Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇంధ‌నంపై భార‌త్‌, బెల్జియం ఒప్పందానికి ఆమోదముద్ర‌


ఇంధ‌న రంగంలో స‌హ‌కారానికి ఉద్దేశించి భార‌త్‌, బెల్జియంల మ‌ధ్య కుదిరిన ఒప్పందం (ఎంఓయూ)కు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ సార‌థ్యంలో స‌మావేశ‌మైన కేంద్ర కేబినెట్ ఆమోద‌ముద్ర వేసింది. ఇంధ‌నం కోసం భార‌త్, బెల్జియం మధ్య స‌మాఖ్య‌, ప్రాంతీయ‌స్థాయిలో ఇప్ప‌టికే ఒప్పందం కుదిరింది.

ఇరు దేశాల మ‌ధ్య ఇంధ‌న‌రంగంలో వ్య‌వ‌స్థీకృత‌మైన స‌హ‌కార బంధం ఏర్ప‌డ‌టం ఈ ఒప్పందం ముఖ్యోద్దేశం. నూత‌న‌, సంప్ర‌దాయేత‌ర ఇంధ‌నాంశాల్లో ఇరువురికీ స‌మ‌స్థితిలో, ప్ర‌యోజ‌నం క‌లిగేలా సాంకేతిక ద్వైపాక్షిక స‌హ‌కారాన్ని ప్రోత్స‌హించ‌టం ఇందులో భాగం. ప‌వ‌న ఇంధ‌నం, బ‌యోమాస్‌, సౌర ఇంధ‌నం, స్మార్ట్ గ్రిడ్లు, జియోథ‌ర్మ‌ల్ ఇంధ‌నం, స‌ముద్ర ఇంధ‌నం, త‌దిత‌ర ప‌ర‌స్ప‌రామోద‌మైన‌ అంశాల్లో కొత్త‌, సంప్ర‌దాయేత‌ర ఇంధ‌న సాంకేతిక‌ను అభివృద్ధి చేయ‌టంపై ఎక్కువ దృష్టిసారిస్తారు. రెండు దేశాల మ‌ధ్య ద్వైపాక్షిక సంబంధాల‌ను మ‌రింత ప‌టిష్ఠం చేయ‌టంలో కూడా ఈ ఒప్పందం ఉప‌యోగ‌ప‌డుతుంది.