Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఏప్రిల్ 15న కర్ణాటకలో ప్రధాని పర్యటన


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 ఏప్రిల్ 15న కర్ణాటకలో పర్యటించనున్నారుఉదయం 11 గంటల ప్రాంతంలో మాండ్యా జిల్లాలోని శ్రీ క్షేత్ర ఆదిచుంచనగిరిలో శ్రీ గురు భైరవైక్య మందిరాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారుఈ సందర్భంగా సభనుద్దేశించి ప్రసంగిస్తారు.

ఈ పర్యటన సందర్భంగా.. మాజీ ప్రధానమంత్రి శ్రీ హెచ్.డిదేవెగౌడతో కలిసి ‘సౌందర్యలహరిశివమహిమ్న స్తోత్రం’ అనే పుస్తకాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సంయుక్తంగా ఆవిష్కరిస్తారు.

శ్రీ ఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠానికి 71వ పీఠాధిపతి అయిన శ్రీశ్రీశ్రీ డాబాలగంగాధరనాథ మహాస్వామీజీ స్మారకార్థం శ్రీ గురు భైరవైక్య మందిరాన్ని నిర్మించారుదివంగత మహాస్వామీజీ జీవిత విశేషాలనూవారి మహోన్నత పరంపరనూ చాటేలా.. సంప్రదాయ ద్రవిడ వాస్తుశైలిలో ఈ మందిరాన్ని నిర్మించారుఈ మందిరం పూజనీయ క్షేత్రం మాత్రమే కాదు.. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం కూడా.

శ్రీ శ్రీ శ్రీ బాలగంగాధరనాథ మహాస్వామీజీ అనేక విద్యాసంస్థలనుఆరోగ్య కేంద్రాలను నెలకొల్పి జీవితాంతం సమాజ సేవకే అంకితమయ్యారుసమాజసేవనే అత్యున్నతమైన దైవసేవగా బలంగా విశ్వసించారుకులమతప్రాంతాలకు అతీతంగా సాగిన ఆయన బోధనలు లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చాయి.

***