Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఐడీఎఫ్‌సి బ్యాంకును ప్రారంభించిన ప్ర‌ధాని

ఐడీఎఫ్‌సి బ్యాంకును ప్రారంభించిన ప్ర‌ధాని

ఐడీఎఫ్‌సి బ్యాంకును ప్రారంభించిన ప్ర‌ధాని

ఐడీఎఫ్‌సి బ్యాంకును ప్రారంభించిన ప్ర‌ధాని

ఐడీఎఫ్‌సి బ్యాంకును ప్రారంభించిన ప్ర‌ధాని

ఐడీఎఫ్‌సి బ్యాంకును ప్రారంభించిన ప్ర‌ధాని

ఐడీఎఫ్‌సి బ్యాంకును ప్రారంభించిన ప్ర‌ధాని


గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో బ్యాంకింగ్ రంగం కీల‌క‌మైన పాత్ర‌ను పోషించ‌నున్న‌ద‌ని ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు. కొన్నేళ్ల క్రితం టెలికామ్ రంగం సాధించిన అభివృద్ధిలాగే బ్యాంకింగ్ రంగం అభివృద్ధి ఉండ‌బోతున్న‌ద‌ని ఆయ‌న అన్నారు. న్యూఢిల్లీలో ఐడీఎఫ్‌సి బ్యాంకు ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ఆయ‌న బ్యాంకింగ్ రంగం బాగోగుల‌పై మాట్లాడారు.

గ‌త 18 సంవ‌త్స‌రాలుగా ఐడిఎఫ్‌సి బ్యాంకు సాగించిన విజ‌య‌వంత‌మైన ప్ర‌స్థానాన్ని ఆయ‌న ప్ర‌శంసించారు. ఐడీఎఫ్‌సి రాను రాను మ‌రిన్ని స‌వాళ్ల‌ను ఎదుర్కోనున్న‌ద‌ని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ రంగాన్ని విస్త‌రించ‌డంద్వారా అది స‌మ‌ర్థ‌నీయ‌మైన పాత్ర‌ను పోషిస్తుంద‌ని ఆయ‌న అన్నారు. ప్రాథ‌మిక సౌక‌ర్యాల నిర్మాణంకోసం ఇంత‌వ‌ర‌కు కృషి చేసిన‌ ఐడీఎఫ్‌సి ముందు ముందు ప్ర‌జ‌ల జీవితాల నిర్మాణంలో కూడా పాలుపంచుకోనున్న‌ద‌ని ఆయ‌న వివ‌రించారు.

నూత‌న సాంకేతిక విజ్ఞానం అందుబాటులోకి వ‌స్తుండ‌డంతో మొత్తం బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ స‌మూల‌మైన మార్పుల‌కు లోను కానున్న‌ద‌ని ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు. భ‌వ‌నాలతోనూ, పేప‌ర్‌తోనూ అవ‌స‌రం లేని వ్య‌వ‌స్థ‌గా బ్యాంకింగ్ రూపుదిద్దుకోవ‌డ‌మే కాకుండా క‌రెన్సీర‌హిత బ్యాంకింగ్ లాగా అవ‌త‌రిస్తుంద‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. దీనివ‌ల్ల దేశంలో బ్లాక్ మ‌నీ అనేది త‌గ్గిపోతుంద‌ని ఆయ‌న అన్నారు.

బ్యాంకింగ్ రంగంలో కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్క‌ర‌ణ‌ల్ని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ వివ‌రించారు. సీనియ‌ర్ల నియామకం, బ్యాంక్ బోర్డు బ్యూరో ఏర్పాటు, బ్యాంకులు తిరిగి మూల‌ధ‌నాన్ని స‌మీక‌రించుకోవ‌డం, ఆస్తుల స‌ర‌ళీక‌ర‌ణ‌, బ్యాంకు మేనేజ్‌మెంట్‌కు త‌గిన అధికారాలు ఇవ్వ‌డం, సంబంధంలేనివారు బ్యాంకింగ్ రంగంలో చేయి పెట్ట‌కుండా చూసుకోవ‌డం, కీల‌క‌మైన ప‌ని సామ‌ర్థ్య సూచిక‌ల‌ద్వారా బాధ్య‌తాయుత వ్య‌వ‌స్థను త‌యారు చేసుకోవ‌డం, బ్యాంకుల నిర్వ‌హ‌ణ‌లో సంస్క‌ర‌ణ‌లు తేవ‌డం మొద‌లైన అంశాల‌పై ప్ర‌ధాని మాట్లాడారు.

ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ, కేంద్ర ఆర్థిక శాఖ స‌హాయ‌క శాఖ మంత్రి శ్రీ జ‌యంత్ సిన్హా పాల్గొన్నారు.

***