Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇండొనేశియా లోని అసెహ్ ప్రాంతంలో భూకంపం కారణంగా ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల సంతాపం వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇండొనేశియా లోని అసెహ్ ప్రాంతంలో భూకంపం కారణంగా ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

“ఈ రోజు విరుచుకుపడిన విపత్తుకు బాధితులైన ప్రజల శోకంలో మేము పాలుపంచుకొంటున్నాము. వారు తేరుకోవాలని ప్రార్థిస్తున్నాము. అవసరమైన ఏ సాయాన్నైనా అందించేందుకు భారతదేశం సిద్ధంగా ఉంది” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

***