Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇండియ‌న్ కంప్యూట‌ర్ ఎమ‌ర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌కు మూడు దేశాల‌కు చెందిన సైబ‌ర్ కంపెనీల‌కు మ‌ధ్య‌ అవ‌గాహ‌నపూర్వ‌క ఒప్పంద ప‌త్రాలకు కేంద్ర మంత్రివర్గ ఆమోదం


మలేసియాకు చెందిన సైబ‌ర్ సెక్యూరిటీ, సింగ‌పూర్‌కు చెందిన సైబ‌ర్ సెక్యూరిటీ ఏజెన్సీ, జ‌పాన్‌కు చెందిన జ‌పాన్ కంప్యూట‌ర్ ఎమ‌ర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ కోఆర్డినేష‌న్ సెంట‌ర్ సంస్థ‌ల‌తో ఇండియ‌న్ కంప్యూట‌ర్ ఎమ‌ర్జెన్సీ రెస్పాన్స్ టీం (సిఇఆర్ టి – ఇన్‌) అవ‌గాహ‌న‌పూర్వ‌క ఒప్పందాల‌ను (ఎంఓయు) కుదుర్చుకుంది. త‌ద్వారా ఆయా దేశాలకు, ఇండియాకు మ‌ధ్య‌ సైబ‌ర్ భ‌ద్ర‌త రంగంలో స‌హ‌కార ప్ర‌క్రియ మొద‌ల‌వుతుంది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివర్గ స‌మావేశం ఈ ఒప్పందాల‌కు సంబంధించిన అంశాలను చ‌ర్చించి, ఆమోదం తెలిపింది.

సైబ‌ర్ భ‌ద్ర‌త‌ కోసం చేసుకున్న ఈ మూడు ఎంఓయు ల వివ‌రాలు ఇలా ఉన్నాయి:-

(i) ఇండియాకు చెందిన సిఇ ఆర్ టి-ఇన్ సంస్థ‌కు మ‌లేసియాకు చెందిన సైబ‌ర్ సెక్యూరిటీ సంస్థ‌కు మ‌ధ్య‌ అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పందం పైన స‌ంత‌కాలు 2015 నవంబ‌ర్ 23న మ‌లేషియా రాజ‌ధాని కౌలాలంపూర్ లో జ‌రిగాయి. ఈ సంత‌కాలు మ‌లేషియాలో ప్ర‌ధాన మంత్రి ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా జ‌రిగాయి.

(ii) ఇండియాకు చెందిన సిఇ ఆర్ టి-ఇన్ సంస్థ‌కు సింగ‌పూర్ దేశానికి చెందిన సింగ‌పూర్ ఎమ‌ర్జెన్సీ రెస్పాన్స్ టీం (ఎస్ ఐ ఎన్ జి సిఇఆర్ టి), సైబ‌ర్ సెక్యూరిటీ ఏజెన్సీ (సిఎస్ ఏ) సంస్థ‌ల‌కు మ‌ధ్య‌ అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పందం పైన 2015 నవంబ‌ర్ 24న సింగ‌పూర్ లో సంత‌కాలు జ‌రిగాయి. ఈ సంత‌కాలు సింగ‌పూర్ దేశంలో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా జ‌రిగాయి.

(iii) సిఇఆర్ టి- ఇన్, జ‌పాన్ ఎమ‌ర్జెన్సీ రెస్పాన్స్ టీం కోఆర్డినేష‌న్ సెంట‌ర్ (జెపిసిఇఆర్ టి/ సిసి) సంస్థ‌ల‌కు మ‌ధ్య‌ 2015 డిసెంబ‌ర్ 7న ఎంఓయు పై సంత‌కాలు జ‌రిగాయి. దౌత్య‌ప‌ర‌మైన మార్పిడిలో భాగంగా ఈ సంత‌కాలు జ‌రిగాయి. సంత‌కాల ఎంఓయు ను ఇచ్చిపుచ్చుకునే కార్య‌క్ర‌మం 22 డిసెంబ‌ర్ 2015 నాటికి ముగిసింది.

సైబ‌ర్ రంగంలో భ‌ద్ర‌త‌కు సంబంధించిన ఈ ఎంఓయు ల‌ ద్వారా భార‌త‌ దేశానికి, సంబంధిత దేశాల‌కు మ‌ధ్య‌ ఈ రంగానికి సంబంధించిన స‌మాచారం ఇచ్చిపుచ్చుకోవ‌డం జ‌రుగుతుంది. భ‌ద్ర‌త‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల్ని గుర్తుపట్ట‌డంలో, వాటిని ప‌రిష్క‌రించ‌డంలో ఆయా దేశాల మ‌ధ్య‌ స‌హ‌కారం కొన‌సాగుతుంది.