Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఎయర్ ఇండియా, దాని అధీన సంస్థ లు/జెవి లలో పెట్టుబ‌డుల ఉపసంహ‌ర‌ణ‌కు ఎస్‌పివి స్థాపన కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


ఎయర్ ఇండియా, దాని అధీన సంస్థ లు, జెవి లలో పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ‌ కోసం స్పెశల్ ప‌ర్పస్ వెహికల్‌ (ఎస్‌పివి) స్థాపన మరియు వాటి తో జత పడిన ఇత‌ర కార్య‌క‌లాపాల‌ కోసం ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ అధ్య‌క్ష‌త‌ న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.

వివ‌రాలు:

నాలుగు అధీన సంస్థలు (ఎయర్ ఇండియా ఎయర్ ట్రాన్స్‌పోర్ట్ స‌ర్వీస్ లిమిటెడ్‌- [ఎఐఎటిఎస్ఎల్‌], ఎయర్‌లైన్ అలైడ్ స‌ర్వీసెస్‌ లిమిటెడ్‌ [ఎఎఎస్ఎల్‌], ఎయర్ ఇండియా ఇంజినీరింగ్ స‌ర్వీసెస్ లిమిటెడ్ [ఎఐఇఎస్ఎల్‌] హోట‌ల్ కార్పోరేశన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ [హెచ్‌సిఐ]ల కోసం, అప్రధాన ఆస్తులు, చిత్రలేఖనాలు మరియు మానవీయ క‌ళాకృతులు, ఎయర్ ఇండియా కు సంబంధించి ఇత‌ర‌ నాన్ ఆప‌రేశన‌ల్ ఆస్తుల‌ తో పాటు ఎటువంటి ఆస్తుల హామీ లేని సంచిత వ‌ర్కింగ్ కేపిట‌ల్ లోన్‌ కు ఎయిర్ ఇండియా అసెట్స్ హోల్డింగ్ లిమిటెడ్ (ఎఐఎహెచ్ఎల్‌) పేరు తో ఒక ఎస్‌పివి ని ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది.

నూతన ఎస్ పివి స్థాపన కై పౌర‌ విమాన‌యాన మంత్రిత్వ‌ శాఖ (ఎంఒసిఎ) ఉత్త‌ర్వు ను జారీ చేసింది. ఎస్ పివి ని.. ఎయర్ ఇండియా అసెట్స్ హోల్డింగ్ లిమిటెడ్‌ పేరు తో 2018వ సంవత్సరం జ‌న‌వ‌రి 22 వ తేదీ న ఏర్పాటు చేయడమైంది. ఈ ఎస్‌ పివి యొక్క బోర్డ్ ఆఫ్ డైర‌క్ట‌ర్స్ లో ఎయర్ ఇండియా లిమిటెడ్ సిఎండి తో పాటు ఎంఒసిఎ, డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎక్స్‌పెన్డిచ‌ర్‌, డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎక‌నామిక్ అఫైర్స్‌, డిఐపిఎఎమ్ ల సంయుక్త కార్యదర్శులు, ఇంకా డైరెక్టర్ (ఫైనాన్స్) ఎయర్ ఇండియా లిమిటెడ్ లు ఉంటారు.

ఇప్ప‌టివ‌ర‌కు ఎఐఎటిఎస్ఎల్ పేరు గ‌ల ఒక అధీన సంస్థ ను ఎఐఎహెచ్ఎల్‌ కు బ‌దిలీ చేయడమైంది. ఎయర్ ఇండియా లిమిటెడ్‌, ఎఐఎహెచ్ఎల్ ల మ‌ధ్య వాటా కొనుగోలు ఒప్పందం కింద, రుణ‌దాత‌ల అనుమ‌తి, వివిధ ఇత‌ర ష‌ర‌తులు, సంప్ర‌దాయాల‌కు లోబ‌డి ఈ బ‌దిలీ జ‌రిగింది.

ఎఐఎటిఎస్ఎల్ కు సంబందించి పెట్టుబడి ఉప‌సంహ‌ర‌ణ విష‌య‌మై ప్రాథ‌మిక స‌మాచార ప‌త్రం (పిఐఎం)ని ఎఐఎటిఎస్ఎల్ 12.02.2019న జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఆస‌క్తి వ్య‌క్తీక‌ర‌ణ‌ కు గ‌డువు ను 26.0302019గా పేర్కొంది.

కొత్త‌గా ఏర్ప‌డిన ఎస్‌.పి.వికి ప్ర‌భుత్వం ఈ కింది వాటి ని బ‌దిలీ చేయాలని నిర్ణ‌యించింది:

29,464 కోట్ల రూపాయ‌ల ఎయర్ ఇండియా లిమిటెడ్ రుణం; ఎయర్ ఇండియా వ్యూహాత్మ‌క పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ‌ లో భాగం కాని అధన సంస్థలైన ఎఐఎటిఎస్ఎల్‌, ఎఐఇఎస్ఎల్‌, ఎఎఎస్ఎల్‌ ల‌ను ఎస్‌ పివి కి బ‌దిలీ చేస్తారు. అలాగే

అప్ర‌ధాన అస్తులు, చిత్రలేఖనాలు, మానవీయ క‌ళాకృతులు, ఎయర్ ఇండియా కు చెందిన ఇత‌ర నాన్ ఆప‌రేశన‌ల్ ఆస్తులు బ‌ద‌లాయిస్తారు.

ప్ర‌భావం:

ఈ ఆమోదం తో ఎయర్ ఇండియా యొక్క అధీన కంపెనీలు.. ఎఐఎటిఎస్ఎల్‌, ఎఐఇఎస్ఎల్, ఎఎఎస్ ఎల్‌, ఇంకా హెసిఐ.. ల యొక్క సరకుల గిడ్డంగులు కొత్త గా ఏర్పాటు చేసిన ఎస్ పివి కంపెనీ కి బ‌దిలీ అవుతాయి. పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ ద్వారా లభించిన మొత్తాన్ని ఎస్‌పివి లో ఉంచిన ఎటువంటి ఆస్తుల హామీ లేని ఎయర్ ఇండియా వర్కింగ్ కేపిటల్ రుణ బాధ్య‌త ను తీర్చడం కోసం వినియోగిస్తారు.