Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉత్తర ప్రదేశ్ లో ఈ రోజు పదవీప్రమాణం స్వీకరించిన నూతన ప్రభుత్వానికి అభినందనలు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

ఉత్తర ప్రదేశ్ లో ఈ రోజు పదవీప్రమాణం స్వీకరించిన నూతన ప్రభుత్వానికి అభినందనలు తెలిపిన ప్ర‌ధాన మంత్రి


ఉత్తర ప్రదేశ్ లో నూతన ప్రభుత్వాన్ని ఏర్పరచడం కోసం ఈ రోజు ప్రమాణం స్వీకరించిన శ్రీ యోగి ఆదిత్యనాథ్ కు, శ్రీ కేశవ్ ప్రసాద్ మౌర్య కు, శ్రీ దినేశ్ శర్మ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. కొత్త సర్కారు పట్ల ప్రధాన మంత్రి గొప్ప విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ, నవీన బృందం ఆధ్వర్యంలో ఉత్తర ప్రదేశ్ అభివృద్ధిలో సరికొత్త ప్రమాణాన్ని నెలకొల్పగలదని; ఎప్పుడైతే ఉత్తర ప్రదేశ్ ఉన్నతి చెందుతుందో, భారతదేశం కూడా పురోగమిస్తుందని పేర్కొన్నారు.

“యోగి ఆదిత్యనాథ్ గారికి, కేశవ్ ప్రసాద్ మౌర్య గారికి, దినేశ్ శర్మ గారికి, ఇంకా ఈ రోజు ప్రమాణం స్వీకరించిన వారందరికీ అభినందనలు. మీరంతా ఉత్తర ప్రదేశ్ కు ఉత్తమమైన సేవలను అందించాలని ఆకాంక్షిస్తున్నాను.

ఈ కొత్త జట్టు ఉత్తర ప్రదేశ్ ను ఉత్తమ ప్రదేశ్ గా మార్చడంలో శాయశక్తుల కృషి చేస్తుందన్న గొప్ప విశ్వాసం నాలో ఉంది. అభివృద్ధిలో సరికొత్త ప్రమాణాన్ని నెలకొల్పడం జరుగుతుంది.

మన ఏకైక లక్ష్యం మరియు ప్రేరణ అభివృద్ధే. ఉత్తర ప్రదేశ్ అభివృద్ధి చెందినప్పుడు, భారతదేశం అభివృద్ధి చెందుతుంది. ఉత్తర ప్రదేశ్ యువతకు సేవ చేయాలని మరియు వారి కోసం అవకాశాలను కల్పించాలని మేం కోరుకుంటున్నాం” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.