Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఒక నవ భారతదేశాన్ని నిర్మించే దిశగా వచనబద్ధులమవుదామన్న ప్రధాన మంత్రి


ఒక నవ భారతదేశాన్ని ఆవిష్కరించేందుకు పౌరులు ప్రతిజ్ఞ చేయాలని, తద్వారా వారి వచనబద్ధతను వ్యక్తం చేయాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.

ఎన్ఎమ్ మొబైల్ యాప్ http://nm4.in/dnldapp లో ప్రధాన మంత్రి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

“ఒక కొత్త భారతదేశం ఆవిర్భవిస్తోంది. 125 కోట్ల మంది భారతీయుల బలం, నైపుణ్యాలే ఈ నూతన దేశానికి చోదకశక్తులు. ఈ భారతదేశం అభివృద్ధికి మరో పేరుగా ఉంటుంది.

మనం 2022వ సంవత్సరంలో 75 సంవత్సరాల స్వాతంత్ర్యం మైలురాయిని చేరుకొనేటప్పటికి గాంధీ గారు, సర్దార్ పటేల్, ఇంకా డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ లు గర్వపడే భారతదేశాన్ని రూపొందించి తీరాలి” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.