పిఎంఇండియా
ఎన్నికల నిర్వహణ కు ఏర్పాట్లు మరియు ఎన్నికల కు సంబంధించిన పరిపాలన సహకారం అంశాల పై భారత ఎన్నికల సంఘాని కి మరియు మాల్దీవ్స్ యొక్క ఎన్నికల సంఘాని కి మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రాన్ని (ఎంఒయు) కుదుర్చుకోవాలన్న ప్రతిపాదన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎన్నికల ప్రక్రియ తాలూకు వ్యవస్థీకృతమైనటువంటి మరియు సాంకేతిక పరమైనటువంటి వికాసానికి సంబంధించిన జ్ఞానాన్ని మరియు అనుభవాన్ని ఒక పక్షాని కి మరొక పక్షం ఇచ్చి పుచ్చుకోవడం, సంస్థాగత పటిష్టీకరణ, ఇంకా సామర్థ్య నిర్మాణం, సిబ్బంది కి శిక్షణ ను ఇవ్వడం మరియు సంప్రదింపులు జరపడాన్ని క్రమం తప్పక కొనసాగించడం వంటివి దీని లో భాగం గా ఉంటాయి.
ప్రతిపాదిత ఎంఒయు ద్వైపాక్షిక సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా, మాల్దీవ్స్ యొక్క ఎన్నికల సంఘాని కి సాంకేతిక సహకారాన్ని మరియు సామర్ధ్య నిర్మాణం లో సహాయాన్ని అందించడం, ఎన్నికల ఏర్పాట్లు మరియు ఎన్నికల సంబంధిత పాలన వ్యవహారాల లో సమన్వయం పై శ్రద్ధ తీసుకోవడం కూడా ఈ ఎంఒయు యొక్క లక్ష్యాల లో భాగం గా ఉన్నాయి.