Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బోధన సృజనాత్మకమనీ, దేశ నిర్మాణానికి గురువులు ముఖ్యమనీ చెబుతున్న కేంద్ర సహాయ మంత్రి వ్యాసాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి


కేంద్ర సహాయ మంత్రి శ్రీ జయంత్ చౌధరీ రాసిన వ్యాసాన్ని  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
విద్యాబోధన ఒక కళ అనీఈ వృత్తిలో ఉన్నవారికి మానవీయ సంబంధాలుబోధనశాస్త్రంవిద్యార్థుల ప్రతిభను గుర్తించే సామర్థ్యం అవసరమంటూ కేంద్ర సహాయ మంత్రి రాశారని ప్రధానమంత్రి అన్నారుజాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ 2020), ‘ఉల్లాస్’, ‘విద్యాంజలి’ వంటి వివిధ పథకాలు విద్యాబోధననుజ్ఞ‌ాన సంపాదనను ఎలా బలోపేతం చేస్తున్నదీ ఈ వ్యాసం చెబుతోందనీఅలాగే దేశ నిర్మాణానికి ప్రతి గురువూ తోడ్పాటును అందిస్తున్న విషయాన్ని గుర్తిస్తోందనీ  ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి ప్రస్తావిస్తూఇలా పేర్కొన్నారు:
‘‘
బోధన ఒక కళఅది ఒక సృజనాత్మకతతో కూడుకున్నది.. మానవీయ సంబంధాలుబోధన శాస్త్రంవిద్యార్థుల్లో దాగి ఉన్న శక్తియుక్తులను పసిగట్టే సామర్థ్యం గురువులకు అవసరమని కేంద్ర సహాయ మంత్రి శ్రీ జయంత్ చౌధరీ అంటున్నారు.
దేశ నిర్మాణానికి ప్రతి గురువూ తోడ్పాటును అందిస్తున్నట్లు పేర్కొంటూజాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020, ‘ఉల్లాస్’, ‘విద్యాంజలి’ వంటి వివిధ పథకాలు విద్యాబోధననుజ్ఞ‌ాన సంపాదనను ఎలా బలోపేతం చేస్తున్నదీ వివరించారు’’.

 

***