Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ ఆత్మీయ శుభాకాంక్షలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రధానమంత్రి


 తనకు ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి శ్రీ సి.పిరాధాకృష్ణన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కృతజ్ఞతలు తెలిపారుదేశ సేవలో మరింత కష్టపడి పని చేసేందుకు భారత ప్రజల విశ్వాసంఆశీస్సులు తనకు స్ఫూర్తినిస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

సుసంపన్నమైన మన నాగరికతా వారసత్వం పట్ల గర్వపడే వికసిత్ భారత్‘ నిర్మాణమే తన ప్రయత్నాలన్నింటికీ దిశానిర్దేశం చేస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారుమన తోటి భారతీయులందరి కలలుఆకాంక్షలను సాకారం చేసే దిశగా అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతామని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.

ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

ఉపరాష్ట్రపతి శ్రీ సి.పిరాధాకృష్ణన్ గారూమీ ఆత్మీయ శుభాకాంక్షలకు ధన్యవాదాలు.

భారత ప్రజల విశ్వాసంఆశీస్సులు దేశ సేవలో మరింత కష్టపడి పని చేసేలా నాకు స్ఫూర్తినిస్తాయిసుసంపన్నమైన మన నాగరికతా వారసత్వం పట్ల గర్వపడే వికసిత్ భారత్‘ ను నిర్మించడమే లక్ష్యంగా నా ప్రయత్నాలన్నీ కొనసాగుతాయిమన తోటి భారతీయుల కలలుఆకాంక్షలను సాకారం చేయడంలో అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి

***