సిద్ధిదాత్రి అమ్మవారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పూజలు చేశారు.
మహానవమి పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. సిద్ధిదాత్రి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.
సిద్ధిదాత్రి అమ్మవారు భక్తులందరినీ సంకల్ప సిద్ధితో ఆశీర్వదించాలని కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి తెలియజేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:
“దేశప్రజలందరికీ మహానవమి శుభాకాంక్షలు. ఈ పవిత్ర సందర్భంగా సిద్ధిదాత్రి అమ్మవారి పాదపద్మాలకు నా కోటి కోటి ప్రణామాలు! అమ్మవారు తన భక్తులందరికీ సంకల్ప సిద్ధిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.”
सभी देशवासियों को महानवमी की ढेरों शुभकामनाएं। इस पावन अवसर पर मां सिद्धिदात्री के चरणों में मेरा कोटि-कोटि प्रणाम! वे अपने सभी भक्तों को संकल्प की सिद्धि का आशीर्वाद दें, यही कामना है। https://t.co/8rWAR3rRyj
— Narendra Modi (@narendramodi) October 19, 2026