Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇరాన్ లో సర్వోన్నత గౌరవనీయ నేత శ్రీ అయాతుల్లాహ్ ఖమేనీకి మరియు ఇరాన్ అధ్యక్షుడు శ్రీ హసన్ రూహానీ కి బహుమతులు ఇచ్చిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఇరాన్ లో సర్వోన్నత నేత శ్రీ అయాతుల్లాహ్ సయ్యిద్ అలీ హుసేనీ ఖమేనీ కి పవిత్ర కురాన్ రాత ప్రతి తాలూకు ప్రతికృతిని (ప్రత్యేకంగా పునర్ముద్రణ చేసినది) బహుమతిగా అందజేశారు. ఇది ఏడో శతాబ్దానికి చెందిన మరియు కుఫిక్ లిపిలో చేతి రాతతో ఉన్న దుర్లభమైన పుస్తకం కావడం విశేషం. అలాగే, ఈ అరుదైన రాత ప్రతి ప్రస్తుతం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధీనం లోని రామ్ పూర్ రాజా గ్రంథాలయంలో ఉండడం మరొక విశేషం.

ఇంకా ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ హసన్ రూహానీ కి ప్రత్యేకంగా పునర్ముద్రించిన శ్రీ మీర్జా అసదుల్లాహ్ ఖాన్ గాలిబ్ పర్షియన్ భాష లో రచించిన కవిత్వ సంకలన గ్రంథం ‘ కుల్లీయత్- ఎ- ఫార్సీ- ఎ- గాలిబ్ ‘ తో పాటు సుమేర్ చంద్ పర్షియన్ భాష లోకి అనువదించిన రామాయణం అధీకృత ప్రతికృతిని కూడా ప్రధాన మంత్రి బహుమతిగా ఇచ్చారు.

మొదటి సారి 1863 లో ముద్రించిన ‘ కుల్లీయత్- ఎ- ఫార్సీ- ఎ- గాలిబ్ ‘ గ్రంథంలో శ్రీ గాలిబ్ రచించిన 11,000 కు పైగా కవితలు ఉన్నాయి. ఈ పుస్తకానికి చెందిన 1867వ సంవత్సరపు దుర్లబమైన సంచికను పునర్ముద్రించడం జరిగింది. ఈ అరుదైన సంచికలో కొన్ని పుటలు కనిపించకుండా పోగా, మౌలానా అజాద్ సొంతంగా సేకరించిన, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ వారి న్యూఢిల్లీ గ్రంథాలయంలో భద్రపరచిన 1872 సంవత్సరపు సంచిక లో నుంచి సంబంధిత పుటల సారాంశాన్ని సంగ్రహించి జోడించడం ఒక విశేషం.

ఇక 1715వ సంవత్సరంలో పర్షియన్ భాష లోకి అనువాదం జరిగిన, 1826లో నకలు తీయబడిన సుమేర్ చంద్ చేతి రాతలోని రామాయణం ఫార్సీ గ్రంథం తాలూకు రాత ప్రతి ప్రస్తుతం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధీనం లోని రామ్ పూర్ రాజా గ్రంథాలయంలో లభ్యమవుతున్నది. ఇందులో 260 కి పైగా చిత్రపటాలు ఉన్నాయి. చేతితో రాయబడిన రామాయణం పుస్తకంలో ఇంత పెద్ద సంఖ్యలో చిత్రపటాలు ఉండడం అనేది బహుశా ఈ పుస్తకంలోనే చూడవచ్చునేమో.

***