Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ శ్రేణీకరణంలో భార‌త‌దేశం యొక్క చ‌రిత్రాత్మ‌క ఉన్న‌తిని స్వాగతించిన ప్ర‌ధాన మంత్రి

‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ శ్రేణీకరణంలో భార‌త‌దేశం యొక్క చ‌రిత్రాత్మ‌క ఉన్న‌తిని స్వాగతించిన ప్ర‌ధాన మంత్రి

‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ శ్రేణీకరణంలో భార‌త‌దేశం యొక్క చ‌రిత్రాత్మ‌క ఉన్న‌తిని స్వాగతించిన ప్ర‌ధాన మంత్రి


నేడు విడుదల అయిన ప్ర‌పంచ బ్యాంకు డూయింగ్ బిజినెస్ రిపోర్ట్‌, 2018 లో భార‌త‌దేశం చారిత్రక స్థాయిలో 30 స్థానాలు ఎగ‌బాకడాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు. డూయింగ్ బిజినెస్ రిపోర్ట్‌, 2017 లో 130వ స్థాయిలో ఉన్న భార‌త‌దేశం, అప్పటితో పోలిస్తే తాజా నివేదిక‌లో తన స్థాయిని 100 కు పెంచుకొంది.

ఈ శ్రేణీకరణంలో భారతదేశం సాధించిన మెరుగుద‌ల‌ చ‌రిత్రాత్మ‌క‌మని పేర్కొన్న ప్ర‌ధాన మంత్రి- త‌న ట్విట‌ర్ ఖాతాలో వ‌రుస‌గా రాసిన వ్యాఖ్యల‌లో- ఈ ఉన్నతి టీమ్ ఇండియా అమలుపరుస్తున్నటువంటి బ‌హుళ రంగ సంస్క‌ర‌ణ‌ల జోరు మ‌రియు స‌ర్వ‌తోముఖ పురోగ‌మ‌నం తాలూకు ఫ‌లిత‌మని తెలిపారు.

‘‘టీమ్ ఇండియా అనేక రంగాల‌లో అమ‌లుచేసిన సంస్క‌ర‌ణ‌ల‌తో పాటు స‌ర్వ‌తోముఖ పురోగతి యొక్క ప‌ర్య‌వ‌సాన‌మే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ శ్రేణీకరణంలో న‌మోదైన‌ చారిత్ర‌క‌ ఉన్న‌తి.

సుల‌భ‌త‌ర‌మైన వ్యాపారానుకూల‌ వాతావ‌ర‌ణం ఏర్ప‌డినందువల్ల మ‌న ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌ల‌కు- మ‌రీ ముఖ్యంగా ఎమ్ఎస్ఎమ్ఇ రంగానికి- చ‌రిత్రాత్మ‌క అవ‌కాశాల‌ు దక్కడమే కాకుండా మ‌రింత స‌మృద్ధి కూడా దక్కనుంది.

వ్యాపారాన్ని సులభతరంగా మార్చడంలో గ‌త మూడు సంవ‌త్స‌రాలుగా రాష్ట్రాల మ‌ధ్య స‌కారాత్మ‌క స్ప‌ర్ధ తాలూకు స్ఫూర్తి నెలకొనడాన్ని మ‌నం గ‌మ‌నించాం. ఇది ప్ర‌యోజ‌న‌కారిగా నిల‌చింది.

భార‌త‌దేశంలో వ్యాపారం చేయ‌డం ఇంత సుల‌భ‌త‌రంగా ఇంతక్రితం ఎన్నడూ లేదు. మ‌న దేశం అందిస్తున్న ఆర్థిక అవ‌కాశాల‌ను అన్వేషించుకోవ‌ల‌సిందిగా ప్ర‌పంచ దేశాల‌కు భార‌త‌దేశం ఆహ్వానం ప‌లుకుతోంది.

‘సంస్క‌రించు, ప‌నిచేయి & ప‌రివ‌ర్త‌న‌కు కృషి చేయి’ అనే మంత్రం యొక్క మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో మ‌న అంత‌స్తును మరింతగా మెరుగుప‌ర‌చుకోవ‌డానికీ, ఇతోధిక ఆర్థిక వృద్ధిని నమోదు చేయడానికీ మ‌నం దృఢ నిశ్చ‌యంతో ఉన్నాం’’ అంటూ ప్ర‌ధాన మంత్రి తన స్పంద‌న‌ను వ్యక్తం చేశారు.

******