Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇజ్రాయల్ కు చేరుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ;  బెన్ గ్యూరియన్ విమానాశ్రయం వద్ద సాదర స్వాగతం

ఇజ్రాయల్ కు చేరుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ;  బెన్ గ్యూరియన్ విమానాశ్రయం వద్ద సాదర స్వాగతం

ఇజ్రాయల్ కు చేరుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ;  బెన్ గ్యూరియన్ విమానాశ్రయం వద్ద సాదర స్వాగతం

ఇజ్రాయల్ కు చేరుకొన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ;  బెన్ గ్యూరియన్ విమానాశ్రయం వద్ద సాదర స్వాగతం


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తెల్ అవీవ్ లోని బెన్ గ్యూరియన్ విమానాశ్రయానికి చేరుకొన్నారు.

 ఒక విస్తృత‌మైన‌ ఆధికారిక స్వాగత కార్యక్రమంలో భాగంగా, ప్రధాన మంత్రి శ్రీ మోదీ రాగానే ఇజ్రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ ఆయనకు స్వాగతం పలికారు.  ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గౌరవ వందనాన్ని ప్రధాన మంత్రి శ్రీ మోదీ పరిశీలించారు.

 ప్రధాని శ్రీ నెతన్యాహూ తన పత్రికా ప్రకటనను  ‘‘आपका स्वागत है मेरे दोस्त’’ (నా స్నేహితుడా, మీకు స్వాగతం) అంటూ హిందీ పదాలతో మొదలుపెట్టారు.  ప్రధాన మంత్రికి బాహువులు విస్తరించి సాదరంగా స్వాగతం పలుకుతున్నానని, ఇరు దేశాలకు మధ్య సహకారానికి ఆకాశం కూడా హద్దు కాజాలదు అంటూ శ్రీ నెతన్యాహూ ఈ సందర్భంగా స్పష్టంచేశారు.  ప్రధాన మంత్రిని ఆయన ఒక గొప్ప నేత గాను, ‘‘ప్రపంచ నాయకుడు’’గా కూడాను అభివర్ణించారు.

 ఈ సందర్భంగా ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని హీబ్రూ అభివాదం ‘‘Shalom le’kulam’’ తో మొదలుపెట్టారు.  ఇక్కడ ఇజ్రాయల్ కు విచ్చేసినందుకు నేను సంతోషిస్తున్నాను’’ అని అర్థం వచ్చే హీబ్రూ పదాలను కూడా శ్రీ మోదీ ఉచ్చరించారు.

 సరిగ్గా 41 సంవత్సరాల క్రితం జులై 4వ తేదీ నాడు ఎంటిబ్బీ లో ఇజ్రాయల్ చర్యను ఆయన గుర్తు చేసుకొన్నారు.  అప్పట్లో, ప్రధాని శ్రీ నెతన్యాహూ అగ్రజుడు ఎంతో మంది ఇజ్రాయలీ బందీలను కాపాడుతూ, ఆ క్రమంలో తన ప్రాణాలను త్యాగం చేశారు.

 నిలకడగా అధిక వృద్ధిని, సర్వతోముఖ అభివృద్ధిని సాధించాలన్న మన బాటలో, ఇజ్రాయల్ ను భారతదేశం తన ముఖ్యమైన భాగస్వాములలో ఒక భాగస్వామ్య దేశంగా పరిగణిస్తుందని ప్రధాన మంత్రి అన్నారు.

 కలిసి ఆర్థిక సమృద్ధిని సాధించడం కోసం ఒక భాగస్వామ్యాన్ని నిర్మించుకోవడంతో పాటు, ఉగ్రవాదం వంటి ఉమ్మడి బెదరింపుల బారి నుండి మన సమాజాలను కాపాడుకోవడంలో సైతం మనం ఒకరికి మరొకరం సహకరించుకొంటున్నామని కూడా ఆయన పేర్కొన్నారు. 

 ఇజ్రాయల్ లో ప్రవాసీ భారతీయులతో భేటీ అవ్వాలన్న ఆసక్తిని ఆయన వ్యక్తం చేస్తూ, భారతీయ సంతతికి చెందిన యూదులు మన ఉభయ సమాజాలను  సుసంపన్నం చేశారన్నారు.

 

***