Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉత్తర్ ప్రదేశ్ లోని ఝాన్సీ లో పలు అభివృద్ధి కార్యక్రమాల ను అంకితం చేసిన సందర్భం గా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

ఉత్తర్ ప్రదేశ్ లోని ఝాన్సీ లో పలు అభివృద్ధి కార్యక్రమాల ను అంకితం చేసిన సందర్భం గా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

ఉత్తర్ ప్రదేశ్ లోని ఝాన్సీ లో పలు అభివృద్ధి కార్యక్రమాల ను అంకితం చేసిన సందర్భం గా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

ఉత్తర్ ప్రదేశ్ లోని ఝాన్సీ లో పలు అభివృద్ధి కార్యక్రమాల ను అంకితం చేసిన సందర్భం గా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం


ప్రియమైన నా సోదరీమణులు మరియు సోదరులారా,

ఈ రోజు న దేశ ప్రజలందరూ అమిత దుఃఖం తో బాధపడుతూ ఆగ్రహం తో ఊగిపోతున్నారు. మీ అందరి మనోభావాల ను నేను బాగా అర్ధం చేసుకోగలను. పుల్ వామా దాడుల అనంతరం భారతదేశంలో ప్రతి ఒక్కరి లో ఆగ్రహం కట్టలు తెంచుకొంది. జాతి ని రక్షించే ప్రయత్నం లో శూరులైన మన సైనికులు ప్రాణాలను పణం గా పెట్టారు. వారి త్యాగాలు వృథా కాబోవని ఎందరో సాహసవంతులకు ఆలవాలం అయిన ఈ ఝాన్సీ గడ్డ మీద నుండి 130 కోట్ల మంది భారతీయులకు నేను హామీ ని ఇస్తున్నాను.

మన రక్షణ దళాల పరాక్రమాన్ని, వారి కృషి ని దేశ ప్రజలు గమనించారు. మన సైన్యం పరాక్రమం, సామర్థ్యాల విషయం లో ఏ ఒక్కరి కి ఎటువంటి చిన్న పాటి సందేహాలు లేవు. వారి సామర్థ్యాల పై, పరాక్రమం పై యావత్తు జాతి కి ఎంతో విశ్వాసం ఉంది.

మరి ప్రియమైన నా దేశ వాసులారా, సోదరీమణులు మరియు సోదరులారా, మీరంతా మీ యొక్క ఆశీస్సుల ను నా పైన వర్షించడానికి ఇక్కడ గుమికూడారు. ఏ సమయం లో ఏ ప్రదేశం మీద ఎలాంటి చర్య తీసుకోవచ్చు అనే అంశం పై తదుపరి కార్యాచరణ విషయం లో భద్రత దళాల కు అవసరమైన అనుమతుల ను ఇవ్వడం జరిగింది. పుల్ వామా దాడుల కు కుట్ర పన్నిన వారు, రెచ్చగొట్టిన వారి ని కచ్చితం గా శిక్షిస్తాము. కొత్త విధానాలు, సంస్కృతి ఆవిర్భవించిన భారతదేశం ఇది అన్న విషయాన్ని మన పొరుగు దేశం మరచిపోయింది. ఉగ్రవాద సంస్థలు, వారికి వెన్నుదన్ను గా నిలచిన వారు పాల్పడిన ఈ హీనమైన నేరాని కి దీటైన సమాధానాన్ని ఇచ్చి తీరుతాము.

మిత్రులారా,

మన పొరుగు దేశం ఆర్థికం గా దారుణమైన స్థితి ని ఎదుర్కొంటోంది. ఆ దేశాన్ని ప్రపంచం లోని ప్రధాన దేశాలన్నీ దూరం గా ఉంచడం తో అది ఏకాకి అయింది. రోజువారీ ఖర్చుల ను కూడా నిర్వహించుకోలేని దుర్భర స్థితి లో ఉంది. జోలి పట్టి అడుక్కున్నా కూడా ప్రపంచం నుండి వారికి సహాయం తేలిక గా అందడం లేదు. ఇటువంటి పరిస్థితుల లో దాడులు చేసినట్టయితే భారతదేశం కూడా అలాంటి దు:స్థితి లోకి పోతుందన్న ఆలోచన తో వాటి ని ప్రేరేపించింది. వారు ఎంచుకున్న మార్గం వారి కి వినాశాన్ని కొని తెస్తే మనం నడుస్తున్నమార్గం వృద్ధి ని రెండింతలు చేసింది. ఈ రోజు న యావత్తు ప్రపంచం దాని ని చూస్తోంది.

