Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కూలిన భవనం.. ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి సంతాపం


ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో భవనం కుప్పకూలిన ఘటనపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఈ కష్ట సమయంలో బాధితుల కుటుంబాలకు తన సానుభూతి తెలియజేస్తూ.. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ ఘటనలో గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున హరిహారం అందించనున్నట్లు ప్రధానమంత్రి తెలిపారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

‘‘ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో భవనం కూలిపోవడం వల్ల సంభవించిన ప్రమాదం నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఈ కష్ట సమయంలో బాధితులకు, వారి కుటుంబాలకు నా సానుభూతి  తెలియజేస్తున్నా. గాయపడినవారు వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను.

మృతుల కుటుంబాలకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ నుంచి ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున నష్ట పరిహారం ప్రకటిస్తున్నాం. గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నాం: ప్రధానమంత్రి’’