ అభివృధ్ధి ఫలాలు సగటుజీవికి అందించేందుకు మేం ఎంతగానో కృషి చేస్తున్నాం. అందరినీ ఆర్థిక కార్యకలాపాల్లో భాగస్వాములను చేసేందుకు మేం ఎన్నో ప్రధాన పథకాలు ప్రారంభించాం. మా వ్యూహంలో
– ఆర్థిక వ్యవస్థలో కొత్త ఉత్తేజం
– ప్రజల సాధికారత
– నిధులు అందుబాటులో లేని వర్గాలకు వనరుల కల్పన
– పేదల సంక్షేమం
– అందరి ఆదాయ స్థాయి విస్తరణ ప్రధానాంశాలు.
ధనం సమాజంలో నిరాదరణకు గురైన వర్గాలకు అందుబాటులోకి రావాలి. ఈ లక్ష్యం కోసం మేం 190 మిలియన్ కొత్త బ్యాంకు ఖాతాలు ప్రారంభించాం. ఈ ఖాతాల ద్వారా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులందరికీ సొమ్ము వారి ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నాం. దీని వల్ల ప్రభుత్వ వ్యయంలో క్రమశిక్షణ ఏర్పడింది. మేం కొత్త బీమా, పింఛను పథకాలు ప్రారంభించాం. ముద్ర అనే పేరుతో కొత్త బ్యాంకు ఏర్పాటు చేసి చిన్న వ్యాపారులకు ఆర్థిక సహాయం అందిస్తున్నాం. ఇల్లు, నీరు, విద్యుత్తు, పారిశుధ్యం అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు మేం కాలపరిమితితో కూడిన లక్ష్యాలు నిర్దేశించుకున్నాం. ఈ కార్యక్రమాలన్నింటితో భారత్ ప్రస్తుతం ఆర్థిక విప్లవం కొత్త శకంలో పురోగమిస్తోంది. ఇవన్నీ అంతర్జాతీయ పెట్టుబడుల సమాజానికి కొత్త అవకాశాలు అందిస్తున్నాయి.
సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో 50 మిలియన్ గృహాల నిర్మాణం నుంచి రైల్వే నెట్వర్క్ ఆధునికీకరణ, రైల్వే స్టేషన్ల పునర్నిర్మాణం, కొత్త రైల్వే కారిడార్ల ఏర్పాటు,175 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి, విద్యుత్ ట్రాన్స్మిషన్, పంపిణీ వ్యవస్థల అభివృద్ధి, జాతీయ రహదారులు, వంతెనలు, మెట్రో రైల్ నెట్‌వర్క్‌ల నిర్మాణం వరకు ఎన్నో అవకాశాలు మీ ముందున్నాయి.
మౌలిక వసతుల నిర్మాణం, వస్తు సేవల ఉత్పత్తిలో ఇంత భారీ అవకాశాలు మరే దేశంలోనూ అందుబాటులో లేవు. ప్రపంచంలోని ఏ ఒక్క ప్రాంతం కూడా ఇంత విస్తృతమైన కస్టమర్ బేస్‌ను అందించలేదు.
మా విధానాలు, ప్రజాబలం ద్వారా ఈ అభివృద్ధి అవకాశాలు ముందుకు నడపాలన్నది మా భావన. ప్రజలను కూడా ఇందులో భాగస్వాములను చేయడం లక్ష్యంగా మేం డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి కార్యక్రమాలు రూపొందించాం. ఇటీవల కాలంలో మా దేశంలో స్టార్టప్‌ల సంఖ్య గణనీయంగా పెరిగింది. వీటిలో కొన్ని అంతర్జాతీయ సంస్థలకు కూడా సవాలు విసురుతున్నాయి. స్టార్టప్‌ల పూర్తి సామర్థ్యాన్ని వినియోగంలోకి తెచ్చేందుకు మేం ఇటీవల స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా ప్రచారోద్యమం కూడా చేపట్టాం.
మిత్రులారా
గత కొద్ది నెలల కాలంలో విదేశీ ఇన్వెస్టర్లలో భారత్ పట్ల ఆసక్తి గణనీయంగా పెరిగింది. కాని నియంత్రణలు, పన్నులకు సంబంధించిన పలు అంశాలు వారి సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. దీర్ఘకాలికంగా ఇన్వెస్టర్లలో గల భయాలను తొలగించేందుకు మేం ఎన్నో నిర్ణయాత్మక చర్యలు చేపట్టాం.