సోదరీమణులు మరియు సోదరులారా,

130 కోట్ల మంది భారతీయులు ఆ దేశాని కి తగిన రీతి లో జవాబు ను చెప్పి తీరుతారు.

మిత్రులారా,

ఈ రోజు న ప్రపంచం లోని ప్రధాన దేశాలన్నీ భారతదేశాని కి అండ గా నిలచాయి. భారతదేశం మనోభావాలు వారికి తెలుసు. నాకు అందిన సమాచారం ప్రకారం ఆ దేశాలు కూడా మన తో సమం గానే దుఃఖాన్ని, ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఉగ్రవాదాని కి అంతం పలకడాని కి ప్రపంచ సమాజం యావత్తు సానుకూలం గా ఉంది.

మిత్రులారా,

శత్రువులు పన్నిన కుట్రల ను ఎలా తిప్పికొట్టాలి, ఎలా పోరాడాలి అన్నది సాహసోపేతులైన పుత్రులు, పుత్రికలు గల ఈ భూమి కి తెలుసును. భారత మాత, ఆమె సంతానాన్ని ఏ విధం గా రక్షించుకోవాలన్న చర్యల కు సజీవ సాక్షి ఈ భూమి.

మిత్రులారా,

ఝాన్సీ రాణి వలెనే స్వాతంత్ర్య పోరాటాని కి కొత్త స్ఫూర్తి, కొత్త శక్తి అందించిన మణికర్ణిక సాహసాన్ని కనులారా తిలకించిన గడ్డ ఇది. మణికర్ణిక కాశీ పుత్రిక. నన్ను తమ పార్లమెంటు సభ్యుని గా కాశీ ప్రజలు ఎన్నుకోవడం నా అదృష్టం. ఆ రకం గా ఆమె జన్మస్థలి, నా కార్యస్థలి రెండింటికీ బుందేల్ ఖండ్ తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ బుందేల్ ఖండ్ భూమి జాతి పట్ల అంకిత భావాన్ని మరింత కొత్త ఎత్తుల కు తీసుకు పోతుంది. గతం లో నేను ఇక్కడ కు వచ్చినప్పుడు మీ ప్రేమ ను వడ్డీ తో సహా తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చిన విషయం నాకు స్పష్టం గా గుర్తు ఉంది. మీకు కూడా ఆ విషయం గుర్తుందా? నేను హామీల ను నిలబెట్టుకునే మనిషి ని. మేము ఒక ఉద్యమ స్ఫూర్తి తో రంగం లోకి దిగాము, దాని ని సాధించిన తరువాత మాత్రమే ఆగుతాము.

గత నాలుగున్నర సంవత్సరాలు గా కేంద్ర ప్రభుత్వం ఈ కృషి లో నిరంతరాయం గా శ్రమిస్తోంది. ఇక్కడ కూడా యోగి గారి నాయకత్వం లో బిజెపి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఆయన జట్టు మొత్తం కలిసికట్టు గా ఈ రాష్ట్రాభివృద్ధి ని పరుగులు తీయిస్తోంది.

మిత్రులారా,

బిజెపి ప్రభుత్వం పిల్లల కు విద్య, యువత కు ఆదాయం, వయోవృద్ధుల కు ఔషధాలు, రైతుల కు నీటి సదుపాయం, ప్రజల ఫిర్యాదుల పరిష్కారం అనే ఐదు సూత్రాల తో పని చేస్తోంది. ఆ లక్ష్యం దిశ గా ముందుకు కదులుతూనే మేం బుందేల్ ఖండ్ కు, ఉత్తర్ ప్రదేశ్ కు సుమారుగా 20 వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేశాము. వాటి లో భద్రత, ఉపాధి, రైల్వే, విద్యుత్తు, నీటి సదుపాయం సహా ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి.

సోదరీమణులు మరియు సోదరులారా,

ఇప్పుడు బుందేల్ ఖండ్ ను భారతదేశాని కే భద్రత, అభివృద్ధి కారిడార్ గా తీర్చి దిద్దే కార్యక్రమం మొదలయింది. ఝాన్సీ నుండి ఆగ్రా వరకు ఏర్పాటయ్యే ఈ భద్రత కారిడార్ దేశాన్ని సాధికారం చేయడం తో పాటు బుందేల్ ఖండ్, ఉత్తర ప్రదేశ్ యువత కు ఎన్నో సరికొత్త ఉపాధి అవకాశాల ను అందుబాటు లోకి తెస్తుంది. దేశాని కి, ప్రపంచాని కి చెందిన ఎందరో ఇన్వెస్టర్లు ఇక్కడ పెట్టుబడులు పెట్టడాని కి ఆసక్తి గా ఉన్నారు.

