Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇన్ స్ట్రుమెంటేషన్ లిమిటెడ్ కు చెందిన కోటా యూనిట్ మూసివేత కు మరియు ఆ సంస్థ యొక్క పాలక్కాడ్ యూనిట్ను కేరళ ప్రభుత్వానికి బదిలీ కి మంత్రిమండలి ఆమోదం


ఇన్ స్ట్రుమెంటేషన్ లిమిటెడ్ కు చెందిన కోటా యూనిట్ మూసివేత కు మరియు ఇన్ స్ట్రుమెంటేషన్ లిమిటెడ్ కు చెందిన పాలక్కాడ్ యూనిట్ ను కేరళ ప్రభుత్వానికి బదలాయింపునకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు.

ఈ సందర్భంగా ఇన్ స్ట్రుమెంటేషన్ లిమిటెడ్ కు చెందిన కోటా యూనిట్ ఉద్యోగులకు పెండింగ్ జీతం, చట్టబద్ధ బకాయిలు వగైరా అంశాలతో సహా 2007 నోషనల్ పే స్కేల్స్ ప్రాతిపదికన ఆకర్షణీయమైన విఆర్ఎస్/విఎస్ఎస్ ప్యాకేజిని మంత్రివర్గం ఆమోదించింది. ఈ ప్యాకేజికి సుమారు రూ.438 కోట్లు అవుతుంది.