Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఒక బస్సు ప్రమాద ఘటన కారణంగా అమర్ నాథ్ యాత్రికులకు ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల వేదనను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి; ప్రమాద బాధితులకు అనుగ్రహపూర్వక సహాయాన్ని ఆయన ప్రకటించారు


జమ్ము & కశ్మీర్ లో జరిగిన ఒక బస్సు ప్రమాద ఘటనలో అమర్ నాథ్ యాత్రికులకు ప్రాణనష్టం వాటిల్లడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వేదనను వ్యక్తం చేశారు.

‘‘జమ్ము & కశ్మీర్ లో జరిగిన ఒక బస్సు ప్రమాద ఘటనలో అమర్ నాథ్ యాత్రికులకు ప్రాణనష్టం వాటిల్లడం నాకు అమిత వేదనను కలిగించింది. మృతుల కుటుంబాల బాధలో నేను పాలుపంచుకొంటున్నాను.

జమ్ము & కశ్మీర్ బస్సు ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి సంబంధికులకు 2 లక్షల రూపాయల చొప్పున మరియు తీవ్రంగా గాయపడిన వారికి 50 వేల రూపాయల చొప్పున అనుగ్రహపూర్వక చెల్లింపును ప్రధాన మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు.