పిఎంఇండియా
న్యూ ఢిల్లీలో జరిగిన ఈటీ నౌ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్-2026 విశేషాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సదస్సుకు విచ్చేసిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సదస్సు ఇతివృత్తం ‘దశాబ్ద కాలంలో జరిగిన విచ్ఛిన్నం, శతాబ్దపు మార్పు’ గురించి ప్రస్తావించారు.
21వ శతాబ్దపు గత దశాబ్దం ప్రపంచ మహమ్మారి, వివిధ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు, యుద్ధాలు, ప్రపంచ సమతుల్యతను దెబ్బతీసిన సరఫరా వ్యవస్థల వైఫల్యాల వంటివి చవిచూసిందని అన్నారు. సంక్షోభాలే ఒక దేశానికున్న అసలైన శక్తిని చాటిచెబుతాయని.. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ, భారత్ ఈ దశాబ్ద కాలంలో అద్భుతమైన అభివృద్ధిని, అత్యుత్తమ ఫలితాలను సాధించడమే కాక ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయటం గర్వంగా ఉందన్నారు. ప్రపంచ వృద్ధిని భారత్ నడిపిస్తుందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఇంజిన్‌గా అవతరిస్తుందని స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‘లో వరుస పోస్టుల్లో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు:
“ఎన్నో ఆటంకాలు ఎదురైనప్పటికీ, ఈ దశాబ్ద కాలంలో భారతదేశం ఎంతో అభివృద్ధిని సాధించింది. పటిష్ఠమైన పాలన, మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ప్రయత్నాలు ఈ కాలాన్ని ప్రత్యేకంగా నిలిపాయి“.
“21వ శతాబ్దంలోని ఈ దశాబ్ద కాలంలో భారతదేశం సంస్కరణల వేగంతో దూసుకుపోతోంది“.
“కేవలం నిధుల కేటాయింపు కోసం కాక, ఫలితాలే లక్ష్యంగా మేం బడ్జెట్‌ను రూపొందించాం“.
“దశాబ్ద కాలంగా సాంకేతికత, ఆవిష్కరణలే వృద్ధికి కీలక ఆధారమని మేం భావిస్తున్నాం“.
“నేటి భారతం ఆత్మవిశ్వాసంతో ప్రపంచంతో పోటీ పడటానికి సిద్ధంగా ఉన్నందున ప్రపంచ దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంటున్నాం“.
***
Amid numerous disruptions, this decade has been one of unprecedented development for India, marked by strong delivery and by efforts that have strengthened our democracy. pic.twitter.com/CBAhs933Gf
— PMO India (@PMOIndia) February 13, 2026
In this decade of the 21st century, India is riding the Reform Express. pic.twitter.com/6psr2ObG7C
— PMO India (@PMOIndia) February 13, 2026
We have made the Budget not only outlay-focused but also outcome-centric. pic.twitter.com/Ic8lRrRuhD
— PMO India (@PMOIndia) February 13, 2026
Over the past decade, we have regarded technology and innovation as the core drivers of growth. pic.twitter.com/OormGf11x5
— PMO India (@PMOIndia) February 13, 2026
Today, we are entering into trade deals with the world because today's India is confident and ready to compete globally. pic.twitter.com/BHrU0raO4i
— PMO India (@PMOIndia) February 13, 2026