Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఏప్రిల్ 13న ‘నారీ శక్తి వందన్’ సమ్మేళనంలో ప్రసంగించనున్న పీఎం


ఏప్రిల్ 13, 2026న ఉదయం 11 గంటల సమయంలో న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జాతీయ స్థాయి నారీ శక్తి వందన్’ సమ్మేళనంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొంటారుఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తారు.

ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులుఉన్నత శిఖరాలను అధిరోహించిన మహిళలు పాల్గొంటారుప్రభుత్వంవిద్యారంగంశాస్త్ర సాంకేతికక్రీడలువ్యాపార రంగంమీడియాసామాజిక సేవసాంస్కృతిక రంగాల ప్రతినిధులు ఈ సమ్మేళనానికి విచ్చేయనున్నారు.

శాసనసభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచే దిశగా సెప్టెంబర్ 2023లో నారీ శక్తి వందన్ అధినియంను పార్లమెంట్ ఆమోదించి చరిత్రాత్మక ముందడుగు వేసిందిలోక్‌సభరాష్ట్ర శాసనసభల్లో మహిళలకు మూడో వంతు సీట్ల రిజర్వేషన్‌ను ఈ చట్టం కల్పిస్తుందిదేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్ల అమలుపై దృష్టి సారిస్తూ ఏప్రిల్ 16న పార్లమెంట్ సమావేశం జరగనుంది.

భారత అభివృద్ధి పథాన్ని నిర్దేశించటంలో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠం చేసే లక్ష్యంతో ఈ సమ్మేళనం జరుగుతుందిపంచాయతీ నుంచి పార్లమెంటు వరకు అన్ని స్థాయుల్లో పెరుగుతున్న మహిళా నాయకత్వాన్ని ఇది తెలియజేస్తుందినిర్ణయాధికార ప్రక్రియల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచాల్సిన ఆవశ్యకతను ఈ సమ్మేళనం స్పష్టం చేస్తుంది.

వికసిత్ భారత్-2047 లక్ష్య సాధనలో మహిళల పాత్రను ఈ సమ్మేళనం తెలియజేస్తుందివికసిత్ భారత్-2047 దార్శనికతలో మహిళా నేతృత్వంలోని అభివృద్ధే లక్ష్యంగా కొనసాగిస్తున్న ప్రభుత్వ నిబద్ధతకు ప్రతిబింబంగా ఈ కార్యక్రమం నిలుస్తుంది.

 

***