పిఎంఇండియా
ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గర్వాల్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో పలువురు మృతిచెందడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటనలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు.
మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గర్వాల్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించడం విచారకరం. ఈ దుర్ఘటనలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షలు.. గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున నష్ట పరిహారాన్ని అందజేస్తున్నాను: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ’’.
The loss of lives due to an accident in Tehri Garhwal district of Uttarakhand is saddening. I extend my condolences to those who have lost their loved ones in this mishap. May the injured recover at the earliest.
— PMO India (@PMOIndia) April 23, 2026
An ex gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next…