నాలుగు వేల కోట్ల రూపాయల విలువ గల ప్రాజెక్టుల పై ఒప్పందాలు కూడా కుదిరినట్టు నా దృష్టి కి వచ్చింది. రక్షణ, భద్రత పరికరాల తయారీ లోని దేశ విదేశీ కంపెనీ లు ఇక్కడ తమ ఉత్పత్తి కేంద్రాల ను కూడా ఏర్పాటు చేయనున్నాయి.

సోదరీమణులు మరియు సోదరులారా,

పెద్ద పరిశ్రమలు మొదలైతే వాటికి అనుబంధం గా చిన్న పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందుతాయి. సంపూర్ణమైన పారిశ్రామిక వాతావరణం నెలకొంటుంది. ఝాన్సీ, చుట్టుపక్కల ప్రాంతాల లో పని చేస్తున్న చిన్న, మధ్యతరహా పరిశ్రమల కు ఈ కారిడార్ ఎంతో ప్రయోజనకరం గా ఉంటుంది. లక్షల మంది యువత కు ప్రత్యక్ష ఉపాధి ని కల్పిస్తుంది. అలాగే ఈ ప్రాంత యువత కు నైపుణ్యాల అభివృద్ధి ని కూడా అందిస్తుంది. ఈ ప్రాంతం లో ఏర్పాటయ్యే కంపెనీ లు నైపుణ్యాల అభివృద్ధి కి హామీ ని ఇవ్వడం తో పాటు ఇక్కడి యువత కు వారి గ్రామాల పరిధిలో ఉపాధి కల్పించడం వల్ల వారు మరో చోటు కు తరలిపోవలసిన అవసరం ఉండదు.

నేను గుజరాత్ వాసి ని. బుందేల్ ఖండ్ లోని ప్రతి ఒక్క బ్లాకు కు చెందిన ప్రజలు గుజరాత్ లో ఉన్నారు. వారందరినీ నేను బాగా ఎరుగుదును. బుందేల్ ఖండ్ ఎన్నటికీ పారిశ్రామికాభివృద్ధి కేంద్రం కాబోదని భావించిన వారందరికీ నా అనుభవాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. పాకిస్తాన్ సరిహద్దు కు దగ్గర లోని గుజరాత్ లో కచ్ఛ్ పేరిట ఎడారి వంటి జిల్లా ఒకటుంది. అది చాలా పెద్ద జిల్లా. ఏ ఒక్క అధికారి అక్కడ కు వెళ్లి పని చేయాలని గాని, అక్కడే నివాసం ఏర్పాటు చేసుకోవాలని గాని అనుకోరు. జనాభా అంతా ప్రతికూల వృద్ధి లో కొట్టుమిట్టాడుతోంది. జనాభా పెరగడానికి బదులు క్షీణిస్తోంది. అక్కడ నీరు గాని, జీవనోపాధి అవకాశం గాని లేకపోవడమే ఇందుకు కారణం.

కానీ, 2001 భూకంపం అనంతరం గుజరాత్ ముఖ్యమంత్రి గా అక్కడ పనులన్నీ చేపట్టడం నా బాధ్యత. ఈ రోజు న అంత తక్కువ కాలంలో కచ్ఛ్ జిల్లా ఎడారి అయినా, నీరు లేకపోయినా, ఆ ప్రాంత పుత్రికల ను వివాహం చేసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోయినా, అన్నింటినీ తట్టుకొని పురోగమిస్తూ దేశం లో త్వరిత గతి న అభివృద్ధి చెందుతున్న జిల్లాల లో ఒకటి గా నిలచింది. కచ్ఛ్ అభివృద్ధి ని నా కళ్ల తో నేను చూశాను. బుందేల్ ఖండ్ కూడా అలాగే అభివృద్ధి చెందడాన్ని ఈ కళ్ల తో నేను చూడగలను.

కచ్ఛ్ అసాధ్యాన్ని సాధించగలిగినప్పుడు బుందేల్ ఖండ్ కూడా సాధించ గలుగుతుందన్నది నా విశ్వాసం. ఎంతో కాలం నుండి నిరాశ ఆవరించిన ఈ భూమి ని ఆ భావం నుండి వెలుపల కు లాగి పెను మార్పు ను తెచ్చే దిశ గా మేం పని చేస్తున్నాము.

