Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఐటి & ఇ రంగంలో భారతదేశం మరియు పోర్చుగల్ ల మధ్య సహకారానికి ఉద్దేశించిన ఎమ్ఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఐటి & ఇ రంగంలో భారతదేశం మరియు పోర్చుగల్ ల మధ్య సహకారానికి ఉద్దేశించిన ఒక అవగాహనపూర్వక ఒప్పందం (ఎమ్ఒయు)కు ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది. ఈ ఎమ్ఒయు పై 2017 జనవరి 6వ తేదీన న్యూ ఢిల్లీ లో సంతకాలు జరిగాయి.

ఐటి & ఇ రంగంలో పరస్పరం సమానత్వం, ఆసక్తి ల ప్రాతిపదికన ఉభయ దేశాల చట్టాలకు మరియు నిబంధనావళికి అనుగుణంగా కొనసాగే, దీర్ఘకాలికమైన సహకారాన్ని అభివృద్ధిపరచడంలో ఈ ఎమ్ఒయు తోడ్పడగలదు.

***