Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇటలీ ప్రధాని శ్రీ జ్యూసెపె కోంతే కు మరియు ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ కి మ‌ధ్య టెలిఫోన్ ద్వారా జరిగిన సంభాష‌ణ‌


ఇటలీ ప్రధాని శ్రీ జ్యూసెపె కోంతే తో ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ‌ న‌రేంద్ర‌ మోదీ ఈ రోజు న ఈ రోజు న టెలిఫోన్‌ లో మాట్లాడారు.

విశ్వమారి ‘కోవిడ్‌-19’ కారణం గా ఇటలీ లో సంభవించిన ప్రాణ నష్టం పట్ల ప్ర‌ధాన‌ మంత్రి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. సంక్షోభ కాలం లో ఇటలీ పౌరులు ప్రదర్శించిన నైతిక ధైర్యాన్ని ప్ర‌ధాన‌ మంత్రి కొనియాడారు.

ప్రపంచవ్యాప్త వ్యాధి ఆర్థిక రంగం పైన మరియు ఆరోగ్య రంగం పైన ప్రసరింపచేస్తున్న ప్రభావాన్ని సమర్థం గా ఎదుర్కోవ‌డానికి ఇద్దరు నేత లు వారి దేశాల లో అవసరపడే చర్యల ను గురించి మరియు ప్రపంచ స్థాయి లో అవసరపడే చర్యల ను గురించి చర్చించారు. ఒక పక్షాని కి మరొక పక్షం పరస్పరం సంఘీభావాన్ని వ్యక్తపరచుకోవడం తో పాటు ఇరు దేశాల లో చిక్కుబడ్డ తమ దేశవాసుల పట్ల రెండు దేశాలు అన్యోన్య సహకారాన్ని అందజేస్తుండటం పట్ల కూడా ప్రశంస ను వ్యక్తం చేశారు.

అత్యవసర ఔషధాల ను మరియు ఇతర సరకుల ను సమకూర్చడం లో ఇటలీ కి చాలా ఉదారమైన రీతి లో సాయపడుతామంటూ శ్రీ కోంతే కు ప్ర‌ధాన‌ మంత్రి హామీ ని ఇచ్చారు.

ద్వైపాక్షిక సంబంధాల ను బల పరచుకోవడం కోసం భారతదేశాని కి మరియు ఇటలీ కి మధ్య సంప్రదింపుల ను మరియు సహకారాన్ని క్రియాత్మకం గా కొనసాగించేందుకు నేత లు అంగీకారాన్ని వ్యక్తం చేశారు.

సరిపడ్డ కాలం లో ఇటలీ ని సందర్శించవలసిందంటూ ప్రధాన మంత్రి కి ఇటలీ ప్రధాని ఈ సందర్బం లో మరో మారు ఆహ్వానం పలికారు.