మిత్రులారా,

ఇక్కడ గల మరో సవాలు గురించి కూడా నేను మాట్లాడాలనుకుంటున్నాను. అదే నీటి సరఫరా సవాలు. మీరందరూ నీటి కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుసు. యోగీ ఆదిత్య నాథ్ ప్రభుత్వానికి కూడా అది తెలుసు. ఆ నీటి సంబంధిత కష్టాలన్నింటి నుంచి మిమ్మల్ని కాపాడడం కోసం ఈ రోజున 9 వేల కోట్ల రూపాయల విలువైన పైప్ లైన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్నాం.

బుందేల్ ఖండ్ కు చెందిన మాతలు, సోదరీమణులందరి దీవనెల ను కోరుకొంటున్నాము. అప్పుడు ఈ ప్రాజెక్టు ను వీలైనంత త్వరలో పూర్తి చేసి మేం నీటి ని సరఫరా చేయగలుగుతాము. ఇక్కడి తల్లులు, సోదరీమణులు అందరూ నీటి సంబంధిత కష్టాల్లోనే అల్లాడిపోతూ శక్తి అంతటినీ నీటి కోసం వెచ్చిస్తున్నారు. మీ అందరి అప్పులు తీర్చివేసేందుకు నేను ఇక్కడ కు వచ్చాను. మిమ్మల్ని కష్టం నుండి గట్టెక్కించడానికి నేను వచ్చాను. ఈ గొట్టపుమార్గం ద్వారా మీకు నీటిని అందించాలంటే మమ్మల్ని ఆశీర్వదించండి. ఇది కేవలం గొట్టపుమార్గం కాదు, జీవన రేఖ అని నేను భావిస్తున్నాను.

సోదరీమణులు మరియు సోదరులారా,

ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యే నాటి కి ఈ గొట్టపుమార్గం ద్వారా బుందేల్ ఖండ్ ప్రాంతం లోని ఝాన్సీ, లలిత్ పుర్, జలాన్, హమీర్ పూర్, మహోబా, బాందా, చిత్రకూట్ అన్నింటికీ మంచినీరు అందుతుంది. అలాగే ఝాన్సీ నగరం, చుట్టుపక్కల గ్రామాల కోసం అమృత్ యోజన లో భాగం గా 600 కోట్ల రూపాయల తో కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టులు రూపొందించింది. బెత్వా నది నీటి తో ఝాన్సీ నగర ప్రజల దాహార్తి తీరుతుంది. దానితో పాటు సమీప గ్రామాల కు కూడా మంచినీరు అందుతుంది.

సోదరీమణులు మరియు సోదరులారా,

ఈ ప్రాజెక్టులన్నీ వర్తమాన అవసరాలనే కాకుండా భవిష్యత్తు తరాల అవసరాల ను కూడా తీర్చగలుగుతాయి.

సోదరీమణులు మరియు సోదరులారా,

పహాడీ ఆనకట్ట ఆధునికీకరణ ప్రాజెక్టు తో రైతులు ఎంతగానో లాభపడుతారు. గతం లో ఎన్నో లీకేజి ల కారణంగా ఈ ఆనకట్ట నుండి తగినంత నీరు వ్యవసాయ భూములకు అందలేదు. ఇప్పుడు ఆ లీకేజిలన్నింటినీ పూడ్చడం జరిగింది. దీనికి తోడు బిజెపి ప్రభుత్వం “ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి” పేరిట ఒక చారిత్రక పథకం తీసుకువచ్చింది. ఈ పథకం కింద ఐదెకరాలు, అంతకన్నా తక్కువ భూమి గల రైతులందరికీ కేంద్రప్రభుత్వం ఏడాదికి రూ.6000 వారి బ్యాంకు ఖాతాలకే జమ చేస్తుంది. ఈ సొమ్ము ఒక్కోటి రూ.2000 వంతున మూడు వాయిదాల్లో మీకు చేరుతుంది. ప్రభుత్వ అంచనా ప్రకారం యుపిలోని 2.25 లక్షల మంది రైతుల్లో 2.14 లక్షల మంది లాభం పొందుతారు. అంటే 95 శాతం మంది కి పైగా రైతుల కు ఈ పథకం ప్రయోజనం చేకూర్చుతుంది.

