Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇజ్రాయెల్ పర్యటనకు ముందు ప్రధానమంత్రి ప్రకటన

ఇజ్రాయెల్ పర్యటనకు ముందు ప్రధానమంత్రి ప్రకటన


నా మిత్రుడుఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహూ ఆహ్వానం మేరకు ఆ దేశంలో 2026 ఫిబ్రవరి 25, 26 తేదీల్లో అధికారికంగా పర్యటిస్తాను.

భారత్ఇజ్రాయెల్ దేశాల బహుముఖ వ్యూహాత్మక భాగస్వామ్యం ఇటీవలి సంవత్సరాల్లో గణనీయమైన వృద్ధిని సాధించిందిసైన్స్ అండ్ టెక్నాలజీరక్షణభద్రతవాణిజ్యంపెట్టుబడులుప్రజా సంబంధాలు సహా వివిధ రంగాల్లో మన సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రధానమంత్రి నెతన్యాహూతో చర్చలు చేపట్టేందుకు ఎదురుచూస్తున్నానుపరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయఅంతర్జాతీయ అంశాలపై మాఆలోచనలను పంచుకుంటాం.

పర్యటనలో ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌‌తో సమావేశమవుతానుఇజ్రాయెలీ పార్లమెంట్ క్నెస్సెట్‌ను ఉద్దేశించి ప్రసంగించనున్న తొలి భారత ప్రధానమంత్రిగా గౌరవం పొందబోతున్నానుఇది మన రెండు దేశాల మధ్య ఉన్న బలమైన పార్లమెంటరీప్రజాస్వామ్య సంబంధాలకు ప్రశంసనీయమైన సందర్భమిది.

దీర్ఘకాలంగా భారతదేశంఇజ్రాయెల్ ప్రత్యేక స్నేహాన్ని పరిరక్షిస్తున్న ప్రవాస భారతీయులతో ముచ్చటించేందుకు నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

రెండు దేశాల మధ్య కొనసాగుతున్న బంధాలను నా అధికారిక పర్యటనను బలోపేతం చేస్తుందని నేను విశ్వాసం వ్యక్తం చేస్తున్నానుఅలాగే వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం కొత్త లక్ష్యాలను నిర్దేశిస్తుందనిస్థిరమైనవినూత్నమైనసుసంపన్నమైన భవిష్యత్తు కోసం మన ఉమ్మడి దార్శనికతను ముందుకు నడిపిస్తుందని ఆకాంక్షిస్తున్నాను.

***