మీకు కొన్ని ఉదాహరణలు ఇవ్వాలనుకుంటున్నాను…
– పర్యావరణ, సెక్యూరిటీ క్లియరెన్స్‌ల తో సహా పలు నియంత్రణాపరమైన అనుమతులు సత్వరం ఇచ్చే పరిస్థితి కల్పించాం
– లైసెన్సింగ్ వ్యవస్థను విశేషంగా సరళీకృతం చేశాం
– రక్షణ పారిశ్రామిక లైసెన్సుల చెల్లుబాటు గడువును మూడు సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు పెంచాం
– 60 శాతం రక్షణ ఉత్పత్తులను లైసెన్సింగ్ విధానం నుంచి వెలుపలికి తీసుకువచ్చాం, ఎగుమతులకు చివరి వినియోగదారుని సర్టిఫికెట్ వంటి అవరోధాలు తొలగించాం.
– వెనుక తేదీ నుంచి పన్నులు విధించేది లేదని ఎంతో స్పష్టమైన సందేశం ఇచ్చాం, ఎన్నో మార్గాల్లో దీన్ని నిరూపించి చూపించాం
– ఎఫ్‌పిఐలు, ఇతన విదేశీ ఇన్వెస్టర్లకు కాంపోజిట్ సెక్టర్ కాన్సెప్ట్ ప్రవేశపెట్టాం.
– ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లకు నియంత్రణలు ప్రకటించాం
– రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లకు కాపిటల్ గెయిన్స్ పన్ను విధానాన్ని హేతుబద్దం చేశాం
– పెర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ నిబంధనలు ఆధునీకరించాం
– గార్ (జనరల్ యాంటి ఎవాయిడెన్స్ నిబంధనలు) అమలును రెండేళ్ళ పాటు వాయిదా వేశాం
– జిఎస్టి బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాం, 2016 నుంచి దాన్ని అమలుచేయగలన్న విశ్వాసం మాకుంది.
– కొత్త దివాలా ప్రకటన నిబంధనావళి, ఐపిఆర్ విధానం రూపొందిస్తున్నాం
– త్వరలో కంపెనీ లా ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం
– ఎంతో విలువైన బొగ్గు, స్పెక్ట్రం, ఇనుప ఖనిజం వంటి సహజవనరులు పారదర్శకమైన విధానంలో వేలం వేసి కేటాయించే విధానం ప్రవేశపెట్టాం
ఇవన్నీ కొన్ని ఉదాహరణలు మాత్రమే. పన్ను విధానాలు ఊహాత్మకమైనవి, పారదర్శకమైనవిగా ఉంచేందుకు మేం శ్రమిస్తున్నాం. పన్ను విధానాల్లో నిజాయతీపరులైన ఇన్వెస్టర్లు, పన్ను చెల్లింపుదారులకు సత్వరం నిష్కళంకమైన నిర్ణయాలు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ లక్ష్యసాధనలో భాగంగా ఇప్పటికే ఎన్నో దిద్దుబాట్లు చేశాం.
