పిఎంఇండియా
అందరి అంకిత భావంతో, కృషితో దేశ ప్రగతి దృఢతరంగా మారుతుందని స్పష్టం చేస్తున్న సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు. సమాజంలో కొత్త శక్తిని నింపి, అభివృద్ధికి సంబంధించిన సంకల్పాల్ని నెరవేర్చుకోవడానికి బాట వేసేది ఈ భావనేనని ఆయన అన్నారు.
‘‘యత్రోత్సాహసమారంభో యత్రాలస్యవిహీనతా
నయవిక్రమసంయోగస్తత్ర శ్రీరచలా ధ్రువమ్’’ అన్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘సామూహిక అంకితభావంతో, మానవ ప్రయత్నం తో దేశ సౌభాగ్యం వర్ధిల్లుతుంది. ఈ భావన సమాజానికి కొత్త శక్తినివ్వడంతో పాటు అభివృద్ధి సంకల్పాలను సాకారం చేసుకొనేందుకు మార్గాన్ని సుగమం చేస్తుంది’’ అని పేర్కొన్నారు.
***
सामूहिक समर्पण और पुरुषार्थ से राष्ट्र की समृद्धि अक्षुण्ण रहती है। यही भावना समाज को नई ऊर्जा देती है और विकास के संकल्पों को सिद्धि तक पहुंचाने का मार्ग प्रशस्त करती है।
— Narendra Modi (@narendramodi) June 24, 2026
यत्रोत्साहसमारम्भो यत्रालस्यविहीनता।
नयविक्रमसंयोगस्तत्र श्रीरचला ध्रुवम्॥ pic.twitter.com/DoeTxm3sBX