Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఐఆర్ఆర్ఐ మ‌రియు మ‌హావీర్ ఫిలిప్పీన్ ఫౌండేష‌న్ ల‌ను సంద‌ర్శించిన ప్ర‌ధాన మంత్రి

ఐఆర్ఆర్ఐ మ‌రియు మ‌హావీర్ ఫిలిప్పీన్ ఫౌండేష‌న్ ల‌ను సంద‌ర్శించిన ప్ర‌ధాన మంత్రి

ఐఆర్ఆర్ఐ మ‌రియు మ‌హావీర్ ఫిలిప్పీన్ ఫౌండేష‌న్ ల‌ను సంద‌ర్శించిన ప్ర‌ధాన మంత్రి

ఐఆర్ఆర్ఐ మ‌రియు మ‌హావీర్ ఫిలిప్పీన్ ఫౌండేష‌న్ ల‌ను సంద‌ర్శించిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు ఫిలిప్పీన్స్ లోని లోస్ బానోస్ లో అంత‌ర్జాతీయ వ‌రి ప‌రిశోధ‌న సంస్థ (ఐఆర్ఆర్ఐ) ని సంద‌ర్శించారు. వ‌రికి సంబంధించిన శాస్త్ర విజ్ఞానాన్ని ఉప‌యోగించి ఆక‌లిని మ‌రియు పేద‌రికాన్ని త‌గ్గించ‌డానికి, వ‌రి రైతులు మ‌రియు వినియోగ‌దారుల ఆరోగ్యాన్ని, సంక్షేమాన్ని మెరుగు ప‌ర‌చ‌డానికి, ఇంకా వ‌రి పండే పంట పొలాల‌ను భావి త‌రాల వారి కోసం సంర‌క్షించ‌డానికి అంకిత‌మైన ఒక ప్ర‌ధాన ప‌రిశోధ‌న సంస్థే ఐఆర్ఆర్ఐ.

వ‌ర‌ద‌ల‌కు త‌ట్టుకొనే బియ్యం ర‌కాల‌ను, అనావృష్టి ప‌రిస్థితుల‌ను భ‌రించ‌గ‌లిగే వ‌రి ర‌కాల‌ను, ల‌వ‌ణీయ‌త‌ను భ‌రించే వ‌రి ర‌కాల‌ను మ‌రియు మ‌హిళా సాగు స‌హ‌కార సంఘాలతో కలిసి ఐఆర్ఆర్ఐ చేస్తున్న కృషి.. వీటిని క‌ళ్ళ‌కు క‌ట్టే ఒక ఛాయా చిత్ర ప్ర‌ద‌ర్శ‌న‌ను ప్ర‌ధాన మంత్రి ఈ సంద‌ర్భంగా ప‌రిశీలించారు.

నీట మునిగినా త‌ట్టుకొని నిలువ‌గ‌లిగే వ‌రి ర‌కాలకు ప్ర‌త్యేకించిన ఒక నూత‌న ప్ర‌దేశం ప్రారంభ సూచ‌కంగా కొంత నేల‌ను ప్ర‌ధాన మంత్రి త‌వ్వారు. శ్రీ న‌రేంద్ర మోదీ రెజిల్యంట్ రైస్ ఫీల్డ్ లేబొరేట‌రీ ప్రారంభ సూచ‌కంగా ఒక ఫ‌ల‌కాన్ని ఆయ‌న ఆవిష్క‌రించారు. అలాగే, రెండు భార‌తీయ వ‌రి విత్త‌న ర‌కాల‌ను ఐఆర్ఆర్ఐ జీన్ బ్యాంకు కు ఆయ‌న బ‌హూక‌రించారు.

ప్ర‌ధాన మంత్రి ఐఆర్ఆర్ఐ సందర్శన క్రమంలో భాగంగా, అక్కడ ప‌ని చేస్తున్న ప‌లువురు భార‌తీయ శాస్త్రవేత్త‌ల‌తో ముఖాముఖి చ‌ర్చించారు.

మ‌నీలా లో మ‌హావీర్ ఫిలిప్పీన్ ఫౌండేష‌న్ ను కూడా ప్ర‌ధాన మంత్రి సంద‌ర్శించారు. ఈ క‌రుణామ‌య స‌హ‌కార కార్య‌క్ర‌మాన్ని భార‌త‌దేశం మ‌రియు ఫిలిప్పీన్స్ లు దీర్ఘ‌కాలంగా నిర్వ‌హిస్తూ వ‌స్తున్నాయి. భార‌తీయ సంత‌తికి చెందిన మ‌నీలా మేయ‌ర్ డాక్ట‌ర్ ర‌మోన్ భ‌గ‌త్‌సింగ్ ఈ ఫౌండేష‌న్‌ను స్థాపించారు. కాళ్ళు కోల్పోయిన వారికి జైపుర్ పాదాల‌ను అమ‌ర్చ‌డంలో మ‌హావీర్ విక‌లాంగ్ స‌హాయ‌క స‌మితి స‌హ‌కారంతో ఈ ఫౌండేష‌న్ ఉడుతా భ‌క్తిగా సాయాన్ని అందిస్తోంది. జైపుర్ పాదాల వ‌ల్ల ల‌బ్దిని పొందిన వారితో ప్ర‌ధాన మంత్రి భేటీ అయ్యి, వారితో ముఖాముఖి చ‌ర్చించారు.

***