పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్రం లోని కొన్ని ప్రాంతాలలో తలెత్తిన అనావృష్టిని, నీటి ఎద్దడి ని సమీక్షించేందుకు ఈ రోజు ఏర్పాటైన ఒక ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఈ సమావేశానికి హాజరయ్యారు. భారత ప్రభుత్వ సీనియర్ అధికారులతో పాటు తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ప్రధాన మంత్రి చర్చను మొదలుపెడుతూ, దుర్భిక్షం బారిన పడిన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో విడివిడిగా తాను సమావేశాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్క రాష్ట్ర ప్రత్యేక అవసరాలను అంచనా వేయడానికి, తక్షణ చర్యలతో పాటు దీర్ఘ కాలిక ప్రాతిపదికన తీసుకోదగిన చర్యలపైన కూడా దృష్టిని కేంద్రీకరించడానికి ఈ సమావేశాలను ఉద్దేశించినట్లు తెలిపారు.
జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్ డి ఆర్ ఎఫ్) కింద రాష్ట్రానికి రూ.712.62 కోట్ల నిధులను (స్టేట్ బ్యాలెన్సు లను సర్దుబాటు చేసిన అనంతరం) విడుదల చేశారు. దీనికి తోడు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్ డి ఆర్ ఎఫ్) లో కేంద్ర వాటా గా రాష్ట్రానికి రూ.205.5 కోట్లు 2015-16 కు గాను విడుదల అయ్యాయి. ఎస్ డి ఆర్ ఎఫ్ తొలి కిస్తీ గా మరొక రూ.108 కోట్లు విడుదల చేశారు.
రాష్ట్రం లో నీళ్ల చెరువులు, ఇతర జల నిల్వ నిర్మాణాల పునరుద్ధరణే ముఖ్యోద్దేశంగా తలపెట్టిన ‘మిషన్ కాకతీయ’ కార్యక్రమంలో నమోదైన పురోగతిని గురించి ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రధాన మంత్రికి వివరించారు. గ్రామీణ కుటుంబాలకు సురక్షితమైన తాగు నీటిని అందించడమే ముఖ్యోద్దేశంగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన మరొక ప్రతిష్టాత్మక కార్యక్రమమైన ‘మిషన్ భగీరథ’ కార్యక్రమం వివరాలను కూడా ముఖ్యమంత్రి తెలియజేశారు. నీటిని నిల్వ చేయడానికి, సాగుకు సంబంధించి పలు చారిత్రక ఉదాహరణలు, ఈ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా అనుసరిస్తున్న పద్ధతులలో ఉత్తమమైన పద్ధతులు చర్చకు వచ్చాయి. పట్టణ ప్రాంతాలలోని వ్యర్థ జలాలను ఆయా పట్టణాలకు ఆనుకొని ఉండే గ్రామీణ ప్రాంతాలలో సేద్యానికి వినియోగించాలని ప్రధాన మంత్రి స్పష్టంచేశారు. పూడుకుపోయిన జల మార్గాలను గుర్తించడానికి రిమోట్ సెన్సింగును, ఇంకా స్పేస్ టెక్నాలజీ ని ఉపయోగించుకోవాలని ఆయన అన్నారు. ఈ జల మార్గాలలో మేట వేసిన ఒండ్రును, ఇసుక పూడికను ప్రజా భాగస్వామ్యంతో తొలగించవచ్చునని ఆయన సూచించారు.
సూక్ష్మ సేద్యంలో సాధించిన ప్రగతిని గురించి ముఖ్యమంత్రి ప్రస్తావించారు. రాష్ట్రంలో ఇంతవరకు 40,000 హెక్టార్లను సూక్ష్మ సేద్యం కిందకు తెచ్చినట్లు చెప్పారు.
‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన’ ను ప్రవేశపెట్టినందుకు ప్రధాన మంత్రికి తెలంగాణ ముఖ్యమంత్రి సమావేశం మధ్యలో ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పథకం రైతులకు ఎంతో మేలు చేసే పథకం అని ఆయన అభివర్ణించారు. సి ఎ ఎమ్ పి ఎ (కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్ మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ) యాక్టుకు సవరణలు చేసినందుకు కూడా ప్రధాన మంత్రికి శ్రీ చంద్రశేఖర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈ ఫండ్ ను సమర్థంగా వినియోగించుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక వ్యూహాన్ని రూపొందించాలని ఆయన కోరారు. అలాగే ఆయన తోటల పెంపకానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘హరిత హారం’ కార్యక్రమాన్ని గురించిన వివరాలను కూడా సమావేశంలో తెలియజేశారు.
యావత్తు దేశాన్ని “క్రాప్ కాలనీస్” గా రేఖాచిత్రణ చేయాలని ముఖ్యమంత్రి సూచన చేశారు. ఇలా చేస్తే, తదనుగుణంగా నిర్దిష్ట వ్యూహాలను రూపొందించవచ్చునన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి ఈ సూచనను అభినందించారు. భూమి స్వస్థత కార్డులదీ ఇదే ధ్యేయం
అని ప్రధాన మంత్రి చెప్పారు. రాష్ట్రం ఒక ఆదర్శప్రాయ ప్రణాళికతో ముందుకు రావాలంటూ ఆయన ప్రోత్సహించారు.
కేంద్రం, రాష్ట్రం కలసి పనిచేయాలనే తీర్మానంతో సమావేశం ముగిసింది.
***
Drought mitigation efforts continue at a quick pace…today CMs of Telangana & MP meet PM & discuss drought situation in respective states.
— PMO India (@PMOIndia) May 10, 2016
These meetings come after PM held extensive meetings with CMs of UP, Maharashtra & Karnataka last Saturday to discuss the drought situation.
— PMO India (@PMOIndia) May 10, 2016
Instead of a combined meeting of all states, PM is meeting CMs & officials of each state separately to discuss tackling drought.
— PMO India (@PMOIndia) May 10, 2016
The discussions with CMs are state specific & very detailed thus ensuring the best possible means to collectively mitigate the drought.
— PMO India (@PMOIndia) May 10, 2016
KCR Garu and I met & extensively reviewed the drought & water scarcity situation in Telangana. @TelanganaCMO pic.twitter.com/TWTM0zFoSH
— Narendra Modi (@narendramodi) May 10, 2016
Talked about using space technology to identify blocked water channels, which can then be targeted for desiltation via public participation.
— Narendra Modi (@narendramodi) May 10, 2016
Details on Mission Kakatiya, to rejuvenate water tanks & waters storage structures & progress in micro-irrigation were shared by KCR Garu.
— Narendra Modi (@narendramodi) May 10, 2016
CM KCR also briefed me on Mission Bhagiratha, which aims to provide safe drinking water to rural households. https://t.co/9iDPGs1z1q
— Narendra Modi (@narendramodi) May 10, 2016