ఈ చొరవలన్నింటి వల్ల
– విదేశీ పెట్టుబడుల కట్టుబాట్లు వాస్తవరూపం దాల్చాయి
– ముందు ఏడాదితో పోల్చితే ఎఫ్‌డిఐల రాక 40 శాతం మేరకు పెరిగింది
– ఆశలు వాస్తవిక రూపం దాల్చాయి
– ప్రపంచబ్యాంకు వాతావరణానుకూల సూచిలో మా స్థానం 12కి చేరింది
– 32 శాతం బ్రాండ్ విలువతో భారత్ బ్రాండ్ విలువలో ఏడు స్థానానికి ఎదిగింది
– పలు అంతర్జాతీయ ఏజెన్సీలు భారత్‌కు ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యంగా ర్యాంకింగ్ ఇస్తున్నాయి
– పెట్టుబడుల ఆకర్షణలో అంక్టాడ్ ర్యాంకింగ్‌లో 15వ స్థానం నుంచి 9వ స్థానానికి ఎదిగాం
– వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రపంచ పోటీ సూచిలో భారత్ 16 స్థానాల పైకి వచ్చింది
– భారత్ రేటింగ్‌ను మూడీస్ పాజిటివ్‌కి పెరిగింది
ఇలా మా ప్రభుత్వం అధికారం చేపట్టిన 18 మాసాల కాలంలో అంతర్జాతీయ ఇన్వెస్టర్ల దృష్టిలో భారత్‌పై విశ్వాసాన్ని విజయవంతంగా పునరుద్ధరించగలిగాం. ప్రభుత్వం అధికారం చేపట్టగానే ఇతర సంస్కరణలతో పాటుగా ఎఫ్‌డిఐల సరళీకరణకు కూడా చర్యలు తీసుకున్నాం. రైల్వేలో నూరు శాతం ఎఫ్‌డిఐలను అనుమతించడంతో పాటు రక్షణ, బీమా రంగాల్లో ఎఫ్‌డిఐ పరిమితిని 49 శాతానికి పెంచాం. చివరి స్థాయిలో ఆచరణీయతకు దోహదపడే విధానాల విషయంలో కూడా మేం అప్రమత్తంగా ఉన్నాం. ఈ నెల ప్రారంభంలో ఆర్థిక వ్యవస్థను ఎఫ్‌డిఐలకు మరింతగా తెరిచేందుకు సాహసోపేతమైన చర్యలు తీసుకున్నాం.
ఈ మలి విడత సంస్కరణలతో
– ఎఫ్‌డిఐలకు భారత్ అత్యంత అనుకూల దేశంగా మారింది
– కొన్ని కొత్త రంగాలు ఎఫ్‌డిఐలకు పూర్తిగా అందుబాటులోకి వచ్చాయి
– చాలా రంగాల్లో ఎఫ్‌డిఐ అనుమతులు ఆటోమేటిక్ మార్గంలోనే జరుగుతున్నాయి
– కొత్త ప్రాజెక్టులకే కాకుండా విస్తరణ ప్రాజెక్టులు కూడా ఎఫ్‌డిఐలకు అందుబాటులోకి వచ్చాయి
– ఎఫ్‌డిఐలకు సంబంధించిన ఎంట్రీ, ఎగ్జిట్ నిబంధనలు కూడా విశేషంగా సరళం అయ్యాయి
మిత్రులారా
మేం డిజిటల్ నెట్వర్క్, స్వచ్ఛ ఇంధనాలతో సహా కొత్త తరం మౌలిక వసతులపై పెట్టుబడులు పెంచాలన్న కట్టుబాటులో ఉన్నాం. ప్రజల జీవితాల్లో నాణ్యత పెంచేందుకు సామాజిక, పారిశ్రామిక, వ్యవసాయ మౌలిక వసతులను కూడా మెరుగుపరుస్తున్నాం.
ప్రభుత్వ వ్యయాలను గణనీయంగా తగ్గించడం ద్వారా ప్రభుత్వ రంగ పెట్టు బడులు పెంచాం. ఈ పరిస్థితి మరింత సానుకూలంగా మార్చుకునే లక్ష్యంతో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ర్టక్చర్ బోర్డు ఏర్పాటు చేస్తున్నాం. బాండ్ మార్కెట్‌ను మరింత విస్తరించేందుకు పన్ను రహిత ఇన్ఫ్రాస్ర్టక్చర్ బాండ్లు కూడా జారీ చేస్తున్నాం. అలాగే విదేశీ మార్కెట్లో ఇన్ఫ్రా రంగానికి అవసరమైన నిధుల సమీకరణ కోసం రూపాయి బాండ్లు జారీ చేయాలనుకుంటున్నాం. సింగపూర్ కూడా రూపాయి బాండ్ల జారీకి అవకాశాలున్న మార్కెట్లలో ఒకటి. ఈ విషయంలో సింగపూర్‌తో కలిసి పని చేయాలనుకుంటున్నాం.
