పిఎంఇండియా
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్ ) క్యాంపస్లలో ఓబీసీ విద్యార్ధులకు రిజర్వేషన్ల అమలుకు వీలుగా ఆయా నిఫ్ట్ల స్థాయి పెంపు – నిధుల వినియోగం గడువు పొడిగింపునకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. నిధుల గడువు పెంపుతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న బ్యాలెన్సు నిధులు రూ.90.13 కోట్ల ను 2017 మార్చి లోపు ఉపయోగించుకోవచ్చు. ఈ నిధులతో నిఫ్ట్ క్యాంపస్ లలో ఓబీసీ రిజర్వేషన్స్ అమలు కు వీలుగా అదనపు తరగతి గదులు, వసతి గృహాల నిర్మాణం, ఇతర సౌకర్యాలను కల్పించేందుకు వీలవుతుంది.
నేపథ్యం :
కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ 1986 వ సంవత్సరంలో సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం 1980 ప్రకారం నిఫ్ట్ ను స్వయం ప్రతిపత్తి గల సొసైటీగా ఏర్పాటు చేసింది. ఫ్యాషన్ టెక్నాలజీ లో నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో నిఫ్ట్ ను నెలకొల్పింది. దేశవ్యాప్తంగా ఉన్న 15 క్యాంపస్ ల ద్వారా పుల్ టైమ్ డిగ్రీ కోర్సును అందిస్తున్నారు. ప్రస్తుతం కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం నిఫ్ట్ క్యాంపస్ లలో ఆదనపు తరగతి గదులు, హాస్టల్ వసతి ఇతర మౌలిక సదుపాయాలను కల్పించటానికి దోహదపడుతుంది.