పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఇచ్చినటువంటి సందేశం ఈ క్రింది విధం గా ఉంది.
“మీకు అందరి కి మరియు యావత్తు ఉపాధ్యాయ లోకాని కి హాపీ టీచర్స్ డే.
ఈ రోజు యావత్తు బోధన సమాజాని కి, వారు పడే కఠోర శ్రమ కు, ప్రదర్శించే సమర్పణ భావాని కి మరియు వారి యొక్క వచన బద్ధత కు వందనాన్ని ఆచరించవలసిన రోజు. తరగతి గది లో పాఠ్యాంశాల ను బోధించడం తో పాటు ఉపాధ్యాయులు అసామాన్యమైన గురువులు గా, మార్గదర్శులు గా ఉంటున్నారు. వారి యొక్క విద్యార్థుల జీవితాల లో వారు ప్రముఖమైన పాత్రల ను పోషిస్తుంటారు.
ఉపాధ్యాయుల నిస్వార్ధ స్వభావం సార్వత్రికం గా ప్రశంసల కు నోచుకొంటున్నది. ఉపాధ్యాయులు వారికి తీరిక లేనటువంటి కార్యక్రమాల తో మరియు కుటుంబ పరమైన బాధ్యతల తో ఉంటున్నా, విద్యార్థులు ఇట్టే కొత్త కొత్త ఆలోచనల ను భావనల ను చేసేటట్టుగా మరియు కొంగొత్త భావనల ను గ్రహించడాని కి ఉపాధ్యాయులు చొరవల ను తీసుకొంటారు.
ఫలితాల పై దృష్టి సారించండి:
ప్రస్తుతం భారతదేశం విద్య రంగం లో ఒక సమూల మార్పునకు సాక్షి గా నిలుస్తున్నది. మనం కేవలం వ్యయాల పై శ్రద్ధ తీసుకొనేటటువంటి సాంప్రదాయక వైఖరి కి దూరం గా జరిగి, ఫలితాల కు ప్రస్తుతం ప్రాధాన్యాన్ని ఇస్తున్నాము. ఈ సందర్భం లో, మన ఉపాధ్యాయులు యువ మస్తిష్కాల లో పరిశోధన సంబంధమైనటువంటి మరియు నూతన ఆవిష్కరణల కు పూనుకొనేటటువంటి స్ఫూర్తి ని జ్వలింప చేయడం కోసం కఠోరం గా శ్రమిస్తుండటాన్ని చూసి నాకు ఆనందం కలుగుతున్నది. ఈ ప్రేరణే మన యువత కు స్వయంగా వారి కోసం, అలాగే దేశం కోసం అసాధారణమైన పనుల ను సాధించే శక్తి ని ప్రసాదించ గలుగుతుంది.
ఒకసారి ఉపయోగించే ప్లాస్టిక్ ను అడ్డుకోవడం లో తోడ్పడండి:
ఈ ఉపాధ్యాయ దినోత్సవం నాడు నా తోటి ఉపాధ్యాయుల ను నేను ఒక విషయమై అభ్యర్థిస్తున్నాను. మీకు తెలుసు.. భారతదేశం ఒకసారే వాడేటటువంటి ప్లాస్టిక్ ను నిర్మూలించాలని ఒక ప్రజాందోళన ను చేపట్టిందన్న సంగతి. ఈ ఉద్యమం లో ఉపాధ్యాయ లోకం తన క్రియాశీల మద్ధతు ను మరియు భాగస్వామ్యాన్ని అందించాలని నేను కోరుతున్నాను. ఒకసారి ఉపయోగాని కి ఉద్దేశించిన ప్లాస్టిక్ మన పర్యావరణాని కి వాటిల్లజేసే హాని ని గురించి విద్యార్థుల కు ఉపాధ్యాయులు వివరించ గలిగారంటే గనుక ఈ ఆశయ సాధన లో భాగం పంచుకోవడాని కి విద్యార్థులు ఉత్తేజితులు కాగలుగుతారు. ప్రియతమ బాపూజీ కి ఆయన 150వ జయంతి కి ఇది ఒక గొప్ప నివాళి కాగలదు.
ఈ రోజు న, నేను స్వయానా ఒక సూక్ష్మ బుద్ధి కలిగిన ఆచార్యుడు మరియు మార్గదర్శి అయినటువంటి మహానుభావుడు డాక్టర్ ఎస్. రాధాకృష్ణన్ కు కూడాను నివాళులు అర్పిస్తున్నాను. బోధన వృత్తి లో చేరేలాగాను, యువ మస్తిష్కాల ను వికసింప జేసేలాగాను మరింత మంది కి ఆయన జీవితం స్ఫూర్తి ని అందించు గాక!
మరొక్క మారు, ఇవే ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.”