మిత్రులారా
భారదదేశంలో 800 మిలియన్ ప్రజలు 35 సంవత్సరాల లోపు వయస్కులే. భారత ఆర్థిక పరివర్తనలో వారి ఆకాంక్షలు, శక్తియుక్తులు, నైపుణ్యాలు అత్యంత కీలక శక్తిగా నిలుస్తాయి. కాని వారికి ఉత్పాదకమైన ఉపాధిని కల్పించడం తక్షణ సవాలు. ఎన్నో దశాబ్దాలుగా జిడిపిలో 16 శాతం వద్ద నిలిచిపోయి ఉన్న తయారీ రంగాన్ని ఉత్తేజితం చేయడం ఈ సవాలును ఎదుర్కొనే క్రమంలో అత్యంత కీలకం. స్వల్పకాలిక, మధ్యకాలిక ధోరణుల్లో కూడా జిడిపిలో తయారీ రంగం వాటా 25 శాతానికి పెరగాల్సిన అవసరం ఉంది.ఈ లక్ష్యంతోనే మే “మేక్ ఇన్ ఇండియా” పిలుపు ఇచ్చాం. అన్ని విభాగాల్లోను భారత్ అంతర్జాతీయ తయారీ కేంద్రంగా తీర్చి దిద్దేందుకు మేం కృషి చేస్తున్నాం. అంతర్జాతీయ శ్రేణితో కూడిన తయారీ రంగంతో నవ్య ఆర్థిక వ్యవస్థకు రూపకల్పన చేసేందుకు అంతర్జాతీయ నైపుణ్యాల పూల్ తయారుచేస్తున్నాం.
ఈ లక్ష్య సాధన కోసం వ్యాపారానుకూల వాతావరణం కల్పించేందుకు మేం ఎంతో శ్రమిస్తున్నాం. పరిశ్రమలు, మౌలిక రంగానికి అనుమతుల ప్రక్రియను వేగవంతం చేశాం. విధానాలతో పని చేసే భాగస్వామ్యపాలనా విధానం మా వ్యూహం.
పిపిపి ద్వారా గతంలో ప్రభుత్వం మాత్రమే పెట్టుబడులు పెట్టిన రంగాల్లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని కూడా ప్రోత్సహిస్తున్నాం. మార్కెట్ క్రమశిక్షణ కోసం ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరిస్తున్నాం. మా ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేసేందుకు మేం నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాం. వచ్చే మూడు మాసాల కాలం కూడా పెట్టుబడులు, వ్యాపారాల రాకకు మారుమూల అవరోధాలను కూడా తొలగించేందుకు కాలాన్ని పూర్తిగా కేటాయించాలని నేను భావిస్తున్నాను.
మిత్రులారా
మేం ఏది చేసినా రెండు కట్టుబాట్ల పరిధిలోనే ఉంటుంది. ఏ కార్యక్రమానికైనా మా ప్రజలే కేంద్రస్థానం కావాలి. వారి కోసమే మేం పెట్టుబడులు కోరుతున్నాం. త్వరిత అభివృద్ధిని సాధించడం ద్వారా అంతర్జాతీయ సమాజంలో ఆరో వంతు ఉన్న మా ప్రజల జీవితాల్లో పరివర్తన తీసుకురావడం మా లక్ష్యం.
రెండో కట్టుబాటు వాతావరణం, మనం నివశిస్తున్న భూమండలం, మన ప్రకృతికి సంబంధించినది. వాతావరణ మార్పులకు సంబంధించిన ముప్పును తగ్గించేందుకు మేం తీసుకున్న కట్టుబాటులో రాజకీయ, ఆర్థిక కోణాలేవీ లేవు. ఒకరి మీద భయంతో గాని, ఒకరికి అనుకూలంగా ఉండేందుకు గాని ఆ కట్టుబాట్లు తీసుకోలేదు. ప్రకృతి మన మాతృమూర్తి అన్న మూల భావన నుంచి ఉద్భవించిన కట్టుబాట్లవి. మన జీవితాలు స్థిరంగా సాగాలంటే ప్రకృతి చాలా కీలకం. అందుకే ప్రకృతిని మనం పోషించాలి. అది ఒక నమ్మకంతోకూడిన సిద్ధాంతం. ఈ దిశగా మేం చేయవలసిన దాని కన్నా చాలా ఎక్కువే చేస్తామని నేను అంతర్జాతీయ సమాజానికి హామీఇస్తున్నాను. సాధారణంగా చేయదగిన దాని కన్నా ఎక్కువ చేసేందుకు మా శక్తియుక్తులు కేంద్రీకరించాలన్నది మా భావన.
