Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రస్తావించాల్సిన అంశాలపై మీ సూచనలను పంచుకోవాలని పౌరుల్ని కోరిన ప్రధానమంత్రి


మన దేశం త్వరలో 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో, ఈ నెల 15న ఎర్రకోట నుంచి తాను ప్రసంగించేటపుడు ఏయే అంశాలను ప్రస్తావిస్తే బాగుంటుందో పౌరులంతా తమ తమ ఆలోచనలను, అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు విజ్ఞప్తి చేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ఆయన ఇలా పేర్కొన్నారు:

 ‘‘మనం ఈ సంవత్సర స్వాతంత్య్ర దినోత్సవాన్ని త్వరలో నిర్వహించుకోబోతున్నాం. ఈ నేపథ్యంలో నా తోటి భారతీయుల సూచనలను నేను తెలుసుకోవాలనుకుంటున్నా.

ఈ  ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఏయే అంశాలపై నేను మాట్లాడితే  బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు..

మీ మీ ఆలోచనలను మైగవ్ (MyGov)తో పాటు నమో యాప్ (NaMo App)లోని ఓపెన్ ఫోరాల ద్వారా నాతో పంచుకోండి…