Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఓపెన్ ఏఐ సీఈవోతో ప్రధాని బేటీ

ఓపెన్ ఏఐ సీఈవోతో ప్రధాని బేటీ


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో.. ఓపెన్ సీఈవో శ్రీ శాం ఆల్ట్‌మన్ ఈ రోజు సమావేశమయ్యారు.

ఏఐ రంగంలో భారత్ విశేషంగా పురోగమిస్తోందనీ, ప్రతిభలోనూ ఆవిష్కరణల్లోనూ అంతర్జాతీయ కేంద్రంగా ఎదగబోతోందనీ ఈ సమావేశం అనంతరం ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.

 

ఈ విప్లవాత్మక రంగంలో నవోత్తేజాన్ని నింపేలా.. ప్రతిభావంతులైన భారతీయ యువతపై విశ్వాసంతో పెట్టుబడులు పెట్టాలని అంతర్జాతీయ సమాజానికి ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.

 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శాం ఆల్ట్‌మన్ చేసిన ఓ పోస్టుపై స్పందిస్తూ, శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

 

“నిజంగా ఇదొక అద్భుతమైన సమావేశం. ఏఐ ప్రపంచంలో భారత్ విశేష పురోగతి సాధిస్తోంది. ప్రతిభావంతులైన మా యువతపై నమ్మకంతో పెట్టుబడులు పెట్టి, ఈ రంగానికి ఉత్తేజాన్నివ్వాల్సిందిగా ప్రపంచానికి ఆహ్వానం పలుకుతున్నాం”.

 

***