ఈ రెండు కట్టుబాట్లు కూడా ఆపారమైన ఆర్థికావకాశాలు, కార్యకలాపాలు మన ముందుకు తెస్తాయి. ఈ విభాగంలో కూడా భారత్ అందిస్తున్న అవకాశాలను ఏ ఇతర దేశం అందించలేదు. అద్భుతమైన అవకాశాలు ఇన్వెస్టర్ల ముందుకు వస్తున్నాయి.
ఒక్కసారి అంతా సింహావలోకనం చేసుకుందాం…
– గత 18 నెలల్లో భారీ సంస్కరణలు చోటు చేసుకున్నాయి. అవి ఇప్పుడు తుది దశకు చేరాయి.
– వ్యవస్థలు వాటికవే పని చేసుకుపోయేందుకే సంస్కరణలు.
– తేలికమాటల్లో చెప్పాలంటే ప్రజలు తమ శక్తిని, కలలను సాకారం చేసుకునేందుకు అవి దోహదపడతాయి.
– ముఖాలపై చక్కని వెలుగు, ఆఫీసుల్లో తక్కువ లాంఛనాలు వీటి లక్ష్యం.
– ఆర్థిక మార్కెట్లను కొత్త సరిహద్దుల్లోకి నడిపించేందుకు లోతైన పునాదులు వేసేందుకు కృషి జరిగింది.
– స్థూలంగా ఆర్థిక రంగం వేగవంతమైన వృద్ధి శకంలోకి దూసుకుపోయేందుకు రన్‌వేల నిర్మాణం జరిగింది.
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఒక వెలుగు బాటలో ఉన్నదని ఇటీవల ఐఎంఎఫ్ చీఫ్ అన్నారు. ఆ వెలుగులు వాటంతట అవే మీ వరకు ప్రసరించే వరకు వేచి ఉండాలని నేను భావించడంలేదు.
అందుకే నేను ఇక్కడ ఉన్నాను.
భారత్‌కు పెద్ద ఎత్తున ఆహ్వానించేందుకే ఇక్కడకు వచ్చాను.
మీ చేతుల్ని పట్టుకుని జాగ్రత్తగా నడిపించేందుకే నేను ఇక్కడకు వచ్చానని మీకు హామీ ఇస్తున్నాను.
ధన్యవాదాలు
Happy to address the India-Singapore Economic Convention. This visit has been productive & positive: PM https://t.co/ikpbo75nSI
— PMO India (@PMOIndia) November 24, 2015
Historical ties and cultural proximity are out assets: PM @narendramodi on India-Singapore ties https://t.co/ikpbo75nSI
— PMO India (@PMOIndia) November 24, 2015
Singapore is one of the top destinations for Indian investment. Many Indian companies are registered here: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 24, 2015
Singapore and India can work together in several positive areas: PM @narendramodi https://t.co/ikpbo75nSI
— PMO India (@PMOIndia) November 24, 2015
Singapore is involved in the master plan of Amaravati, Andhra Pradesh: PM @narendramodi https://t.co/ikpbo75nSI @ncbn @AndhraPradeshCM
— PMO India (@PMOIndia) November 24, 2015
Money has to reach the marginalised. We opened 190 million bank accounts & aim for direct transfer of benefits to the poor: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 24, 2015
We are trying to harness India's development potential through policies and our people: PM @narendramodi https://t.co/ikpbo75nSI
— PMO India (@PMOIndia) November 24, 2015
Many people of India are under 35. Their energy, enterprise & skill will guide India's transformation: PM https://t.co/ikpbo75nSI
— PMO India (@PMOIndia) November 24, 2015
Reforms are happening in a big way & these reforms are to transform systems: PM @narendramodi https://t.co/ikpbo75nSI
— PMO India (@PMOIndia) November 24, 2015
I am here to invite you to India in a bigger way: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 24, 2015
At India-Singapore Economic Convention, explained why India is the next frontier of economic revolution. https://t.co/VJIPRvtdW5
— Narendra Modi (@narendramodi) November 24, 2015
Interacted with investors in Singapore. Explained why India is the best place to be in & invest. pic.twitter.com/yBQ8XGtTff
— NarendraModi(@narendramodi) November 24, 2015