Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇది మహిళల కు, పురుషుల కు సంబంధించినటువంటి న్యాయం యొక్క విజ‌యం, అంతే కాదు స‌మాజం లో స‌మాన‌త్వాన్ని పెంపొందింప చేస్తుంది: ట్రిపుల్ త‌లాక్ బిల్లు ఆమోదం పొంద‌డం పై ప్ర‌ధాన మంత్రి స్పందన


ముస్లిమ్ మ‌హిళ‌ల (వివాహానంతర హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ‌) బిల్లు, 2019 కి పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌ల లో ఆమోదం ల‌భించ‌డం కోసం మ‌ద్ద‌తు ను తెలిపిన అన్ని ప‌క్షాల కు మ‌రియు అందరు ఎంపి ల‌కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ధ‌న్య‌వాదాలు ప‌లికారు. వారు సంద‌ర్భాని కి త‌గిన‌ట్లు గా వ్య‌వ‌హ‌రించార‌ని, వారు వేసినటువంటి ఈ అడుగు ను భార‌త‌దేశం యొక్క చ‌రిత్ర లో ఎప్ప‌టికీ జ్ఞాపకం పెట్టుకోవ‌డం జ‌రుగుతుంద‌ని కూడా ఆయ‌న అన్నారు.

 

ట్విట‌ర్ లో వ‌రుస గా ఆయ‌న వ్రాసిన వాక్యాల లో ‘‘ఒక అతి ప్రాచీన‌మైన‌టువంటి మ‌రియు మ‌ధ్య యుగాని కి సంబంధించిన‌టువంటి ప్రయోగ పద్ధతి ని ఎట్ట‌కేల కు చ‌రిత్ర యొక్క చెత్త బుట్ట‌ కు ప‌రిమితం చేయ‌డం జరిగింది.  త‌లాక్ అంటూ మూడు సార్లు ప‌లికే ప‌ద్ధ‌తి ని పార్ల‌మెంటు ర‌ద్దు చేస్తూ, ముస్లిమ్ మ‌హిళ‌ల కు జ‌రిగిన‌ ఒక చారిత్ర‌క అన్యాయాన్ని స‌రిదిద్దింది.  ఇది ఆడ‌ వారి కి, మ‌గ వారి కి సంబంధించిన న్యాయాని కి ల‌భించిన‌టేవంటి ఒక విజ‌యం.  అంతేకాదు, ఇది స‌మాజం లో స‌మాన‌త్వాన్ని పెంపొందిస్తుంది కూడాను.  భార‌త‌దేశం ఈ రోజు న సంతోషిస్తున్నది’’ అని పేర్కొన్నారు. 

 

ఆయ‌న ఈ కింది విధం గా మ‌రికొన్ని వాక్యాల ను సైతం వ్రాశారు..  ‘‘ ‘త‌లాక్’ అంటూ మూడు సార్లు ప‌లికే ప‌ద్ధ‌తి కార‌ణం గా మహా అన్యాయాల బారి న ప‌డి బాధితులైన ముస్లిమ్ మ‌హిళ‌ల ధైర్యాని కి వందనం చేయ‌వ‌ల‌సిన సంద‌ర్భం ఇది.  ‘త‌లాక్’ అంటూ మూడు సార్లు చెప్పే ప‌ద్ధ‌తి ని ర‌ద్దు చేయడం మ‌హిళ‌ల సాధికారిత కు తోడ్పాటు ను అందించడం తో పాటు మ‌న స‌మాజం లో మ‌హిళల కు దక్కవలసినటువంటి హోదా ను కూడా వారికి ప్ర‌సాదిస్తుంది.’’