మిత్రులారా,

పిఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద వచ్చే 10 సంవత్సరాల కాలం లో 7.5 లక్షల కోట్ల రూపాయలు నేరు గా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. ఏడున్నర లక్షల కోట్ల రూపాయలంటే తక్కువేమీ కాదు. అది కూడా మధ్యదళారీల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకే వెళ్లడం వల్ల మీ హక్కుల ను ఎవరూ లాగివేసుకోలేరు.

మిత్రులారా,

గత నాలుగున్నర సంవత్సరాలు గా పేదల, రైతుల బ్యాంకు ఖాతా లు వేగం గా పెరిగాయి. ఈ విషయం లో మాకు ప్రభావశీలమైన దృక్పథం ఉంది. మీకు బ్యాంకు ఖాతాలు తెరచేందుకు మా ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం వల్ల గ్యాస్ సబ్సిడీ, ఎంజిఎన్ఆర్ఇజిఎ వేతనాలు, పెన్షన్ లు, విద్యార్థుల ఉపకార వేతనాలు అనేవి ప్రభుత్వ ట్రెజరీ ల ద్వారా బట్వాడా కావడాని కి బదులు నేరు గా లబ్ధిదారుల ఖాతాల కు జమ అవుతున్నాయి. అలా లీకేజిల కు అడ్డుకట్ట పడింది. బ్యాంకు ఖాతాల లో నేరు గా డబ్బు జమ కావడం ప్రారంభమైన తరువాత 1 లక్ష కోట్ల రూపాయల వరకు ఆదా అయిందన్న విషయం మీకు తెలుసు. గతం లో ఈ సొమ్ము ఎవరి జేబుల్లోకో చేరిపోయేది. ఇప్పుడు మిమ్మల్ని దోచుకొనే మధ్యదళారులకు, మీకు మధ్య పెద్ద అడ్డుగోడ గా మోదీ ఉన్నాడు.

సోదరీమణులు మరియు సోదరులారా,

రైతుల తో పాటు పశు పెంపకందారులు, మత్స్యకారుల విషయం లో కూడా మా ప్రభుత్వం ప్రధాన నిర్ణయాల ను తీసుకొంది. బుందేల్ ఖండ్ ప్రజల కు ఇది మరింత ప్రధానం. ఇప్పుడు పశు పెంపకందారులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రుణం అందుతోంది. తద్వారా వారు వ్యాపారాల ను విస్తరించుకో గలుగుతున్నారు. పశువుల పెంపకందారుల ను, మత్స్యకారుల ను మేం రుణాల, వడ్డీల ఊబి నుండి బయటకు తీసుకువచ్చాము. వారు వడ్డీ వ్యాపారుల కు అప్పులు చెల్లించే పరిస్థితి ని తప్పించాము.

అలాగే రైతుల ప్రయోజనం కోసం మరో నిర్ణయాన్ని కూడా తీసుకొన్నాము. గతం లో రైతులు లక్ష రూపాయల వరకు మాత్రమే ఎటువంటి హామీ లేకుండా రుణాన్ని పొందగలిగే వారు. నేటి అవసరాలను గమనించి ఇప్పుడు ఆ సొమ్ము ను 1.6 లక్షల రూపాయల కు పెంచాము. తద్వారా రైతులు ఆధునిక వ్యవసాయం, శాస్త్రీయ వ్యవసాయం చేయగలుగుతున్నారు. అంటే ఇక నుండి రైతులు అప్పుల కోసం షావుకార్ల దగ్గర కు పోకుండా 1.6 లక్షల రూపాయల వరకు ఎటువంటి హామీ లేని రుణాన్ని బ్యాంకు నుండి పొందగలుగుతున్నారు.

అలాగే పశు గణాన్ని దృష్టి లో పెట్టుకొని ప్రభుత్వం కామధేను ఆయోగ్ ను ప్రారంభించింది. ఈ కమిశన్ కింద గో సంరక్షణ, పరిరక్షణ, అభివృద్ధి కి; వాటి తరాల ను కాపాడడాని కి, అందుకు సంబంధించిన చట్టాలన్నింటి ని సమర్థవంతం గా అమలుపరచడాని కి 500 కోట్ల రూపాయల ను కేటాయించింది. పశువుల కు దాణా కొరత, పశువుల అక్రమ రవాణా అధికంగా ఉన్న బుందేల్ ఖండ్ కు కామధేను ఆయోగ్ ఎంతో ప్రయోజనకరమైంది.

