Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి మేజర్ జనరల్ భువన్ చంద్ర ఖండూరీ (రిటైర్డ్) మృతికి సంతాపం తెలిపిన ప్రధానమంత్రి


ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి మేజర్ జనరల్ భువన్ చంద్ర ఖండూరీ (రిటైర్డ్మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు విచారాన్ని వ్యక్తం చేశారు.
సాయుధ దళాల నుంచి రాజకీయ రంగం వరకూ– మేజర్ జనరల్ ఖండూరీ అమూల్య సేవలను అందించారనీఈ కారణంగా ఆయనను సదా స్మరించుకుంటామనీ ప్రధానమంత్రి అన్నారుముఖ్యమంత్రిగా మేజర్ జనరల్ ఖండూరీ పదవీకాలంలో ఉత్తరాఖండ్ అభివృద్ధి పట్ల అచంచల అంకితభావాన్ని కనబరిచారని శ్రీ మోదీ స్పష్టం చేశారుకేంద్ర మంత్రిగా శ్రీ ఖండూరీ పదవీకాలం కూడా సరైన అర్థంలో స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారుదేశవ్యాప్తంగా అనుసంధాన వ్యవస్థను గణనీయంగా మెరుగుపరచడానికి శ్రీ ఖండూరీ అవిశ్రాంతంగా కృషి చేశారని ప్రధాని ప్రశంసించారు.
ఈ శోక ఘడియలో దివంగత నేత కుటుంబానికీమద్దతుదారులకీ ప్రధానమంత్రి హృదయపూర్వక సంతాపాన్ని వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ 
:
‘‘
ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి మేజర్ జనరల్ భువన్ చంద్ర ఖండూరీ (రిటైర్డ్ఇక లేరని తెలిసి చాలా బాధ పడ్డానుసాయుధ దళాల మొదలు రాజకీయ రంగం వరకూ ఆయన అమూల్యమైన సేవలను అందించారుఇందుకు ఆయన్ను ఎప్పటికీ గుర్తుంచుకుంటాంఉత్తరాఖండ్ అభివృద్ధి కోసం అంకిత భావంతో పని చేశారుఇది ముఖ్యమంత్రిగా ఆయన పదవీకాలంలో స్పష్టంగా కనిపించిందికేంద్ర మంత్రిగా కూడా ఆయన పదవీకాలం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిని అందిస్తుందిదేశవ్యాప్తంగా అనుసంధానాన్ని మెరుగుపరచడానికి ఆయన నిరంతరం అలుపెరుగని ప్రయత్నాలు చేశారుఈ శోక ఘడియలో ఆయన కుటుంబానికీఆయన మద్దతుదారులకీ సంతాపాన్ని తెలియజేస్తున్నానుఓమ్ శాంతి’’ అని పేర్కొన్నారు.

 

***