Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కంబోడియా రాజ్య ప్ర‌ధాని భార‌తదేశ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా కుదిరిన ఎమ్ఒయులు /ఒప్పందాల జాబితా (జ‌న‌వ‌రి 27, 2018)


1.

కంబోడియాతో 2018-2022 మధ్య సాంస్కృతిక ఆదాన ప్రదాన కార్యక్రమం. భారతదేశానికి, కంబోడియా కు మధ్య మైత్రీ సంబంధాల పటిష్ఠీకరణను,  సాంస్కృతిక ఆదాన ప్రదానాలను ఈ ఒప్పందం ప్రోత్సహించగోరుతుంది.

భారతదేశం తరఫున:
డాక్టర్ మహేశ్ శర్మ, భారత ప్రభుత్వ సంస్కృతి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత)
కంబోడియా తరఫున:

శ్రీమతి ఫోవురంగ్ సకోనా, కంబోడియా ప్రభుత్వ సంస్కృతి మరియు  లలిత కళల శాఖ మంత్రి

2.

కంబోడియాలో స్తంగ్ స్వ హాబ్ వాటర్ రిసోర్స్ డివెలప్ మెంట్ ప్రాజెక్టు కోసం 36.92 మిలియ‌న్ యుఎస్ డాల‌ర్ల లైన్ ఆఫ్ క్రెడిట్  కై భార‌త ప్ర‌భుత్వ ఎక్సిమ్ బ్యాంకుకు, కంబోడియా ప్ర‌భుత్వానికి మ‌ధ్య క్రెడిట్ లైన్ అగ్రిమెంటు

భారతదేశం తరఫున:

శ్రీ‌మతి ప్రీతి శ‌ర‌ణ్‌; కార్య‌ద‌ర్శి (తూర్పు), విదేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖ‌

కంబోడియా త‌ర‌ఫున‌:

శ్రీ ఫాన్ ఫ‌ల్లా, క‌ంబోడియా ప్రభుత్వంలో ఆర్థిక- ద్ర‌వ్య వ్య‌వ‌హారాల‌ మంత్రిత్వ శాఖ స‌హాయ‌ మంత్రి

3.

నేర సంబంధ అంశాల‌పై ప‌ర‌స్ప‌ర న్యాయ స‌హాయం. ఇది ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం, న్యాయ‌ స‌హాయం ద్వారా రెండు దేశాలలో నేర‌ నిరోధం, ద‌ర్యాప్తు, విచార‌ణ ప్ర‌క్రియ‌ల మెరుగుదలకు ఉద్దేశించినటువంటిది.

భారతదేశం త‌ర‌ఫున‌:

శ్రీ‌మతి ప్రీతి శ‌ర‌ణ్‌; కార్య‌ద‌ర్శి (తూర్పు), విదేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖ‌
కంబోడియా త‌ర‌ఫున‌:
శ్రీ సియెంగ్ లాప్రెస్, స‌ల‌హాదారు, క‌ంబోడియా ప్రభుత్వంలో సీమాంత‌ర నేరాలు, దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

4.

మాన‌వ అక్ర‌మ ర‌వాణా నిరోధంపై స‌హ‌కారానికి ఎమ్ఒయు. ఇది మానవ అక్ర‌మ ర‌వాణా నిరోధం, ర‌క్ష‌ణ‌, స్వ‌దేశీ ప‌య‌నం సంబంధిత అంశాలలో ద్వైపాక్షిక స‌హ‌కారాన్ని పెంపొందించగోరుతోంది.

భార‌తదేశం త‌ర‌ఫున‌:

శ్రీ‌మతి ప్రీతి శ‌ర‌ణ్‌; కార్య‌ద‌ర్శి (తూర్పు), విదేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖ‌
కంబోడియా త‌ర‌ఫున‌:
శ్రీ‌మతి చో బున్ ఎంగ్, కార్య‌ద‌ర్శి, కంబోడియా ప్ర‌భుత్వ‌ దేశీయ వ్యవహారాల శాఖ (మాన‌వ అక్ర‌మ ర‌వాణా)

వ. సం. ఒప్పందం/ఎమ్ఒయు/సంధి..
అవగాహనపూర్వక ఒప్పందం లక్ష్యం
భారతదేశం మరియు కంబోడియా  ల పక్షాన
ఒప్పంద పత్రాలను ఇచ్చి పుచ్చుకొన్న మంతి/అధికారుల పేరు

***