Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉత్తరప్రదేశ్.. లఖింపూర్ ఖేరీలో దుర్ఘటన… ప్రాణనష్టంపై సంతాపం తెలిపిన ప్రధానమంత్రి పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్‌గ్రేషియాను ప్రకటించిన ప్రధాని


ఉత్తరప్రదేశ్.. లఖింపూర్ ఖేరీలో దుర్ఘటన కారణంగా ప్రాణనష్టం వాటిల్లడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారాన్ని వ్యక్తం చేశారుఈ విషాద ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రధాని సంతాపాన్ని తెలిపారుగాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు.
మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల చొప్పునగాయపడ్డ వారికి రూ.50,000 వంతున ఎక్స్‌గ్రేషియా ఇస్తామని శ్రీ మోదీ ప్రకటించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ,
‘‘
ఉత్తరప్రదేశ్.. లఖింపూర్ ఖేరీలో దుర్ఘటన గురించి తెలిసి ఎంతో బాధ పడ్డానుఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపాన్ని తెలియజేస్తున్నానుగాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.

మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల చొప్పునగాయపడిన వారికి రూ.50,000 వంతున ఎక్స్‌గ్రేషియా ఇస్తారుప్రధానమంత్రి’’ అని పేర్కొన్నారు.

***