పిఎంఇండియా
ఇన్ ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐ సి టి) రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకొనేందుకు భారతదేశం, కతర్ ల మధ్య కుదిరిన అవగాహనపూర్వక ఒప్పందం (ఎమ్ ఒ యు) గురించి కేంద్ర మంత్రిమండలి దృష్టికి తీసుకు వచ్చారు. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఈ ఎమ్ ఒ యు పై 2015 మార్చి నెలలో సంతకాలు జరిగాయి. ఈ ఎమ్ ఒ యు ను భారతదేశం 2016 జనవరి 1వ తేదీన, కతర్ 2016 జనవరి 12వ తేదీన ధ్రువపరచాయి.
ఈ ఎమ్ ఒ యు ద్వారా ఇరు దేశాలకు చెందిన ప్రయివేట్ ఎన్ టిటీలు, కెపాసిటీ బిల్డింగ్ ఇన్ స్టిట్యూషన్ లు, ప్రభుత్వాలు ఇంకా ఇతర ప్రభుత్వ సంస్థల మధ్య ఇన్ ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐ సి టి) రంగంలో క్రియాశీల సహకారానికి, ఆదాన ప్రదానాలకు అవకాశం లభించనుంది.
***