Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కరోనావైరస్ అంశం లో సన్నద్ధత ను సమీక్షించిన ప్రధాన మంత్రి


సిఒవిఐడి-19 (కోవిడ్-19)గా వ్యవహరిస్తున్న నావల్ కరోనావైరస్ అంశం లో సన్నాహక చర్యల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమీక్షించారు.

‘‘కోవిడ్-19 నావల్ కరోనావైరస్ అంశం లో సమాయత్తానికి సంబంధించి ఒక విస్తృత సమీక్ష ను నిర్వహించడమైంది.  భారతదేశం లోకి వస్తున్నటువంటి వారిని పరీక్షించడం మొదలుకొని, సకాలం లో వైద్య పరంగా శ్రద్ధ వహించడం వరకు రాష్ట్రాలు మరియు వివిధ మంత్రిత్వ శాఖ లు కలసికట్టు గా కృషి చేస్తున్నాయి.

గాభరాపడవలసిన అగత్యమేం లేదు.  మనమంతా ఉమ్మడి గా పని చేస్తూ, చిన్నవే అయినప్పటికీ స్వయంరక్షణాత్మకమైన ముఖ్య చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

**