పిఎంఇండియా
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో సహకారానికిగాను భారతదేశానికి, పాలస్తీనా కు మధ్య కుదిరిన ఒక అవగాహనపూర్వక ఒప్పందాన్ని (ఎమ్ఒయు ను) గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం దృష్టికి తీసుకురావడమైంది. ఇ-గవర్నెన్స్, ఎమ్-గవర్నెన్స్, ఇ-పబ్లిక్ సర్వీసెస్ డెలివరీ, సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్కులు, స్టార్ట్- అప్ ల పర్యావరణ వ్యవస్థ మొదలైన ప్రాంతాల్లో సన్నిహిత సహకారాన్ని పెంపొందించుకోవడం ఈ ఎమ్ఒయు ఉద్దేశం.
రెండు పక్షాలు సంతకం చేసిన రోజు నుండి అయిదు సంవత్సరాల పాటు ఈ ఎమ్ఒయు అమలులో ఉంటుంది. రెండు పక్షాల నుండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ రంగానికి చెందిన ప్రతినిధులతో ఏర్పాటైన కార్యనిర్వాహక బృందం ఈ ఎమ్ఒయు ను అమలు చేస్తుంది. ఐ సి టి డమేన్ కు చెందిన B2B మరియు G2G.. ఈ రెండింటిలోనూ ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకోవడం జరుగుతుంది. B2B సహకారాన్ని పెంపొందించుకోవడం ఉపాధి అవకాశాలకు దారితీస్తుందని ఊహిస్తున్నారు.
పూర్వరంగం
పాలస్తీనా సమస్యల పట్ల భారతదేశం అంతర్జాతీయ, ద్వైపాక్షిక స్థాయిలలో రాజకీయంగా గట్టి మద్దతిస్తోంది. వస్తు రూపంగా, సాంకేతిక పరంగా పాలస్తీనా ప్రజలకు భారతదేశం తోడ్పడుతోంది. 2016 నవంబరు లో జరిగిన జెసిఎమ్ ఒకటో సమావేశం లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో సహకారానికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. పలు సంప్రదింపుల అనంతరం ఖరారైన ముసాయిదా ఎమ్ఒయు పై 2017 మే నెల లో పాలస్తీనా నుండి అత్యంత ప్రముఖులు భారత్ కు విచ్చేసినప్పుడు సంతకాలు జరిగాయి.