ఈ సవాలు తో పాటు ట్రాన్స్ మిషన్ వ్యవస్థ మెరుగుపరచడం వల్ల విద్యుత్తు సమస్య ను అధిగమించగలిగారు. ఇప్పుడు బుందేల్ ఖండ్ సహా పశ్చిమ ఉత్తరప్రదేశ్ లోని పలు ప్రాంతాల లో విద్యుత్తు సరఫరా మెరుగుపడింది. ఇప్పుడు పశ్చిమ, ఉత్తర గ్రిడ్ ఉత్పత్తి చేసే విద్యుత్తు వల్ల భిన్న ప్రాంతాల కు విద్యుత్తు ప్రసారం తేలిగ్గా చేరుతుంది.

మిత్రులారా,

ఈ ప్రాంతంలో రైల్వే కనెక్టివిటీ కి, బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే కు మా ప్రభుత్వం ఎప్పుడూ ప్రాధాన్యాన్ని ఇస్తోంది. మాణిక్ పుర్, ఝాన్సీ లోని ఖైరార్- భీమ్ సేన్ సెక్షన్ లైన్ డబ్లింగ్, ఝాన్సీ- ఖైరార్, భీమ్ సేన్ సెక్షన్ విద్యుదీకరణ ల వల్ల ప్రజలు ఎంతో ప్రయోజనాన్ని పొందుతారు.

సోదరీమణులు మరియు సోదరులారా,

రైతులు కావచ్చు, సైనిక సిబ్బంది, యువతీ యువకులు.. ఎవరైనా కావచ్చు, సబ్ కా సాత్, సబ్ కా వికాస్ మంత్రమే మా జపం. ఇందులో ఎవరి పట్ల ఎటువంటి వివక్ష కు తావు ఉండదు. నాలుగున్నర సంవత్సరాల క్రితం మీరు బలమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ద్వారానే ఇది సాధ్యపడింది. దేశాని కి 30 సంవత్సరాల తరువాత తొలి సారి గా సంపూర్ణ సంఖ్యాధిక్యం తో సుస్థిరమైన, బలమైన, నిర్ణయాత్మకమైనటువంటి ప్రభుత్వాన్ని అందించడం లో ఉత్తర్ ప్రదేశ్ ప్రజలు కీలకం గా నిలవడం వల్ల జాతి యావత్తు ఉత్తర్ ప్రదేశ్ పట్ల ఎంతో కృతజ్ఞత తో ఉంటుంది. ఉత్తర్ ప్రదేశ్ వోటర్లు ప్రకటించిన నిర్ణయం బలం అది. 2014వ సంవత్సరం లో ఉత్తర్ ప్రదేశ్ ప్రజలు 30 సంవత్సరాలు గా అంధకారం, నిరాశ లు అలముకున్న భారత జాతి కి ఒక కొత్త ఆశ ను తీసుకు వచ్చారు. బలమైన ప్రభుత్వం ప్రతి ఒక్క పౌరుని కి ప్రయోజనాన్ని అందిస్తుంది. బలమైన ప్రభుత్వం జాతి గౌరవాన్ని ఎలా పెంచగలుగుతుందన్నది ఉత్తర్ ప్రదేశ్ ప్రజలు ప్రపంచానికి చూపించారు. దాని వల్ల యావత్తు జాతి లాభపడింది. భవిష్యత్తు అభివృద్ధి, న్యూ ఇండియా ఆవిష్కారం కోసం మీరు నన్ను మరింత గా ఆశీర్వదిస్తారని నేను నమ్ముతున్నాను.

సోదరీమణులు మరియు సోదరులారా,

ఇక్కడ చేపడుతున్న ఉపాధి ఆధారిత అభివృద్ధి ప్రాజెక్టుల పట్ల మరో సారి మీ అందరి కి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ప్రభుత్వ శాఖలు తమ చేతి లోని ప్రతి ఒక్కపని ని చిత్తశుద్ధి తో చేసేలా చేసినందుకు ఉమా జీ ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. పార్లమెంటు సభ్యురాలు గా జాతి పట్ల తన కు గల బాధ్యత ను పూర్తి చేసినందుకు ఉమా జీ కి హృదయపూర్వక ధన్యవాదాలు.

నాతో కలిసి బిగ్గరగా పలకండి.

భారత్ మాతా కి జయ్

భారత్ మాతా కి జయ్

భారత్ మాతా కి జయ్.

ధన్యవాదాలు.